కాళేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[కాళేశ్వరం]],''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా]], [[మహదేవపూర్|మహదేవ్ పూర్]] మండలంలోని గ్రామం..<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
{{Infobox Settlement/sandbox|
‎|name = కాళేశ్వరం
పంక్తి 96:
 
== గ్రామ జనాభా ==
[[దస్త్రం:Kaleshwaram Project.jpg|thumb|కాళేశ్వరం ప్రాజెక్టు]]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 616 ఇళ్లతో, 2335 జనాభాతో 2849 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1080, ఆడవారి సంఖ్య 1255. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 548 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 287. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 571859<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 505504.
 
Line 159 ⟶ 160:
ఈ గ్రామంలో సుప్రసిద్ధమైన [[శివాలయం]] ఉంది. [[త్రిలింగ]]మనే మూడు సుప్రసిద్ధమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. త్రిలింగాల నడుమన ఉండే ప్రాంతం కనుకే [[త్రిలింగ]]<nowiki/>మనే పదం నుంచి [[తెలుగు]] అనే పదం పుట్టిందని కొందరు పండితుల భావన.<ref name="త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?">{{cite journal|last1=వెంకట లక్ష్మణరావు|first1=కొమర్రాజు|title=త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=81|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|accessdate=6 March 2015}}</ref>
 
ఈ దేవాలయంలో ఒకే పానపట్టంపై [[శివుడు]] [[యముడు]] వెలిశారు. సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో మహా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. ఇది కరీంనగర్‌ జిల్లాలో మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరో వైపు [[మహారాష్ట్ర]] ఉన్నాయి. [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్‌ జిల్లా]]<nowiki/>లోని మహాదేవపూర్‌ మండలానికి 16 కి.మీ దూరాన, [[మహారాష్ట్ర]] సరిహద్దున [[సిరోంచ]] తాలూకాకు 4 కి.మీ దూరాన కాళేశ్వరం ఉంది.అతిప్రాచీన చరిత్ర గల కాళేశ్వరక్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. మన రాష్ట్రంలోని శైవక్షేత్రాలలో [[శ్రీశైలం]]లోని మల్లికార్జునస్వామి, [[ద్రాక్షారామం]]లోని భీమేశ్వరస్వామి, [[కాళేశ్వరం]]<nowiki/>లోనిnలోని [[కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం]] లు ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ [[గోదావరి]], [[ప్రాణహిత]] నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, [[శ్రీశైలం|శ్రీశైల]], ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది.
 
భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే లింగం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై రెండు లింగాలు ఉండటం విశేషం. ఒకటి కాళేశ్వరలింగం, రెండవది ముక్తీశ్వర లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణి సంగమతీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రకాధారాల వల్ల తెలుస్తుంది. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు ఒక ప్రయోగం చేశారు. ఈ నాశికారంధ్రాలలో నీరుపోస్తే త్రివేణీసంగమతీరంలో కలిసిందీ, లేనిదీ కనిపెట్టడం కష్టమని వెయ్యి బిందెల పాలు పోశారు. పాలు తెల్లగా ఉండటంతో త్రివేణిసంగమతీరాన చూడగా పాలు కనబడినట్లు గ్రామస్థులు చెబుతుంటారు. ఈ క్షేత్రం కాశీక్షేత్రం కంటే గొప్పదని 'కాళేశ్వరఖండవలు' ద్వారా తెలుస్తున్నది. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా పేర్కొన్నారు. ఈ [[దేవాలయం]]<nowiki/>లోని కాళేశ్వరునికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
"https://te.wikipedia.org/wiki/కాళేశ్వరం" నుండి వెలికితీశారు