ఝాన్సీ లక్ష్మీబాయి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎ఆక్రమణ: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 25:
 
== ఆక్రమణ ==
[[పెళ్ళి|వివాహం]] తరువాత ఆమె పేరు లక్ష్మిబాయిగా మార్చబడింది. సభలో ఆమె తండ్రికున్న ప్రాభల్యం వలన, మిగిలినినమిగిలిన యువతులు, ఎవరైతే ''జెనన'' కి నిర్బంధం చేయబడి ఉంటారో, వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఈమెకు వుండేది.ఆమె సాయుధ దళం, గుర్రపుస్వారీ, [[విలువిద్య]]<nowiki/>లలో ప్రావీణ్యం సంపాదించింది, అంతే కాకుండా తన స్నేహితురాల్లందరినీ చేర్చుకొని సభలో ఒక సైన్యాన్ని తయారుచేసింది.
 
1851 లో రాణి లక్ష్మిబాయి తన కుమారుడికి జన్మనిచ్చింది, కాని అతను తన నాలుగు నెలల వయస్సులోనే చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయిన తరువాత, ఝాన్సీ యొక్క రాజు మరియు రాణి దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకొన్నారు. కాని రాజు అయిన ఆమె [[భర్త]] తన కుమారుడి మరణం నుంచి తేరుకోలేక, 1853 నవంబర్ 21 లో పగిలిన హృదయముతో చాలా బాధ పడుతూ చనిపోయాడని చెప్పబడింది. వీరు దత్తత తీసుకునే సమయానికి [[డల్హౌసీ]] భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దామోదర్ రావు రాజా కు రక్త సంబంధం కానందువలన అంటే దత్త సంబంధం కావున, ఈస్ట్ ఇండియా కంపనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డెల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి [[లండన్]] కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1854 లో రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.
"https://te.wikipedia.org/wiki/ఝాన్సీ_లక్ష్మీబాయి" నుండి వెలికితీశారు