బుర్రకథ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Undid edits by 2409:4070:182:A9F0:0:0:2B08:60A1 (talk) to last version by SATYA SAI VISSA
ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.3]
పంక్తి 1:
{{వికీకరణ}}
[[బొమ్మ:Burrakatha.jpg|250px|thumb|right|బుర్రకథ చెప్పుతున్న కథకులు]]
'''బుర్రకథ''' (Burrakadha), పల్లెపదాలు, వంత హాస్యాలు, బిగువైన కథనాలు, పద్యాలు, పాటలు అన్నిటినీ కలుపుకొంటూ సరదా సరదాగా సాగిపోయే ఒక [[తెలుగునాట జానపద కళలు|జానపద]] కళారూపం. పరిమితమైన ఆహార్యంతో, ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జన సామాన్యానికి చేరువగా వెళ్లే కళారూపాలలో హరికథ మొదటిది అయితే బుర్రకథ రెండవది. హరికథలో కొంత సంప్రదాయముద్ర ఉండి బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం.
==ఒక కళారూపం==
[[File:Burrakata kalaakaarulu.JPG|thumb|right|బుర్రకథ కళాకారులు.]]
 
[ subash batta ([బొమ్మ:Burrakadha).jpg|220x220px|thumb|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో రవీంద్రభారతి వద్ద ప్రదర్శింపబడిన బుర్రకథ|alt=]]
[[ఆంధ్ర ప్రదేశ్|తెలుగునాట]] జానపద వినోదగాన ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలుగా బాగా పేరు కొన్నాయి.ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటంబ నియంత్రణ, రాజకీయ ప్రచారము, ప్రజలను విజ్ఙానవంతులను చేయడము వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.[[జంగం కథలు|జంగంకథ]], [[పంబల వారు|పంబలకథ]], [[జముకుల కథలు|జముకులకథ]], [[పిచ్చుకుంటులవారు|పిచ్చుకుంట్ల కథ,]] తరువాతవచ్చింది.డాలు, కత్తితో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు వంతలున్నట్లే బుర్రకథలోకూడా ఉంటారు.
 
దీనికి మాన్యత కల్పించి పద్మశ్రీ బిరుదు సంపాదించుకున్నవారు షేక్ నాజర్. పేరునుబట్టి వీరు ఇస్లాం మతానికి చెందిన వారైనా చెప్పిన కథలలో ఎక్కువ భాగం హిందూ దేవీదేవతలకు చెందినవే. శ్రీకాకుళం పర్యటించినప్పుడు శ్రోతలు బొబ్బిలియుద్ధం కథ కోరారు. దానితో నాజర్ తానే కథారచనకూ నడుంబిగించాడు. అంతేకాదు సామ్యవాద దృక్పధం గల వీరిని 1940వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ నెల జీతంమీద కథలు చెప్పించి పల్లెలలో తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకున్నది.
 
నాజర్ బొబ్బిలియుద్ధం, అల్లూరి సీతారామరాజు ప్రహ్లాద, క్రీస్తు, పల్నాటి యుద్ధం బెంగాల్ కరువు వంటి వస్తు వైవిధ్యంగల కథలను చెప్పి రక్తికట్టించారు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు అవిచ్ఛిన్నంగా సాగింది.subash batta
 
==ప్రదర్శనా విధానం==
"https://te.wikipedia.org/wiki/బుర్రకథ" నుండి వెలికితీశారు