ఘట్టమనేని మహేశ్ ‌బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
హీరోగా మహేశ్ తొలి చిత్రం [[రాజకుమారుడు]]. ఆ తర్వాత వచ్చిన [[యువరాజు]], [[వంశీ]] చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. [[2001]]లో [[సోనాలి బింద్రే]] హీరోయిన్ గా [[కృష్ణ వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[మురారి]] చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ [[2002]] మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన [[టక్కరి దొంగ]], [[బాబీ]] సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి.
 
[[2003]]లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. [[గుణశేఖర్]] దర్శకత్వంలో విడుదల అయిన [[ఒక్కడు]] చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. [[భూమిక]] కథానాయికగా, [[ప్రకాష్ రాజ్]] ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన [[నిజం]] చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు [[నంది పురస్కారం|బంనందినంది పురస్కారాన్ని]] అందుకున్నాడు. [[2004]]లో తమిళనాట విజయవంతమైన '''న్యూ''' చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో [[నాని]]గా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే యేడాది విడుదలైన [[అర్జున్]] పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది.[https://readme5minutes.com/2019/02/mahesh-babu-whatsapp-number-height-weight-bio/ మహేష్] తొలి నాళ్లలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు.
 
అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. [[అతడు]] చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. [[2005]]లో విడుదల అయ్యిన అతడు చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంనంది లభించింది. [[2006]]లో మహేష్ నటించిన చిత్రం [[పోకిరి]] విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న [[అమితాబ్ బచ్చన్]], [[రాంగోపాల్ వర్మ]] తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు<ref name="Amitabh wonderstruck by Pokiri ">{{cite web| title= indiainfo.com| work= Amitabh wonderstruck by Pokiri |url= http://movies.indiainfo.com/southern-spice/telugu/pokiri-300606.html|accessdate=4 February|accessyear=2007}}</ref> . ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.