రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 148:
== అడవులు==
 
జిల్లాలో దాదాపు 390 చ.కి.మీ.ల అడవులు ఉన్నాయి. ఈ అడవులలో అధికభాగం జిల్లా పశ్చిమ భాగంలో ఉన్నాయి. వికారాబాదు సమీపంలో ధరూర్, అనంతగిరి ప్రాంతాలలో మధ్యరకపు అడవులు ఉన్నాయి. దట్టమైన అరణ్యాలు జిల్లాలో లేవు.
 
== విద్యాసంస్థలు==
రాష్ట్ర రాజధానిని ఆవరించి ఉండటంతో ఈ జిల్లాలో పలు ఉన్నత విద్యాసంస్థలు నెలకొల్పబడియున్నాయి. జిల్లాలోని ఉన్నత విద్యాసంస్థలలో అధికభాగం హైదరాబాదు సమీపంలో ఉన్న మండలాలలో కేంద్రీకరించబడి ఉన్నాయి. గచ్చిబౌలీలో [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]], రాజేంద్రనగర్‌లో [[ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం]], కూకట్‌పల్లిలో జె.ఎన్.టి.యు కళాశాల, బాచుపల్లిలో ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ పరిశోధన సంస్థ, ఆదిభట్లలో గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల, చిలకూరులోచిలుకూరులో హైపాయింట్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కళాశాల, గండిపేట్‌లో హైటెక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాల, దుండిగల్‌లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంస్థ, కోకాపేట్‌లో మహాత్మాగాంధీ టెక్నాలజీ సంస్థ, గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, చేవెళ్ళలో ఇంద్రారెడ్డి స్మారక ఇంజనీరింగ్ కళాశాల, కొండాపూర్‌లో సంస్కృతి ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ, నాగర్‌గుల్‌లో స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల, శేరిగూడలో శ్రీదత్తా ఇంజనీరింగ్ & సైన్స్ కళాశాల, బోగారంలో తిరుమల ఇంజనీరింగ్ కళాశాల, కాచారంలో వర్థమాన్ ఇంజనీరింగ్ కళాశాల, కనకమామిడీలో కె.ఎస్.రాజు టెక్నాలజీ& సైన్స్ కళాశాల, ఎంకేపల్లిలో భాస్కర్ ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లా వ్యాప్తంగా 2459 ప్రాథమిక, 882 మాధ్యమిక, 1235 ఉన్నత పాఠశాలలు, 258 జూనియర్ కళాశాలలు, 73 డీగ్రీ కళాశాలలు ఉన్నాయి.
 
== పర్యాటకం ==
సుందర ప్రకృతి దృశ్యాలకు నెలవైన అనంతగిరి కొండలు, వీసాల దేవాలయంగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయం, కీసరగుట్ట శివాలయం, పరిగి లోని సాయిబాబా గుడి మరియు మిలారమ్ బాలాజీ దేవాలయం, షామీర్‌పెట చెరువు మరియు వెంకటేశ్వరాలయం, గండిపేట చెరువు, రత్నాలయం, నీళ్ళపల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టు, కోట్‌పల్లి ప్రాజెక్టు జిల్లాలోని ముఖ్య పర్యాటక క్షేత్రాలు. అనంతగిరి కొండలు మూసీనదికి జన్మస్థానం.<ref>ఆంధ్రప్రదేశ్ దర్శిని, 1982, పేజీ 168</ref> ఇక్కడే శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిచారు. తాండూరు ప్రాంతంలో అంతారం, కొత్లాపూర్‌లలో నూతనంగా నిర్మించిన దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
 
== క్రీడలు==
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు