జగిత్యాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జగిత్యాల జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో వర్గం మార్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''జగిత్యాల''', భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం, [[జగిత్యాల జిల్లా|జగిత్యాల జిల్లా,]], [[జగిత్యాల మండలం|జగిత్యాల]] మండలానికి చెందిన పట్టణం.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf</ref>.
{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
పంక్తి 20:
|website =
|footnotes =
}}ఈ పట్టణం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు జరగకముందు [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్ జిల్లాలో]] ఉంది.ఇది రెవెన్యూ డివిజను ప్రధాన కేంధ్రం.[[హైదరాబాదు|హైదరాబాదుకు]] 230 కి.మీ. దూరంలో ఉంది.
 
== విశేషాలు ==
చుట్టుపక్కల 50 చ.కి.మీ. లోని 30 గ్రామాల ప్రజలకు జగిత్యాల వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతపు ప్రజలకు ఇది విద్యాకేంద్రం కూడా. పట్టణానికి ఉత్తరాన జాఫరుద్దౌలా [[1747]]లో కట్టించిన పాత కోట ఉంది. సమీప, దూర ప్రాంతాల పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలతో జగిత్యాలకు చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. పట్టణానికి రైలు మార్గం ఈ మధ్యనే నిర్మించారు.జగిత్యాల ఒక [[శాసన సభా నియోజకవర్గ కేంద్రం|శాసనసభ నియోజకవర్గ]] కేంద్రము.
 
[[నిజాము]] పరిపాలన గుర్తుగా జగిత్యాలలో అప్పటి నిర్మాణాలు కొన్ని ఉన్నాయి. అయితే ఇవి ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. జగిత్యాల చుట్టుపక్కల ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. [[వేములవాడ]] (56 కి.మీ), [[ధర్మపురి]] (27 కి.మీ), [[కొండగట్టు]] (15 కి.మీ) వీటిలో ప్రముఖమైనవి. ప్రముఖ చారిత్రక ప్రదేశమైన [[పొలాస]] (7కి.మీ ) (కాకతీయుల నాటి పౌలస్త్యేశ్వరపురం) జగిత్యాలకు చేరువలోనే ఉంది.
 
== విద్యా సౌకర్యాలు ==
జగిత్యాల సమీపంలో కొండగట్టు వద్ద జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పొలాస గ్రామములో ఆచార్య ఎన్. జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ( బి. యస్సీ అగ్రికల్చర్ ) ఉంది.డాక్టరు వి.ఆర్.కె. ఇంజనీరింగ్ కళాశాల ఉంది.పలు జూనియర్ కళాశాలలు ఉన్నాయి.గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 8 , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి.సమీప బాలబడి [[జగిత్యాల|జగిత్యాలలో]] ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల జగిత్యాలలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కరీంనగర్లోను, పాలీటెక్నిక్ [[పొలస|పొలసలోనూ]] ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం జగిత్యాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[కరీంనగర్]] లోనూ ఉన్నాయి.
 
==చరిత్ర==
పంక్తి 36:
[[జగిత్యాల కోట]] రాయి, సున్నంతో నక్షత్రాకారంలో నిర్మితమైంది.<ref name="చారిత్రక ఖిల్లా..">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=చారిత్రక ఖిల్లా..|url=https://www.ntnews.com/District/jagityal/article.aspx?contentid=614640|accessdate=17 July 2018|date=14 October 2016 |archiveurl=https://web.archive.org/web/20180716090907/https://www.ntnews.com/District/jagityal/article.aspx?contentid=614640|archivedate=17 July 2018}}</ref><ref name="పర్యాటక ప్రదేశాలు">{{cite news|last1=ఈనాడు|title=జగిత్యాల ఖిల్లా|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krntourism|accessdate=17 July 2018|archiveurl=https://web.archive.org/web/20180716194338/http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krntourism|archivedate=17 July 2018}}</ref> ఈ కోట చుట్టూ లోతైన కందకం ఉంది. ఇది ఇప్పటికీ నీటితో నిండి ఉంది. కోట నిర్మాణం కండ్లపల్లి చెరువు పక్కన జరిగింది, కనుక కందకంలో నీరు ఎప్పుడూ ఎండిపోదు. ఇది నిర్మించి దాదాపు 250 సంవత్సరాలు కావొస్తుంది. కోట బురుజులలో దాదాపు రెండు మీటర్ల పొడవైన తోపులు అనేకం ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ ఫిరంగులపై మహ్మద్ ఖాసిం పేరు ఉర్దూలో రాసి ఉంది. కోటలోపల, మందు గుండు సామాగ్రి కోసం నిర్మించిన గదులు అనేకం ఉన్నాయి. 1930 వరకు జగిత్యాల రెవెన్యూ కార్యాలయాలు ఈ కోటలోనే ఉండేవి. ఇక్కడ ఒక ఖిలేదార్, 200 మంది సిపాయిలు ఉండేవారు. ఆ కాలంలో అంటే క్రీ.శ. 1880లో జగిత్యాలలో 516 ఇళ్లు మాత్రమే ఉండేవంటారు. ఆనాటి జనాభా 2,812 అని తెలుస్తోంది.
 
చెక్కు చెదరని గడీ జగిత్యాల పట్టణంలో జువ్వాడి ధర్మజలపతి రావు అనే దొర ఒక గడీని నిర్మించాడు. ఈ గడీ చల్‌గల్ గడీకి దగ్గర పోలికల్తో ఉంటుంది. ఇరుపక్కల విశాలమైన బురుజులతో, లావైన స్తంభాలతో జగిత్యాల గడీ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఈ గడీలో పై అంతస్థు పైన ఉండడానికి బయట నుండే రెండు వైపుల మెట్లను నిర్మించారు.ఆ కాలంలోని ‘దువ్వం తాలూకాదార్లు’ (డిప్యూటి కలెక్టర్‌లు) ఈ గడీలోనే ఉండేవారనీ చెబుతారు.
 
=== క్లాక్ టవర్‌ ===
పంక్తి 71:
== వెలుపలి లింకులు ==
{{జగిత్యాల మండలంలోని గ్రామాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
 
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు, పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/జగిత్యాల" నుండి వెలికితీశారు