కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
కాకతీయుల శిల్పము
ట్యాగు: 2017 source edit
పంక్తి 26:
జాయన నృత్తరాత్నావళిని పరికించి చూస్తే భరతముని ప్రసాదించిన భరత నాట్యశాస్త్ర గ్రంథంలోనూ, భరత నాట్యంపై ఆభినవ గుప్తాచార్యుల వ్యాఖ్యానం తోనూ జాయనకు పరిపూర్ణ పరిచయం వున్నట్లు తోస్తూవుందని క్రీ.శే. మల్లంపల్లి వారు అదే వ్వాసంలో వ్రాశారు. జాయన నృత్యరత్నావళిలో నృత్యానికి అనుగుణమైన సంగీత రత్నావళిని గూడ అనుబంధంగా అరచించాడట. కాని దురదృష్ట వశాత్తూ అది లభ్యం కాకుండా పోయింది.
జాయన 1213 వ సంవత్సరం నాటికే సాల నాట్య వైదిక మణి అనీ, కవి సభాశిఖామణి అనీ పేరొందాడు. జాయన నృత్తరత్నావళిని 1253–54 నాటికి రచిందడం వలన దాదాపు 60 సంవత్సరాల వయసులో వ్రాసి వుండ వచ్చు. ఏమైనా ఈ నాడు ఆంథ్రుల గర్వించ దగిన పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్తరత్నావళి మణి భూషణం.
 
==కాకతీయుల శిల్పము==
కాకతీయుల మొదటి బేతరాజు కొడుకు మొదటి ప్రోలుడి కాలానికి హనుమకొండ కోటమాత్రమే ఉండేది. కట్టడాలేవీ అతడు లేపినట్లులేదు.అతని రాణి తన ఇష్టదైవము పాంచాల రయుణ్ణి ప్రతిష్ఠించి ఆలయమూ పల్లే నిర్మించినది.ఈప్రోలుని కొడుకు రెండోబేతరాజు బేతేశ్వరము అనే ఆలయము కట్టించినాడు.హనుమకొండ కోటకున్న ఎత్తైన రాతిద్వార తోరణాలు ఈయన పెట్టించి ఉండవచ్చును.రెండోప్రోలరాజు రెండో బీతరాజు కొడుకు.ఈతని యుద్ధ విజయోత్సాహానికి ఉత్తరాదినుండి వలసవచ్చిన శైవాగమ పండితులు శివాలయ నిర్మాణానికి, పద్మాక్షి దేవాలయానికి అనుమతిచ్చాడు.అప్పటి శివాలయాలలో చెప్పుకోదగ్గ శిల్పాలు వెలయలేదు.కాని పద్మాక్షి గుట్టమీది జైనస్థావర శిల్పానికి మంచి ప్రోత్సాహము చేకూరింది.అక్కడి పార్స్వనాధుడు మైలమ్మ బేతన శిల్పాలు ఈకాలంలోనే చెక్కారు.ఇనుగుర్తి జలంధర భైరవుడు కాళేశ్వరపు అన్నపూర్ణా విగ్రహాలు ఈకాలానివే. [[ఓరుగల్లు]] కోటలోని ఏకశిల పైని ఆలయము జైనుంది-ఈకాలానిదే.
 
రెండొ ప్రోలరాజు కొడుకు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చేకాలానికి కాకతి రాజ్యము స్థిరపడినది. ఈయన కాశీబుగ్గ, అయిననోలు, మొగలిచర్ల దేవాలయాలు కట్టించాడు.మొదటి రెండింటి శిఖరాలూ కోటలోని శంభుని గుడి శిఖరాలవలె మెట్లు మెట్లుగానే ఉన్నాయి.రుద్రదేవుడికి వర్ధమానములో దండయాత్ర చూచిన త్రికూటాలాయము దొడ్డగడ్డవల్లి లక్ష్మీదేవి ఆలయము నమూనాలోది వచ్చినది.తన విజయయాత్రాననంతరము ఆరూపముతో హనుమకొండలో వేయిస్తంభాల గుడి నిర్మించాడు.ఈ ఆలయ నిర్మాణముతో కాకతీయ శిల్పానికి కాళ్ళు వచ్చినవి.ఈ ఆలయము మొత్తం హోయసాలుల సోమనాధాలయము పద్దతిలో మూడు చిన్న ఆలయాలు-పొయ్యగడ్డలు పేర్చినట్లుగా కూర్చడమువలన ఏర్పడింది.హోయసాలుల ఆలయాలు పెట్టెలవలె కనిపిస్తాయి, మండపాలలో చీకటి.కాకతీయుల ఆలయాలు వెలుగుగా ఉంటాయి.హోయసాలుల శిల్ప వ్యక్తులు బొద్దుగా పొట్టిగా ఉంటారు, కాకతీయుల శిల్ప వ్యక్తులు సన్నము, పొడవూ.వారికి అలంకారభారము జాస్తి. వీరి అలంకారాలు బరువులుకాదు.అక్కడ లతల చిక్కములు ఎక్కువ, ఇక్కడ లేవు.అక్కద కధా శిల్పము తక్కువ, ఇక్కడ ఎక్కువ.
 
రుద్రదేవుని తరువాత కొద్దికాలము ఆతని తమ్ముడు మహాదేవుడు కాకతి రాజ్యము పాలించాడు.ఇతడు యాదవులతో పోరాడి యుద్దములో మరణిస్తే ఈయన్ కొడుకు గణపతిని బందించి ఉంచి కొంతకాలనికి విడిచె నంటారు. గణపతి ఓరుగల్లుకు వచ్చి తాను లేనప్పుడు రాజ్య సమైక్యతను కాపాడిన సేనానులకు పెద్ద పెద్ద భూభాగాలిచ్చాడు.వారు అడవులు నరికొంచి ఆమేరలకు సుక్షేత్రాలుగా తీర్చి చెరువులు కట్టించి, ఆలయాలు నిర్మించారు.పాలంపేట రుద్రేశ్వరాలయము, కటాక్షపుర శివాలయము, నగునూరు త్రికూటాలయమూ, నాగూలపాడు శివాలయమూ, ఓరుగల్లు కోటలోని కేశవ శ్రీస్వయంభూ దేవాలయాలూ గణపతిదేవుని కాలంలోనే నిర్మిచబడినాయి.బసవేశ్వరుని నిర్యాణముతో విజృంభించిన శైవము గణపతిదేవుని రాజధానిలోనూ ఆయన దండయాత్ర దారులలోనూ ప్రళయ నృత్యము చేసింది. అప్పుడే జైన తీర్ధంకురుల విగ్రహాల తలలు నరకబడినాయి.
 
గణపతిదేవుని తరువాత ఆయన కూతురు [[రుద్రమదేవి]] క్రీ.శ.1260లో రాజ్యానికి వచ్చింది.ఈమెకు మతగురువు శివ దేవయ్య.ఆయన ప్రోత్సాహముతో నీమె పుష్పగిరి మఠమూ, ఇతర శైవ మఠాలూ స్థాపించింది.అక్కడి శిల్పాలు మైలారు వీరగాధల్నీ శపధాల్నీ కాక జైన సంహారాన్నీ చూపిస్తున్నాయి.వీటికి తోడు శ్రీ చక్రాలూ, శివ యోగుల శిల్పాలూ ఈకాలంలో వచ్చాయి.ఇవీ ప్రజాశిల్ప పుష్పదళాలే. రుద్రమ్మ కాలంలో ప్రత్యేకంగా వ్యాపించినవి కాకతమ్మ విగ్రహాలు.ఈము నాలుగు చేతులతోనూ వరుసగా డమరుకమూ త్రిశూలమూ కత్తె రక్తపాత్రా ధరించే యముని శక్తి చాముండీ, సప్తమాతృకల లోనిది.నక్క ఈమె చిహ్నము.శవము ఆసనము.గద్ద ధ్వజము.హనుమకొండ భద్రకాళి కాకతీయే.
 
రుద్రమ్మ తరువాత ప్రతాపరుద్రుడు రాజ్యానికి వచ్చాడు. స్తంభాలు పేర్చి నిలబెట్టి కట్టిన వేయిస్తంభాల గుళ్ళు అనేవి ఈతడు కొలనుపాకలోనూ [[మంథని]] లోనూ ఇతర స్థలాలోనూ నిర్మించాడు.ఈతని సేనానులు త్రికూటాలు నిర్మించారు.మంథని గౌతమేశ్వరుని ఆలయము ఈయన కాలానిదే.దీనిపైన జైన తీర్ధంకురుల బొమ్మలూ ఉన్నాయి.ప్రతాపరుద్రుడు శైవ జైన వైష్ణవాలను సమంగా గౌరవించాడు. ఓరుగల్లు కోటలో నిల్చిఉన్న జైనాలయాలు ఈయన కాలంలోనే వచ్చి ఉంటాయి.
 
==యివి కూడా చూడండి==
Line 40 ⟶ 51:
* ==మూలం:== తెలుగువారి జానపద కళారూపాలు
రచయిత డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి
* భారతి మాస పత్రిక- 1974 వ్యాసము కాకతీయుల శిల్పము-వ్యాసకర్త- శ్రీపాద గోపాలకృష్ణమూర్తి.
 
[[వర్గం:కాకతీయ సామ్రాజ్యం]]
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు