నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి 157.48.213.129 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 40:
 
==బాల్యము, విద్యాభ్యాసము==
నందమూరి తారక రామారావు [[1923]], [[మే 28]] వ తేదీన, సాయంత్రం 4:32కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని [[కృష్ణా జిల్లా]], [[పామర్రు]] మండలంలోని, [[నిమ్మకూరు]] గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య [[విజయవాడ]] మునిసిపలు ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు. ఇక్కడ [[విశ్వనాథ సత్యనారాయణ]] తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. [[1942]] మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పాడు. తర్వాత [[గుంటూరు]] [[ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]]లో చేరాడు. అక్కడకూడా నాటక సంఘాల కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవాడు. ఆ సమయంలోనే [[నేషనల్ ఆర్ట్ థియేటర్]] గ్రూప్ (NAT) అనే నాటక సంస్థను స్థాపించి [[కొంగర జగ్గయ్య]], [[ముక్కామల]], [[నాగభూషణం]], [[కె.వి.ఎస్.శర్మ]] తదితరులతో '''చేసిన పాపం''' వంటి ఎన్నో నాటకాలు ఆడాడు. తర్వాతి కాలంలో ఈ సంస్థ కొన్ని చిత్రాలను కూడా నిర్మించింది. ఎన్టీఆర్ మంచి [[చిత్రకారుడు]] కూడా. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా.
 
== వ్యక్తిత్వం ==
ఎవరిని నొప్పించని సున్నిత  స్వభావం  , ఎదుటివారిలో తారతమ్యాలను చూడకపోవడం, పిన్న పెద్దలకు ఆయన ఇచ్చే గౌరవమర్యాదలు ,పుట్టుక  అగ్రవర్ణం లో అయినప్పటికీ బీద బలహీన వర్గాల జీవనోభివృద్ధి పై అయన చూపిన శ్రద్ధ ఆయనవ్యక్తిత్వాని తేటతెల్లం చేసాయి .
 
==కుటుంబం==
తారక రామారావు, [[బసవ రామ తారకం|బసవతారకం]] దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. [[నందమూరి హరికృష్ణ|హరికృష్ణ]], మోహనకృష్ణ, [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; లోకేశ్వరి, [[దగ్గుబాటి పురంధరేశ్వరి]], [[నారా భువనేశ్వరి]], కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.
 
<br />
 
==చలనచిత్ర జీవితం==
Line 51 ⟶ 56:
 
ప్రముఖ నిర్మాత [[బి.ఏ.సుబ్బారావు]] ఎన్టీఆర్ ఫొటోను [[ఎల్వీ ప్రసాదు]] దగ్గర చూసి, వెంటనే ఆయనను [[మద్రాసు]] పిలిపించి [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో <!--ఎటువంటి పరీక్షలు లేకుండానే -->కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా [[మనదేశం]] అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత ఆయన మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా [[మనదేశం]] అయింది. [[1949]]లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. [[1950]]లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం [[ఎల్.వి.ప్రసాద్|ఎల్వీ ప్రసాదు]] [[షావుకారు]] కూడా విడుదలైంది. అల్లా [[నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం]] ప్రారంభమైంది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం [[చెన్నై|మద్రాసు]]<nowiki/>కు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.
 
 
 
<nowiki/><!--ఆ సమయంలో రామారావు డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి బస్సు చార్జీలకు కూడా డబ్బుండేది కాదు.-->