పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 261:
ముస్లిం మతాచార వివాహం ఒక పవిత్ర కార్యం కాదు. అది స్త్రీ పురుషుల మధ్య మత సమ్మతి పొందిన ఒక ఒప్పందం. ముస్లిం వివాహపు ముఖ్య ఉద్దేశం స్త్రీ పురుషులు న్యాయ బద్ధమైన వైవాహిక జీవితం గడపడం. వైవాహికేతర సంబంధం ముస్లిం ధర్మ శాస్త్రం ప్రకారం అపవిత్రమైన సంబంధం. ఇది వ్యభిచారంతో సమానం. ఆలాంటి సంబంధం కలిగి వున్న స్త్రీ పురుషులకు జన్మించిన సంతానం అక్రమ సంతానంగా ముద్ర వేయబడి వారికి సక్రమ సంతానానికి లభించే హక్కులు ఏవీ సంక్రమించవు. పెళ్ళి తప్పక చెయ్యాలని అందరు ప్రవక్తలు చెప్పారు. పెళ్ళి సగం విశ్వాసం అన్నారు. వైవాహిక జీవితం, కుటుంబ వ్యవస్థకు పునాది, సమాజాన్ని సక్రమంగా పట్టి ఉంచే వల అన్నారు. వివాహం స్త్రీ పురుషుల మధ్య చట్టపరమైన ఒడంబడిక, సామాజిక కట్టుబాటు. ముస్లిం పురుషుడు నలుగురు స్త్రీల వరకు పెళ్ళి చేసుకోవచ్చు. ముస్లిం స్త్రీ మాత్రం ఒకే పురుషుడిని చేసుకోవాలి.
===ముస్లిం వివాహ చెల్లుబాటుకు ముఖ్య షరతులు===
న్యాయ సమ్మతమైన ముస్లిం వివాహానికి ఎటువంటి ప్రత్యేకమైన మతపరమైన కార్యక్రమాలు, క్రతువులూ ఉండవు. యుక్త వయస్సు వచ్చి వివాహా ఒప్పందానికి అంగీకరించగలిగే ప్రతి వ్యక్తీ వివాహానికి అర్హులే. యుక్త వయసు అంటే 15 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండటం. మైనర్ ముస్లిం బాలికకు వివాహం జరపడానికి ఆమె సమీప సంరక్షుడి అనుమతి అవసరం. బాల్య వివాహాల చిరోధక చట్టం 1978 ముస్లిఖ్ మతస్థులకు కూడా వర్తిస్తుంది. దీని ప్రకారం బాలికలకు 18 సం.లు, బాలురకు 21 సం.లు కనీస వివాహ పరిమితిగా నిర్ణయించబడింది. ఈ షరతును ఉల్లంఘించటం శిక్షించదగిన నేరం.
 
ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి ముఖ్యమైన షరతు ఒకరిచే వివాహ ప్రతిపాదన మరొకరిచే అనుమతి ఈ ప్రతిపాదన, అనుమతి ప్రక్రియ ఇద్దరు మతిస్థిమితం కలిగిన వ్యక్తుల సమక్షంలో ఒకే సమావేశంలో జరగాలి. ఈ ప్రక్రియలో వివాహ ఒప్పందానికి జరిపే సంభాషన స్పష్టంగానూ ఎటువంటి అపోహలకు తావు ఇవ్వనిదిగానూ ఉండాలి. ఈ ఒప్పందం సమయంలో వరుడు వధువుకు మెహర్ చెల్లింపుకు అంగీకరించాలి. ఈ చెల్లింపు ఉద్దేశం భార్యపట్ల భర్తకున్న గౌరవాన్ని ప్రకటించడ. మెహర్ నగదు రూపంలో గానీ, ఆస్తి రూపంలో గానీ ఉండవచ్చు. మెహర్ చెల్లించే ఒప్పందం ముస్లిం వివాహం చెల్లుబాటు కావడానికి మరొక ముఖ్య అంశం.
పంక్తి 281:
# కోర్టు డిక్రీ : ముస్లిం వివాహాల రద్దు చట్టం 1939 ప్రకారం కోర్టుల ద్వారా విడాకుల డిక్రీని పొందవచ్చు.
 
తలాక్ విధానంలో పెళ్ళీ రద్దు కావటానికి పవిత్ర ఖురాన్ లో ధర్మ ప్రవచనం చేయడం జరిగింది. దీని ప్రకారం సరైన కారణం ఉండి తలాక్ కు పూర్వమే భార్యాభర్తల మద్య వారి వారి కుటుంబాల నుండి చెరొకరు ఎంఫిక చేసిన ఇద్దరు అంధ్యవర్తుల ద్వారా సమస్యను రాజీపరిష్కారం కోసం ప్రయత్నం జరిపి ఉండాలి. ఆ ప్రయత్నం విఫలమైతే "తలాక్" చెల్లుబాటవుతుంది. తలాక్ అనేది నోటి మాట ద్వారా గానీ లిఖిత పూర్వకంగా గానీ ప్రకటించాలి. దీనికి ప్రత్యేకమైన నమూనా అంటూ ఏమీ లేదు. అయితే ఈ ప్రకటనలో భర్త చెప్పే లేదా ఉచ్చరించే మాటలు వివాహం రద్దు కావడానికి మాత్రమే ఉద్దేశించబడాలి. ముస్లిం భర్త తన ముస్లిం భార్యకు కోర్టు ప్రమేయం లేకుండనే విడాకులు ప్రకటించవచ్చు.
 
===ముస్లిం స్త్రీ విడాకులు పొందడం===
 
<!--
==వివాహ వయస్సు==
స్త్రీకి సంతాన యోగ్యత 18 నుండి 25 వరకూ ఎక్కువగా ఉంటుంది. 25 నుండి 30 వరకూ సంతాన యోగ్యత తగ్గుతుంది. 30 పైబడిన తర్వాత చాలా అరుదుగా మాత్రమే సంతాన యోగ్యత ఉంటుంది. పురుషుడికి వీర్యకణాల ఉత్పత్తి 25 నుండి 70 సంవత్సరాల వరకూ ఉంటుంది. కనుక వివాహానికి స్త్రీకి కనీసం 18 సంవత్సరాలు, పురుషుడికి కనీసం 25 సంవత్సరాలు ఉండాలి, భార్యా భర్తల మధ్య 3 నుండి 10 సంవత్సరాల తేడా ఉండవచ్చు, భర్త కంటే భార్య చిన్న వయస్కురాలై ఉండాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని భావించేవారు. కాని నేడు నగరాల్లో స్త్రీలు 30 సంవత్సరాలు దాటితే గాని వివాహానికి సిద్ధం కావడం లేదు. ఫలితంగా సంతానం కోసం వైద్యుల చుట్టూరా తిరుగుతున్నారు.
-->
 
==క్రైస్తవంలో వివాహం==
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు