శంతనుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
[[File:Ravi Varma-Shantanu and Satyavati.jpg|thumb|250px|A painting by [[Raja Ravi Varma]] depicting Shantanu wooing the fisherwoman [[Satyavati]]]]
[[File:Bheeshma oath by RRV.jpg|thumb|left|250px|Devavrata taking the Bhishma Pratigya]]
నాలుగు సంవత్సరాల తరువాత శంతనుడు యమునా ఒడ్డున ప్రయాణిస్తున్నప్పుడు తెలియని దిశ నుండి వస్తున్న అద్భుతమైన సువాసన వచ్చింది. సువాసన కారణాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన సత్యవతిని (యోజనగంధి) చూశాడు. ఆమె నుండి దివ్యమైన సువాసన వాసన వస్తోంది. సత్యవతి తన గ్రామంలోని మత్స్యకారుల రాజు దత్తపుత్రిక. ఆమెను చూడగానే శంతనుడు ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. సత్యవతి తన తండ్రి అనుమతిస్తేనే వివాహం జరిగుతుందని చెప్పింది. శతనుడు మత్స్యరాజు వద్ద సత్యవతిని ఇమ్మని కోరిన తరువాత, సత్యవతి కుమారుడు హస్తినాపుర సింహాసనానినికి వారసత్వంగా పొందాలనే షరతుతో ఆమె తండ్రి వివాహానికి అంగీకరించారుఅంగీకరించాడు.
 
తన పెద్ద కుమారుడు దేవవ్రత సింహాసనం వారసుడు కావడంతో శంతనుడు రాజుపదవి గురించి తన మాట ఇవ్వలేకపోయాడు. అయినప్పటికీ దేవవ్రతుడు ఈ విషయం తెలుసుకున్నాడు మరియు తన తండ్రి కోసం సత్యవతి పిల్లలకు అనుకూలంగా సింహాసనం మీద తన హక్కును త్యజిస్తానని మత్స్యరాజుకు మాట ఇచ్చాడు. సందేహాస్పద అధిపతికి భరోసా ఇవ్వడానికి సత్యవతి జన్మించిన భవిష్యత్తు తరాలను కూడా తన సంతానం సవాలు చేయకుండా చూసుకోవటానికి జీవితకాల బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తానని కూడా ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ విన్న వెంటనే మత్స్యరాజు సత్యవతి, శాంతనుల వివాహానికి అంగీకరించాడు. దేవవ్రతుడు అని దేవతలు ఆయన చేసిన ప్రమాణం కారణంగా ఆయనకు భీష్ముడు (భీషణ ప్రతిజ్ఞ చేసినవాడు) పేరు పెట్టారు. సత్యవతితో హస్తినాపురానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన తన తండ్రికి చేసిన ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. ఈ విషయం గురించి విన్న శంతనుడు భీష్ముని ప్రశశించి కుమారుడు చేసిన త్యాగానికి ప్రతిగా భీష్ముడికి ఇచ్చామరణం (కోరుకున్న సమయంలో మరణించడం) ఒక వరంగా ఇచ్చాడు. శంతనుడికి, సత్యవతికి చిత్రంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. శాంతనుడు మరణించిన తరువాత విచిత్రవీర్యుడు హస్తినాపుర రాజు అయ్యాడు. ఎందుకంటే శంతనుడు జీవించి ఉన్నప్పుడే చిత్రాంగదుడు అదే పేరు గల గంధర్వుడి చేత చంపబడ్డాడు.{{citation needed|date=June 2016}}
"https://te.wikipedia.org/wiki/శంతనుడు" నుండి వెలికితీశారు