భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[భారత్]] లోని వివిధ ప్రాంతాల ప్రజలు అనేక [[భాష|భాషలు]] మాట్లాడుతారు. కనీసం 800 భాషలు, 2000 వరకు యాసలు గుర్తించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు గాను [[హిందీ]], [[ఇంగ్లీషు]] భాషలను వాడాలని [[భారత రాజ్యాంగంప్రభుత్వం ]] నిర్దేశించింది. వివిధ రాష్ట్రాలు తమతమ అధికార భాషలను వాడుతాయి. కేంద్ర ప్రభుత్వంతో సంపర్కించేందుకు ఇంగ్లీషు వాడుతాయి. ఉదాహరణకు, కేంద్రం [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వానికి [[హిందీ భాష|హిందీ]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>ల్లో ఉత్తరాలు రాస్తే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషుల్లో రాస్తుంది. హిందీ, ఇంగ్లీషులతో కలిపి భారత్ లో 24 అధికార భాషలు ఉన్నాయి. అధికార భాషా కమిషను వద్ద ఈ భాషలకు ప్రాతినిధ్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు పై భాషల్లో దేనిలోనైనా సమాధానాలు రాయవచ్చు.
 
భారత రాజ్యాంగం లోని 343 వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. 1950 లో రాజ్యాంగంలో పొందుపరచినట్లుగానే 1965 లో ఇంగ్లీషు అధికార భాష హోదాను (హిందీతో సమానంగా) కోల్పోయింది. ఆ తరువాత దాన్ని అదనపు అధికార భాషగా కొన్నాళ్ళపాటు కొనసాగించి, హిందీని పూర్తి స్థాయిలో అమలుపరచాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ఉండేది. అయితే, హిందీ అంతగా ప్రాచుర్యం పొందని దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడంతో ''జంట భాషల'' పద్ధతి ఇంకా కొనసాగుతూ వస్తోంది. శీఘ్ర పారిశ్రామికీకరణ, ఆర్థిక వ్యవస్థపై బహుళజాతి సంస్థల ప్రభావం మొదలైన వాటి కారణంగా ప్రభుత్వంలోనూ, బయటా కూడా దైనందిన కార్యకలాపాల్లో ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. దాన్ని తొలగించాలన్న ప్రతిపాదనలు అటకెక్కక తప్పలేదు.