"రామాయణము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
24,000 [[శ్లోకము]] లతో కూడిన రామాయణము భారతదేశము, [[హిందూ ధర్మము]] ల [[చరిత్ర]], [[సంస్కృతి]], నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శ జీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.
 
వాల్మీకి రామాయణమే గాక, వేదవ్యాసుని ఆధ్యాత్మ రామాయణము, భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నిక గన్నవి. ఇంక రామాయణములోని పాత్రలు, సంఘటనలు, భావములు, తత్వములుతత్త్వములు అంతర్గతముగా నున్న పురాణములు, కథలు, కావ్యములు, పాటలు అన్ని భారతీయ భాషలలోను లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. కాని వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణముగా సర్వత్రా అంగీకరింప బడుతున్నది. ఆదికవి [[వాల్మీకి]] ప్రార్థన సంప్రదాయముగా చాలామంది కవులు స్మరిస్తారు.
 
: కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
: ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
 
: కావ్యం రామాయణం సీతాయాశ్చచరితమ్సీతాయాశ్చరితమ్ మహత్
: పౌలస్త్య వధమిత్యేవ, చకార చరిత వ్రత:
ramayanam lo
:రామాయణ మహా మాలా రత్నం వందే అనిలాత్మజమ్
 
రామ నామము సకల పాప హరమనీ, మోక్షప్రథమనీమోక్షప్రదమనీ పలువురి నమ్మిక. రమంతే సర్వేజనాః గుణైతి ఇతి రామః (తన సద్గుణముల చేత అందరినీ సంతోషింపజేసేవాడు రాముడు)అని రామ శబ్దానికి వ్యుత్పత్తి చెప్పబడింది."రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమశ్శివాయ" నుండి 'మ' బీజాక్షరము, అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి 'రా' బీజాక్షరము పొందుపరచబడియున్నవని ఆధ్యాత్మిక వేత్తల వివరణ. మూడు మార్లు "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించునని శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడింది.
 
: '''శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే'''
: '''సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్తత్తుల్యమ్ రామనామ వరాననే'''
 
== వాల్మీకి - రామాయణ కావ్యావతరణము గురించిన కథ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2772390" నుండి వెలికితీశారు