నకాషీ: కూర్పుల మధ్య తేడాలు

విలీనం మూస చేర్చాను
పంక్తి 1:
{{విలీనము|ఇదే విషయానికి సంభందించిన దానిపై [[నకాశీ చిత్ర కళ]], [[చెరియాల్ పటచిత్రాలు]] అనే మరో రెండు వ్యాసాలు ఉన్నాయి.ఈ మూడింటిని ఒకే వ్యాసంగా విలీనం చేయవలసి ఉంది}}
 
==వృత్తి, సామాజిక జీవితం==
నకాషీ కులస్థులు నిర్మల్‌ పెయింటింగ్‌, బొమ్మల రూపశిల్పులు . రాష్ర్టంలో 50 వేల మంది మాత్రమే ఉన్న నకాషీలను శ్రీశోమ క్షత్రియ ,ఆర్యక్షత్రియ , చిత్తారి, చిత్రకార్‌ అని కూడా పిలుస్తారు.వీరు [[ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా|బీ.సీ-బి గ్రూపులో రెండవ కులం/వర్గానికి]] చెందుతారు.కొండపల్లి బొమ్మలు కూడా వీరే తయారు చేస్తారు. అంతేకాక అక్కడక్కడా శిక్షణ కేంద్రాలు నెలకొల్పి ఇతరులకు కూడా ఈ కళను నేర్పిస్తున్నారు. తాము సృజించిన కళారూపాలు తమ సొసైటీ ద్వారా మార్కెట్‌ చేస్తారు. ఏడాది పొడుగునా బొమ్మలు, పెయింటింగ్స్ రూపొందించడంతోపాటు గణేష్‌ ఉత్సవాలకు మట్టిబొమ్మలు తయారుచేసి పర్యావరణ కాలుష్యాన్ని దూరంచేసే ప్రయత్నం చేస్తారు. వీరి పూర్వీకులు మహారాష్ర్టకు చెందినవారు. మూడు శతాబ్దాల కిందటే వీరు నిర్మల్‌ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో అడవులలో పెరిగే `[[పొనికి]]' అనే చెట్టు చెక్కకు నగిషీలు చెక్కి నకాషీలు కొయ్య బొమ్మలు తయారు చేస్తారు. ఈ చెట్లు అంతరించిపోయే దశకు చేరుకోవటంతో కర్ర దొరకటం ప్రస్తుతం కష్టమవుతోంది. పొనికి చెట్లను నరికితే అటవీ శాఖ అధికారులు కేసులు పెడతారు. అడవిలో తిరిగి ఎక్కడన్నా ఎండిపోయిన చెట్లు కనిపిస్తే అధికారులకు చూపి వారి అనుమతితో సొసైటీ ద్వారా వీరు ఆ చెట్లను నరికించి తెస్తారు. ఇందుకు వీరు పన్ను చెల్లించాలి. నిర్మల్‌కు దూరంగాఉన్న జన్నారం, ఉట్నూరు ప్రాంతాలేకాదు... బెల్లంపల్లి, నెన్నెల, భీమారం, రాయదరి, తదితరప్రాంతాల నుంచి తెప్పించుకునే ఈ కరక్రు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అటవీశాఖ కూడా ఈ చెట్లను పెంచేందుకు పరిశోధనలు చేస్తోంది. కాగా, ఉన్న చెట్లను మత్యకారులు నరికి తెప్పలు తయారు చేస్తున్నారు. పొనికి చెక్క బొమ్మలు తయారుచేసే వృత్తిపై ఆధారపడి ప్రస్తుతం 150 కుటుంబాలు నిర్మల్‌ ప్రాంతంలో జీవిస్తున్నాయి. బొమ్మల తయారీకి వీరు యంత్రాల్ని వాడరు. వీరి కుటుంబాల్లో మహిళలు, చిన్న పిల్లలు సైతం బొమ్మల తయారీకి సహకరిస్తారు. తయారైన విడిభాగాలను అతికించటానికి చింతపిక్కల అబంలిని ఉపయోగిస్తారు. పొనికి చెక్క లభిస్తే నెలకు 50 బొమ్మలు తయరుచేస్తారు.రంగులు అద్ది వీరి సహకార సంఘం ద్వారా మార్కెట్‌ చేస్తే మూడువేల రూపాయలు లభిస్తాయి. సొసైటీ ద్వారానే కాకుండా వీరు తాము తయారు చేసిన బొమ్మల్ని అమ్ముకోవటానికి ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగితే అక్కడికి వెళ్ళి మార్కెట్‌ చేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/నకాషీ" నుండి వెలికితీశారు