నరసరావుపేట పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 249:
 
=== రెండవ రోజు (12.12.2015) ===
 
 
పురపాలక సంఘం శత వసంతాల వేడుకల రెండోరోజు శనివారం  స్థానిక భువన చంద్ర టౌన్ హాల్లో అప్పటి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అధ్యక్షత జరిగిన కార్యక్రమానికి  అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి, ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరైయ్యారు.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజకీయాలకు రాజధాని, ఉద్యమాలకు ఊపిరి, ఉద్ధండుల కోట అని నరసరావుపేటను కొనియాడాడు.ఇక్కడ నుండి కాసు బ్రహ్మానందరెడ్డి, కాసు వెంగళరెడ్డి రాజకీయాలను శాసించారని, చంద్రబాబునాయుడు తర్వాత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి అని అన్నాడు.పల్నాడు ప్రాంతం పౌరుషాల గడ్డ అని,.గుంటూరు జిల్లాను శాసించేది నరసరావుపేట, పల్నాడు ప్రాంతమేనని ఈ సందర్భంగా గుర్తు చేసాడు. పట్టణంలోని సాహితీ వేత్తలు, కళాకారులు, విప్లవయోధులను గురించి కూడా ప్రస్తావించారు. తల్లి, తండ్రి, ఊరు, భాష, దేశంను మరిచిన వారికి చరిత్రలో స్థానం ఉండదని చెప్పాడు. విగ్రహంలా వెయ్యేళ్లు జీవించడం కన్నా, విద్యుత్‌లా ఒక నిమిషం జీవించడం మేలని, పూర్వజన్మ సుకృతం వల్ల లభించిన పదవులను అందిపుచ్చుకుని ప్రజలకు సేవ చేయాలని చెప్పాడు.తాను ఒకప్పుడు చూసిన నరసరావుపేట పట్టణం ప్రస్తుతం కనిపించడం లేదని,చాలా అభివృద్ధి కనపడుతుందని చెప్పాడు.. వంద వసంతాల పండుగను చేసుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, ప్రజల భాగస్వామ్యం లేకపోతే  దేనికి అభివృద్ధి లేదన్నాడు..విప్లవాత్మకమైన మార్పులు రావడం అభివృద్ధికి నాంది అని చెప్పాడు. ఈ ప్రాంతానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదర్శమని చెప్పాడు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి భాధ్యతని  వెంకయ్యనాయుడు గుర్తు చేసాడు.ప్రజాప్రాతినిధ్యం, పారదర్శకత, జవాబుదారీతనంతో పురపాలక సంఘాలు పనిచేయాలని అన్నాడు. నరసరావుపేట పట్టణం చిన్నది అయినప్పటికీ మనసు మాత్రం మంచిదని కితాబిచ్చాడు.
 
ఈ సమావేశంలో ఇంకా అప్పటి స్పీకరు కోడెల శివప్రసాదరావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఆరాధించే వ్యక్తుల్లో తానూ ఒకడినని అన్నాడు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, వైస్ చైర్మన్ మీరావలి, రైల్వే డివిజనల్ మేనేజర్ విజయ్‌శర్మ, హౌసింగ్ సిఈ మల్లికార్జునరావు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, మున్సిపల్ కమిషనర్ భానూప్రతాప్, ఆర్డీవో ఎం శ్రీనివాసరావు, డ్వామా పీడీ కృష్ణ కపర్ధి, తదితరులు, ఇతర అధికారులు, అనధికారులు,పట్టణ ప్రజలు పాల్గొన్నారు. తొలుత స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి పట్టణంలో నిర్వహించిన అభివృద్ధి పనులను దగ్గరుండి చూపించారు. ఈ సందర్బంగా భువనచంద్ర టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన 1500 గృహాలకు సంబంధించిన శిలాఫలకం, భూగర్భ డ్రైనేజీ శిలాఫలకం, రైల్వే అండర్ బ్రిడ్జి శిలాఫలకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆవిష్కరించాడు.అనంతరం రైల్వే అండర్ బ్రిడ్జి, భూగర్భ డ్రైనేజీ-2, గృహ నిర్మాణాలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపనలు చేసాడు.
 
=== చివరి రోజు (13.12.2015) ===