నందలూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 61:
బుట్టలు
== గ్రామచరిత్ర ==
నందలూరు గురించి యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన [[కాశీయాత్రాచరిత్ర]]లోకాశీయాత్రాచరిత్రలో పలు విశేషాలు నమోదుచేశారు. 1830నాటికి ఈ గ్రామం [[పుణ్యక్షేత్రం]]గా పేరొందింది. వీరాస్వామయ్య ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ ఊరి వద్ద చెయ్యారనే నది గడియదూరం వెడల్పు కలిగుందన్నారు. నదికి ఇరుపక్కల గుళ్ళున్నవని, పరశురాముని మాతృహత్య నివర్తించిన స్థలమని ఆయన పేర్కొన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
===1.సౌమ్యనాథ స్వామివారి ఆలయం===
11వ శతాబ్దంలో చోళవంశరాజులచే నిర్మించబడిన ఆలయం. సంతాన సౌమ్యనాథునిగా, వీసాల సౌమ్యనాథునిగా ప్రసిద్ధికెక్కాడు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో 108 స్తంభాలతో చోళ కళాశిల్ప నైపుణ్యానికి ప్రతీక. 11వ శతాబ్దపు పూర్వా ర్థంలో చోళరాజులు నిర్మించి స్వామివారికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు ఆలయంలోని శాసనాల్లో లిఖించబడి ఉంది. అప్పటి నుండి చోళపాండ్య కాకతీయ మట్లి మున్నగురాజులు 17వ శతాబ్దం వరకు దశలవారీగా ఆలయనిర్మాణం చేపట్టి పలు రాజుల పాలనలో శ్రీవారి ఆలయం ప్రసిద్ధికెక్కింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి [[నందలూరు]], [[ఆడపూరు]], [[మందరం]], [[మన్నూరు]], [[హస్త వరం]] అయిదు గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్లు శాసనాలు ఉన్నాయి. అన్నమయ్య జన్మస్థానమైన తాళ్ళపాక గ్రామం నందలూరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
పంక్తి 69:
 
===2.శ్రీ కామాక్షీ సమేత ఉల్లంఘేశ్వరస్వామివారి ఆలయం===
 
==పేరు వెనుక చరిత్ర==
ఈ గ్రామానికి పూర్వం తొండమండలం, నిరంతపురం, చొక్కనాథపురం అనే పేర్లు ఉండేవి. నిరంధర అనే మహారాజు నిరంతపురం అనే గ్రామాన్ని నిర్మించగా అది [[బాహుదా నది]] వెల్లువలో కొట్టుకుపోగా తరువాత నలంద అనే రాజు ఉంపుడుగత్తె ఈ ప్రదేశాన్ని సందర్శించి నెలందలూరు అనే పేరుతో తిరిగి గ్రామాన్ని నిర్మించినట్టు మెకంజీ కైఫీయత్‌లో పేర్కొనబడింది<ref>{{cite news|last1=కె.నాగేశ్వరరెడ్డి|title=అన్నమాచార్యుడు దర్శించిన సౌమ్యనాథుని ఆలయం|accessdate=9 July 2018|work=వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం|date=4 November 2001}}</ref>. పూర్వం ఒక తెలుగు చోడ ప్రభువు గోహత్య పాప నివారణార్థం బాహుదానదీ తీరం వెంబడి 108 శివాలయాలను నిర్మించాడు. ఆ దేవాలయాలలో నంది విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇచ్చినందువల్ల ఆ నది గట్టున ఉన్న గ్రామానికి నం(ది)దుల ఊరు అనే పేరు వచ్చిందనీ అదే వ్యవహారికంలో నందలూరుగా మారిందని మరొక ఐతిహ్యం<ref>{{cite news|last1=కె.నాగేశ్వరరెడ్డి|title=అన్నమాచార్యుడు దర్శించిన సౌమ్యనాథుని ఆలయం|accessdate=10 July 2018|work=వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం|date=4 November 2001}}</ref>.
"https://te.wikipedia.org/wiki/నందలూరు" నుండి వెలికితీశారు