టక్కరి దొంగ చక్కని చుక్క: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[కె.మాలతి|మాలతి]] - గోపి తల్లి
* [[విజయలలిత]] - లైలా
==సాంకేతికవర్గం==
* సంగీతం: సత్యం
* నృత్యం: కెఎస్ రెడ్డి
* స్టంట్స్: మాధవన్
* కళ: చలం
* ఫొటోగ్రఫీ: ఎస్‌ఎస్ లాల్
* మాటలు: టిపి మహరథి
* కూర్పు, దర్శకత్వం: కెఎస్‌ఆర్ దాస్
* నిర్మాత: వైవి రావు
 
== కథ ==
ఆ ఊరిలో దాదా (రాజనాల), భ యంకర్ (సత్యనారాయణ) ఇద్దరూ గ్యాంగ్ లీడర్లు. దోపిడీలు దొంగతనాలు చేస్తూ రౌడీలను పెంచి పోషిస్తూ దందాలు చేస్తుంటారు. భయంకర్ సూచనతో ముఠాకు చెందిన శ్యామ్ (కృష్ణ) మ్యూజియంలోంచి అతి విలువైన పరిటాల వజ్రాలు దొంగిలించి తన హోటల్ రూములో సీలింగ్ ఫ్యాన్‌లో దాస్తాడు. బిఏ చదివి, ఏ ఉద్యోగం దొరక్క రిక్షా నడుపుతూ జీవించే వ్యక్తి గోపి (మరో కృష్ణ). ఒకరోజు శ్యామ్ గోపీ రిక్షాను కారుతో ఢీకొట్టడం, అతన్ని తన రూమ్‌కు తీసుకొచ్చి తనకు బదులుగా రూమ్‌లో నెల రోజులు ఉండమని 50వేల రూపాయలు ఇస్తాడు. గోపి అందుకు అంగీకరించటంతో, శ్యామ్ దూరంగా వెళ్లిపోవటం జరుగుతుంది. వజ్రాలు తెచ్చివ్వలేదని భయంకర్, శ్యామ్ కోసం వెతుకుతుంటాడు. అలాగే ఆ వజ్రాల కోసం దాదా గోపీని బంధిస్తాడు. గోపి తనకేమీ తెలియదని చెబుతాడు. తరువాత రూమ్‌కి వచ్చి, అక్కడ శ్యామ్ మరణించి ఉండటాన్ని గమనించి, ఇక భయంకర్‌ను, దాదాను తానే ఒంటరిగా ఎదుర్కొంటుంటాడు. ప్రభుత్వ సైనికుల శక్తి సామర్థ్యాల కోసం తలపెట్టిన ప్రయోగాన్ని సైంటిస్ట్ (పిజె శర్మ), అతని అసిస్టెంటు గీత (విజయనిర్మల) సక్సెస్ చేస్తారు. గీతను ఇష్టపడి ప్రేమించిన గోపి, ఆ ఫార్ములా కాగితాల కోసం సైంటిస్ట్‌ను హత్యచేసి తీసుకోవాలనుకున్న దుండగుల బారినుంచి గీతను, ఫార్ములాను కాపాడతాడు. పత్రాలను ప్రభుత్వానికి అప్పగించటంతో గోపిని ప్రభుత్వం ధనంతో సత్కరిస్తుంది. గీతతో కలిసి తల్లివద్దకెళ్లి వారి ప్రేమ పెళ్ళికి అంగీకారం పొంది, ఇరువురూ ఒకటవటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది<ref name="ఫ్లాష్ బ్యాక్">{{cite news |last1=సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి |title=ఫ్లాష్ బ్యాక్ @ 50 టక్కరి దొంగ- చక్కని చుక్క |url=http://www.andhrabhoomi.net/content/flashback50-64 |accessdate=13 August 2019 |work=ఆంధ్రభూమి దినపత్రిక |date=22 June 2019}}</ref>.