హర్యానా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 37:
 
== చరిత్ర ==
[[పంజాబ్]] ప్రాంతములో అధికముగా [[హిందీ]] మాట్లాడే భాగము హర్యాణా అయినది. [[పంజాబీ]] మాట్లాడే భాగము పంజాబ్ రాష్ట్రము అయినది. ప్రస్తుత హర్యాణా జనాభాలో హిందువులు అధిక సంఖ్యాకులు. భాషా సరిహద్దు మీద ఉన్న [[ఛండీగఢ్]], [[కేంద్ర పాలిత ప్రాంతము]]గా యేర్పడి రెండు రాష్ట్రములకు రాజధానిగా వ్యవహరింపబడుతున్నది.
 
4000 సంవత్సరాల పురాతన చరిత్రగల హర్యాణా [[వైదిక]] మరియు [[హిందూ]] నాగరికతలకు పుట్టినిల్లు. 3000 సంవత్సరాల క్రితము ఇక్కడే [[శ్రీకృష్ణభగవానుడు]] [[మహాభారతం|మహాభారత]]యుద్ధ ప్రారంభ సమయమున [[గీత]]ను ప్రవచించాడు. మహాభారత యుద్ధమునకు మునుపు సరస్వతి లోయలోని, కురుక్షేత్ర ప్రాంతములో దశ చక్రవర్తుల యుద్ధము జరిగింది. మహాభారతములో (క్రీ.పూ.900) హర్యాణా ''బహుధాన్యక'' (సకల సంపదల భూమి) అని వ్యవహరింపబడింది. ''హరియానా'' అన్న పదము మొదట ఢిల్లీ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న 1328 ప్రాంతపు [[సంస్కృత]] శాసనములో కనిపిస్తున్నది. ఈ శాసనములో ఈ ప్రాంతము భూతల స్వర్గముగా అభివర్ణించబడింది. ఆర్య సంస్కృతి ఇక్కడే పుట్టి పెరిగినదని చాటుతున్నది.
"https://te.wikipedia.org/wiki/హర్యానా" నుండి వెలికితీశారు