వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
|}}
==ఉల్లి చేసే మేలు==
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్‌ని కత్తిరించేది, కేన్‌సరు రాకుండా కాపాడేది, రక్తపు పోటుకి పోట్లు పొడిచేది, వీర్యాన్ని వృద్ధి చేసేది, దోమలని తరిమికొట్టేది, తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది, రక్షక శక్తిని రక్షించేది, అస్తమా, శ్వాస పీల్చుకోవడం వల్ల ఇబ్బంది వంటి ఊపిరితిత్తుల రుగ్మతలను తగ్గించడానికి వెల్లుల్లి చక్కగా ఉపయోగపడుతుంది. నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పనిచేస్తుంది<ref>{{Cite web|url=https://www.ntnews.com/zindagi/medicinal-treasure-garlic-3382|title=ఔషధ నిధి వెల్లుల్లి|website=www.ntnews.com|access-date=2020-01-26}}</ref> వెల్లుల్లి ఇన్సూలిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది.<ref>{{cite news |last1=namasthe telangana |title=vellulli vyasam |url=https://www.ntnews.com/zindagi/medicinal-treasure-garlic-3382 |accessdate=26 January 2020}}</ref>
 
'''వెల్లుల్లి''' (Garlic) <ref>[http://www.beautyepic.com/amazing-health-benefits-of-garlic/ వెల్లుల్లి వల్ల కలిగె ఉపయోగాలు] 14 జూలై 2016</ref> మొక్క శాస్త్రీయ నామం 'ఏలియం సెతీవం' (''Allium sativum''). [[ఉల్లి]] వర్గానికి చెందినది. దీనిలో గంధకపు ద్రవ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల దీనినుండి వచ్చే వాసన ఆహ్లాదకరంగా ఉండదు. లిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం; నీరుల్లి కన్నా ఔషధ గుణాలు ఎక్కువ. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను, ఔషధంగాను ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో అనాది నుండి నేటివరకు ఆదరణలో ఉన్న [[సిద్ధ]], [[ఆయుర్వేద|ఆయుర్వేదం]], యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించేరు. సంప్రదాయిక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతీలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి. ఇటీవల ఎల్లోపతీ వైద్యం కూడా వెల్లుల్లి విలువని గుర్తించింది.
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు