తెలుగు సినిమా పాట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎1979-1991: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
పంక్తి 7:
ఈ మధ్యకాలాన్ని డాక్టర్ పైడిపాల తన [[సినిమా పాట చరిత్ర]] అనే పరిశోధన గ్రంథంలో అయోమయంగా వివరించారు. [[అడవి రాముడు]], [[యమగోల]] చిత్రాలు సాధించిన విజయాలతో పాట స్వరూపం మారిపోయింది. పాటల రచయితల సంఖ్య పెరిగింది. ఈకాలంలో [[వేటూరి సుందరరామమూర్తి]] రాసిన గీతాలు యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ఇదే కాలంలొ [[సిరివెన్నెల]] చిత్రానికి పాటలు రాసి తెలుగు సినిమా పాటకు ఎంతో మంచిపేరు తెచ్చిన [[సీతారామశాస్త్రి]], తన తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా చేసుకొని నేటికీ సాహిత్యసౌరభాలతో కూడిన పాటల్ని రచించి సినీ ప్రేమికుల్ని అలరిస్తున్నారు.
 
"విరించినై విరచించితిని ఈ కవనం" అంటూ రాసిన శాస్త్రిగారు "బోటనీ పాఠముంది మేటనీ ఆటవుంది దేనికో ఓటు చెప్పరా" అనే యూత్ ను ఊగించారు. అదే సమయంలో [[వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్|వెన్నెలకంటి]], [[జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు]] మొదలైన గీత రచయితలు సినీరంగ ప్రవేశం చేశారు. "గువ్వ గోరెంకతో అడిందిలే బొమ్మలాట" అనే పాటతో [[ఖైదీ నం. 786]] చిత్రం ద్వారా [[భువనచంద్ర]] ప్రవేశించారు.
 
ఆకాలంలో వచ్చిన సినిమా పాటల్ని పరిశీలిస్తే అనేక ధోరణులు కనిపిస్తాయి. బాణీలకు సరిపోయే పదాల సమతూకంతోనే ఎక్కువగా పాటల రచన జరిగేది.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమా_పాట" నుండి వెలికితీశారు