ఎస్సీ వర్గీకరణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
== ఉద్యమం ==
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం షెడ్యూల్డ్ కులాలకున్న 15 శాతం రిజర్వేషన్ ను వర్గీకరించి అప్పటి 59 కులాలకు దామాషా ప్రకారం పంచిపెట్టాలన్నది ఎస్సీ వర్గీకరణ డిమాండ్. దీన్ని [[1972]] నుంచి మాదిగ కులస్తులు ఏదోక రూపంలో చేస్తూవచ్చారు. పలువురు మాదిగ కులస్తులైన ప్రజాప్రతినిధులు అప్పటి ముఖ్యమంత్రులకు విజ్ఞప్తులు, వినతులు అందించారు. [[1994|1994లో]] ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా జులై 7 న ప్రకాశం జిల్లా [[ఈదుమూడి]] గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం.ఆర్.పి.ఎస్.) ఏర్పడింది. రాడికల్ గా పూర్వజీవితం గడిపిన [[మంద కృష్ణ మాదిగ]] దీని వ్యవస్థాపక అధ్యక్షులు, వామపక్ష ఉద్యమాలతో సంబంధం ఉన్న కృపాకర్ కార్యదర్శిగా వ్యవహరించారు. [[1990]] దశకంలో ఉద్యమం ప్రాచుర్యాన్ని సాధించుకుంది. లక్ష్యం తేలికగా వివరించేదిగా ఉండడం, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయా కులస్తులు నివసిస్తూండడం, సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నా ఒకేసారి ఉద్యమరూపం దాల్చడం వంటివి దీనికి అనుకూలతలయ్యాయని మానవహక్కుల ఉద్యమకారుడు [[కె.బాలగోపాల్]] పేర్కొన్నారు. ఐతే సరళంగా వివరించగల ఉద్యమ లక్ష్యాన్ని ప్రజలకు చేరవేయడంలో సంక్లిష్టమైన పద్ధతులు పాటించడం కొంత ఇబ్బందికరమైందని ఆయన భావించారు.<ref name="A Tangled Web: Subdivision of SC Reservations in AP" />
 
== వ్యతిరేకత ==
"https://te.wikipedia.org/wiki/ఎస్సీ_వర్గీకరణ" నుండి వెలికితీశారు