నందలూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
కడప - [[తిరుపతి]] మార్గంలో కడప నుంచి 40 కి.మీ. దూరంలో నందలూరు [[చెయ్యేరు|చెయ్యేటి]] (బాహుదానది)కి ఎడమ గట్టున ఉంది. నందలూరులో [[సౌమ్యనాథస్వామి ఆలయం]] విశాలమైనది. సౌమ్యనాథుని నారదముని ప్రతిష్ఠించాడంటారు. 11వ శతాబ్దంలో కుళోత్తుంగచోళుడు ఆలయాన్ని నిర్మించాడు. 12వ శతాబ్దంలో [[కాకతీయ]] [[ప్రతాపరుద్రుడు]] ఈ ఆలయానికి గాలిగోపురం కట్టించాడు. ఇంకా ఈ ఆలయాన్ని [[పాండ్యులు]], [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]], [[పొత్తపి]] పాలకులు, [[మట్లి]] రాజులు అభివృద్ధి చేశారు. సౌమ్యనాథాలయం 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఈ ఆలయానికి 108 స్తంభాలున్నాయి.
ఈ ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ, [[ఆంజనేయ స్వామి]], [[విఘ్నేశ్వరుడు]] ఉన్నారు. ఆలయం గోడల మీద మత్స్య, సింహ చిహ్నాలున్నాయి. గర్భగుడి ముందు ఆలయం కప్పు పై చేప బొమ్మ ఉంది. జలప్రళయం వచ్చి నీరు చేపను తాకినప్పుడు చేప సజీవమై నీటిలో కలిసిపోతుందట. ఆలయ నిర్మాణానికి ఎర్రరాతిని ఉపయోగించారు. ఈ సౌమ్యనాథుని చొక్కనాథుడు అంటారు. [[ఆదికవి]] [[నన్నయ్య|నన్నయ]] ఈ సౌమ్యనాథుని దర్శించి సేవించాడు. నందలూరుకు 5 కి.మీ. దూరాన [[తాళ్ళపాక]] ఉంది. తాళ్ళపాక [[అన్నమయ్య|అన్నమాచార్యులు]] కూడా చొక్కనాథుడిని సేవించాడు.
కాకతీయ [[ప్రతాపరుద్రుడు]] మన్నూరు, హస్తవరం, నందలూరు, అడపూరు, మందరం గ్రామాలను ఈ ఆలయానికి దానంగా ఇచ్చాడు. ఆ గ్రామాల రెవెన్యూ ఇప్పటికీ ఆలయానికే అందుతోంది. నందలూరును నిరందనూరు, నిరంతనూరు, నిరంతాపురం, నెలందలూరు అని కూడా పిలిచేవారు. ఈ గ్రామం ఒకప్పుడు [[బౌద్ధ మతము|బౌద్ధ]] క్షేత్రం. నందలూరుకు సమీపంలోని ఆడపూరు దగ్గర బౌద్ధారామముండేది. ఇప్పటికీ దీనిని బైరాగి గుట్ట అని పిలుస్తారు. ఈ గుట్ట మీద సొరంగ మార్గముంది. నందలూరు దగ్గర చాలా గుహలున్నాయి. [[సిద్ధవటం]] కోటలోనుంచి నందలూరు గుహల్లోకి రహస్య మార్గముందంటారు. పురావస్తు శాఖ వారి తవ్వకాల్లో [[బౌద్ధ స్తూపాలు]], [[బౌద్ధ విహారం]], కొన్ని కట్టడాలు, 1600 పైగా సీసపు నాణేలు, మరికొన్ని బౌద్ధ చిహ్నాలు దొరికాయి.
ఇది సమీప పట్టణమైన [[రాజంపేట]] నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1198 ఇళ్లతో, 5481 జనాభాతో 775 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2648, ఆడవారి సంఖ్య 2833. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 980 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 239. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593579<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516150.
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/నందలూరు" నుండి వెలికితీశారు