ఒంటిమిట్ట: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
గ్రామంలో14 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఆరుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఏడుగురు ఉన్నారు. 8 మందుల దుకాణాలు ఉన్నాయి.
 
== తాగు నీరు ==
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
== పారిశుధ్యం ==
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
 
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
వొంటిమిట్టలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.
Line 23 ⟶ 25:
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.
రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
 
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
== భూమి వినియోగం ==
వొంటిమిట్టలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
Line 49 ⟶ 55:
== ఉత్పత్తి==
వొంటిమిట్టలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
 
===ప్రధాన పంటలు===
[[వరి]], [[వేరుశనగ]], [[పొద్దుతిరుగుడు]]
Line 58 ⟶ 65:
[[File:View of Kodanda Ramaswamy Temple in Vontimitta.jpg|800px|thumb|center|ఒంటిమిట్ట కోదండరామాలయ సముదాయము]]
రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, [[విశ్వామిత్రుడు]] వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు [[మృకండు మహర్షి]], శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.<ref name="eenadu" />
 
===మలకాటి పల్లి===
ఈ గ్రామము ఒంటిమిట్టకు సుమారు 3 కి.మీ దూరంలో ఉంది. ఇది ఒంటిమిట్టకు అతి సమీప గ్రామము,
Line 68 ⟶ 76:
మృకుందాశ్రమానికీ, ఈ ముకుందాపురానికీ జైనమతంతో సంబంధం ఉన్నట్లు ఆనవాళ్ళు ఉన్నాయని చరిత్ర పరిశోధకులు శ్రీ [[కట్టా నరసింహులు]] తెలియజేసినారు. స్కంద పురాణంలో ఈ ఆశ్రమ ప్రస్తావన ఉన్నట్లు గూడా ఆయన వివరించినారు. ఇక్కడ పరమేశ్వరుని లింగం, [[వినాయకుడు]], [[సుబ్రహ్మణ్యస్వామి]], భ్రమరాంబ, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, కాలభైరవుల విగ్రహాలు కొలువై ఉన్నవి. ప్రతి సంవత్సరం [[కార్తీకమాసం]]లో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. [2]
 
:
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఒంటిమిట్ట" నుండి వెలికితీశారు