కేదార్‌నాథ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ఆలయ గర్భగుడి కథ
పంక్తి 82:
కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి యాత్రికులను గుర్రాలలోను, డోలీలలోను మరియు బుట్టలలోనూ చేరుస్తుంటారు. బుట్టలలో యాత్రికులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం. డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు. గుర్రాలలో యాత్రీకులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు. వీరు యాత్రికులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకు వెళతారు. తరువాత ఆలయదర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానికి సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్ లోని వారి బస వరకు తీసుకు వస్తారు. పనివాళ్ళ కోరికపై అనేకమంది యాత్రీకులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి. కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్నీ యాత్రీకుల నిర్ణయం మాత్రమే. మార్గంలో హిమపాతం, [[వర్షం]] లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు. ఈ ప్రయాణానికి వెళ్ళే సమయం 5 నుండి ఆరు గంటలు వచ్చే సమయం 3 నుండి నాలుగు గంటలు ఇదికాక దర్శన సమయం అదనం. వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదు. వీరిలో అనేకమంది నేపాలీయులే వీరు విశ్వాసపాత్రులు రుసుము మాత్రం యాత్రికులు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆలయమునకు అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రికులకు గౌరీ కుండ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు వారి బస యజమానులు సరఫరా చేస్తుంటారు. వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కోంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత మంచుతో కప్పబడి ఉంటుంది. పేరుకు పోయిన మంచు అక్కడక్కడా యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకినీ నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది. ఉత్తరకాశి నుండి
హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రికులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.
 
 
గర్భగుడి
 
కేదార్ నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుకభాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్టతో పూజిస్తారు. దీని వెనక ఓ కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చతాపంలో ఉంటారట. యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని, దాన్నుంచి పాపవిమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు. ద్రౌపదితో కలిసి అయిదుగురు హిమాలయాలకు బయల్దేరతారు. ఎన్నో రోజులు కష్టించి గాలించినా శివదర్శనం కాదు. చివరికి కేదార్ నాథ్ ఉండే చోటుకు వస్తారు. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు. తనను గుర్తు పట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు. శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు, ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు, ఎద్దులు ఎందుకు ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెబుతాడు. మరో వైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు. ఒక్కో ఆవు/ఎద్దు భీముడి కాలు కింది నుంచి బయటకు వెళ్తాయి. చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది. అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. తప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించొద్దన్న ఉద్దేశ్యంతో, భీముడి కాళ్ల కింది నుంచి వెళ్లలేడు కాబట్టి .. హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు. పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఎద్దు వెనక భాగం మాత్రం అందుతుంది. అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్ నాథ్ లో కనిపిస్తుంది. మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే ఖాట్మాండులో ప్రత్యక్షమవుతుంది. అందుకే కేదార్ నాథ్ లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్లి ఖాట్మాండు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే అద్భుతమని మనకే తెలుస్తుంది.
 
==జనసంఖ్య==
"https://te.wikipedia.org/wiki/కేదార్‌నాథ్" నుండి వెలికితీశారు