నిహోనియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె నిహోనియం}}
నిహోనియం (Nh) ఒక రసాయన మూలకం. ఈ మూలకాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించేరు. ఇది మిక్కిలి వికీర్ణ ఉత్తేజితమైన ( radio-active) పదార్థం. దీని ఏకస్థానులలో ( isotopes) ఎక్కువ నిశ్ఛలత కల నిహోనియం-286 యొక్క అర్ధ ఆయుర్దాయం 10 సెకండ్లు. [[ఆవర్తన పట్టిక]]లో ఇది 7 వ ఆవర్తులో, 13 వ గుంపులో (అనగా, బోరాన్ గుంపులో) కనిపిస్తుంది. ఇంత వికీర్ణ ఉత్తేజితమైన పదార్థం ఇంత ఎక్కువ అర్ధ ఆయుర్దాయం కలిగి ఉండడం అబ్బురమే! దీనికి కారణం ఇది "ఎక్కువ స్థిర నిశ్చలత ఉన్న ద్వీపం" ([[:en: island of stability]]) లో ఉండడమే అన్న వాదం ఒకటి ఉంది.
 
డూబ్నాలో ఉన్న రష్యా-అమెరికా సంయుక్త అణుగర్భ పరిశోధనా సంస్థ ([[:en:JINR]]) సా. శ. 2002 లోనూ, రైకెన్ (Riken) లో ఉన్న జపానీ సంస్థ సా. శ. 2003 లోనూలో దీనిని తమ ప్రయోగశాలలో తయారు చేసేమని ప్రకటించేరు. ఈ ప్రతిష్ఠ ఎవరికి దక్కుతుందో నిశ్చయించడానికి అమెరికా, జెర్మనీ, స్వీడన్, చైనాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి జపానుకి దక్కుతుందని తీర్మానించేరు. అప్పుడు జపనీయులు సా. శ. 2016 లో ఈ మూలకానికి నిహోనియం (జపానీలో జపాను దేశాన్ని నిహాన్ అంటారు).
 
జపనీయులు చేసిన ప్రయోగాన్ని ఈ దిగువ చూపిన సమీకరణం ద్వారా తెలియబరచవచ్చు:
పంక్తి 11:
అత్యంత విలువైన లోహాలలో అగ్రస్థానం ఈ మూలకానిదే! ఒక అణువు నిహోనియం 7.5 మిలియను అమెరికా డాలర్లు ఉంటుందని సా. శ. 2019 లో అంచనా వేసేరు.
 
నిహోనియం లక్షణాలని తన "సహకుటింబీకులు" (homolgues) అయిన బోరాన్ (Bo), అల్లూమినం (Al), గేలియం (Ga), ఇండియం (In), థేలియం (Th) లక్షణాలని బట్టి ఊహించవచ్చు. నిహోనియం రసాయన లక్షణాలు నేటికి (2019) ఇంకా అవగాహన లోకి రాలేదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నిహోనియం" నుండి వెలికితీశారు