వేంగి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1:
క్రీ.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని '''[['''వేంగి]]''' రాజ్యం''' అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని '''[['''వేంగి]]''' నగరం''' లేదా '''విజయవేంగి''' అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం [[పెదవేగి]] అనే చిన్న [[గ్రామం]]. ఇది [[పశ్చిమగోదావరి జిల్లా]]లో [[ఏలూరు]] పట్టణానికి 12 కి.మీ. దూరంలో ఉంది.
 
వేంగి రాజ్యం ఉత్తరాన [[గోదావరి నది]], ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన [[కృష్ణా నది|కృష్ణానది]] మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం [[ఆంధ్రుల చరిత్రము|ఆంధ్రుల చరిత్ర]]<nowiki/>లో ఒక ముఖ్యమైన ఘట్టం. [[పల్లవులు]], [[శాలంకాయనులు]], [[బృహత్పలాయనులు]], [[తూర్పు చాళుక్యులు]] వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. వేంగి రాజ్యం ద్వితీయార్ధంలో, అనగా తూర్పు [[చాళుక్యులు|చాళుక్యు]]<nowiki/>ల కాలంలో (వీరినే "వేంగి చాళుక్యులు" అని కూడా అంటారు.) తెలుగు భాష రాజ భాషగా గైకొనబడి, పామర భాష (దేశి) స్థాయి నుండి సాహిత్య భాష స్థాయికి ఎదిగింది.
పంక్తి 34:
</ref>
 
[[దస్త్రం:APvillage Pedavegi 1.JPG|250px|thumb|right|పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిథిలాలు (ధనమ్మదిబ్బ?) ]]
పెదవేగిలోని ధనమ్మ దిబ్బ వద్ద జరిపిన త్రవ్వకాలలో దిబ్బ మధ్యన పెద్ద రాతి కట్టడము బయల్పడినది. దీనిని ఒక [[బౌద్ధ మతము|బౌద్ధ]] స్థూపముగా గుర్తించారు.
ఆ ప్రదేశములో దొరికిన వస్తువులలో మట్టి పాత్రలు, ఒక రాతి బద్దలో చెక్కబడిన నంది, [[పూసలు]], కర్ణాభరణాలు మరియు పాచికలు కూడా ఉన్నాయి. ఇంకో ప్రత్యేక కనుగోలు పారదర్శకమైన కార్నేలియన్ రాయితో తయారు చేసిన ఒక అండాకార భరిణె. 2x2x6 సె.మీల పరిమాణము కలిగిన ఈ భరిణపై ఒక దేవతామూర్తి చెక్కబడిఉన్నది. ఇది నగరాన్ని పర్యవేక్షించే [[గ్రామ దేవతలు|నగర దేవత]] అయ్యుండవచ్చని పురావస్తు శాఖ భావిస్తున్నది.<ref>http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html</ref> చాలా శిల్పాలను [[శివాలయం]]<nowiki/>లోని వరండాలో ఉంచారు.
పంక్తి 148:
కుబ్జ విష్ణువర్ధనుని తరువాత గుణగ విజయాదిత్యుడు, వాళుక్యభీముడు, జటాచోడ భీముడు, రాజరాజ నరేంద్రుడు ముఖ్యమైన వేంగి చాళుక్య రాజులు. అయితే అంతఃకలహాలు, రాష్ట్రకూటులతో యుద్ధాలు వేంగిని విపరీతమైన నష్టాలకు గురిచేశాయి. 772లో రాష్ట్రకూట ధ్రువుడు పంపిన సేనలు వేంగిపై దండెత్తి అప్పటి విష్ణువర్ధనుని ఓడించి సామంతునిగా చేసుకొన్నాడు. దీనితో వేంగి ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బ తింది. తరువాత 12 సంవత్సరాలు వారి మధ్య ఎడతెరిపి లేకుండా పొరులు జరుగుతూనే ఉన్నాయి. 813లో చాళుక్య రాజు రెండవ విజయాదిత్యుడు రాష్ట్రకూటులనోడించి తిరిగి వేంగి సింహాసనాన్ని అధిష్టించాడు. వేంగి ప్రాభవాన్ని పునరుద్ధరించాడు. ఇతడు 108 యుద్ధాలు చేసి రాష్ట్రకూటులను పారద్రోలినట్లు [[శాసనాలు]] చెబుతున్నాయి. ఇతడు గొప్ప కళా పండిత పోషకుడు.
 
తరువాతి రాజులలో [[గుణగ విజయాదిత్యుడు]] (848-891) తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఒక యుద్ధంలో రాష్ట్రకూట రాజు (రట్టేశుని) చేత ఓడిపోయాడు. తరువాతి [[యుద్ధం]]<nowiki/>లో వారిని ఓడించి, వారి రాజ్యాలలో వీరవిహారం చేసి తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయడమే కాక దక్షిణాపథంపై అధిపత్యం సాధించాడు. ఇతని తరువాత అంతఃకలహాలవల్ల వేంగి రాష్ట్రకూటుల దండయాత్రలకు తట్టుకొనే శక్తి కోల్పోయింది. కొన్ని యుద్ధాలలో జయం, కొన్నింట పరాజయం సంభవిస్తూ ఉండేవి. రెండవ అమ్మరాజు వేంగి సింహాసనాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత జటాచోడభీముడు [[వేంగి]], [[కళింగ]] రాజ్యాలలో ఎదురు లేకుండా పాలించాడు.
 
== చాళుక్య చోళులు ==
పంక్తి 157:
 
== వేంగి ప్రాభవం క్షీణత ==
తిరిగి 1042 నుండి రాజరాజ నరేంద్రుని అధికారానికి ప్రమాదం వాటిల్లింది. ఈ కాళంలో చాళుక్య చోళ [[సంఘర్షణ]]<nowiki/>లు తారస్థాయికి చేరడంతో వేంగి రాజ్యం అల్లకల్లోలమయ్యింది. సోమేశ్వరుడనే రాజు 1045 ప్రాంతంలో వేంగి, కళింగ రాజ్యాలను జయించి "వేంగి పురవరేశ్వర" అనే [[బిరుదు]] ధరించాడు. చోళ రాజులు ధరణికోట వద్ద జరిగిన పెద్ద యుద్ధంలో చాళుక్యులను జయించారు గాని వేంగిపై మాత్రం పశ్చిమ చాళుక్యుల పెత్తనం కొనసాగింది. [[రాజరాజ నరేంద్రుడు]] ఆహవమల్ల సోమేశ్వరునితో సమాధానపడి అతని సార్వభౌమత్వాన్ని అంగీకరించి [[వేంగి]]<nowiki/>ని పాలించాడు. తరువాత 1061 వరకు రాజరాజనరేంద్రుని పాళన ప్రశాంతంగా సాగింది. అతడు పండిత గోష్ఠిలో ఆసక్తి కలిగిన పరమ ధార్మికుడు. ఈ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉండవచ్చును. అది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం.
 
రాజరాజ నరేంద్రుని మరణానంతరం జరిగిన సంఘటనలలో చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు. కాని అప్పటికి వేంగి రాజ్యానికి పూర్తిగా వ్యక్తిత్వం నశించి చోళ, చాళుక్య సార్వభౌములలో విజేతలైనవారి పక్షమో, లేక వేంగిపై దండెత్తి వచ్చినవారి పక్షమో వహించవలసిన దయనీయ స్థితికి దిగజారిపోయింది <ref name="BSL"/>. అనేక యుద్ధాలు, రాజుల మధ్యలో పంపకాలలో వేంగి నలిగిపోయింది. అవకాశం చిక్కినపుడల్లా ఇతరులు వేంగిని కొల్లగొట్టసాగారు. 1073లో దాహళ ప్రభువు చేది యశఃకర్ణదేవుడు, తరువాత కొద్దికాలానికి గంగరాజ దేవేంద్రవర్మ పెద్ద దండ్లను పంపి వేంగిని దోచుకొన్నారు. 1075లో సప్తమ విజయాదిత్యుడు మరణించడంతో తూర్పుచాళుక్య వంశం అంతరించింది.
పంక్తి 164:
{{main|నన్నయ}}
* పైన చెప్పినట్లుగా వేంగి రాజ్యం, తూర్పు చాళుక్యుల పాలన తెలుగువారి చరిత్రలో సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న కాలం. నన్నయ భట్టు, నారాయణ భట్టు మహాభారత ఆంధ్రీకరణను ప్రారంభించారు. ఈ కాలంలోనే శాసనాలలో తెలుగు కనిపించ సాగింది. కుబ్జవిష్ణువర్ధనుని చేజెర్ల శాసనంలో సగం పైగా తెలుగు. అతని కుమారుడు జయసింహ వల్లభుని విప్పర్ల, మాచెర్ల శాసనాలు తెలుగు. వేంగి రాజ్యానికి సమాంతరంగా నడచిన రేనాటి చోడులు కూడా తమ శాసనాలు తెలుగులో వేయించారు. వానిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (క్రీ.శ.575) మనకు లభించిన మొట్టమొదటి [[తెలుగు శాసనాలు|తెలుగు శాసనం]].
* చరిత్రలో చాలా సార్లు జరిగినట్లుగానే రాజవంశాలలోని అంతఃకలహాలు, పొరుగు రాజ్యాల సామ్రాజ్య విస్తరణాకాంక్ష దేశాన్ని బలపడకుండా చేశాయి. [[వేంగి]], [[ధరణికోట]], [[యనమదల]], [[కంభం]], [[నెల్లూరు]] వంటి వగరాలు పలుమార్లు ధ్వంసం చేయబడ్డాయి.
* ఈ కాలంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంతం ఎక్కువ భాగం ఇతర రాజుల సామంతరాజుల పాలనలో ఉంది.
* వేంగి రాజుల సైన్యాధిపతులలో అనేక [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] వీరులుండేవారు. బౌద్ధమతం క్షీణించినా అప్పటికి కులవ్యవస్థ ఇంకా బాగా బలపడలేదు.
పంక్తి 193:
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాలు]]
[[వర్గం:చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు