మొటిమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 105:
 
* ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్‌ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
* బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా సన్స్క్రీన్ ని చర్మానికి రాసుకోవడం మంచిది.సూటిగా సూర్యకిరణాలు తాకడం వలన చర్మంలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మం జిడ్డుగా మారుతుంది.
* ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రాట్లు తక్కువగా  ఉండే  ఆహారం తీసుకోవడం ఉత్తమం.
* ఆయిల్ తత్త్వం తక్కువగా ఉండే చర్మసౌందర్యా ఉత్పత్తులను వాడడం ఉత్తమం. నీటి శతం ఎక్కువగా ఉండే వాటిని వాడడం మంచింది.
* చర్మాన్ని రోజుకి 2 సార్లు అయినా శుభ్రపరచడం వలన కొంతమేరకు చర్మాన్ని కాపాడుకోవచ్చు. <ref>https://skinkraft.com/blogs/articles/pimples-on-nose</ref>
* రోజు నీరు ఎక్కువగా తాగడం వలన ఈ సెబమ్ ఉత్త్పతి తగ్గి చర్మం జిడ్డుబారకుండా ఉంటుంది.
* ప్రతిరోజూ చర్మాన్ని తేమాగా ఉండేలా చూసుకోవాలి 
* రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి దోహదం చేస్తాయి.
* మొటిమల సమస్య తీవ్రంగా గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్‌హెడ్స్‌) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.
* రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.
* కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మొటిమ" నుండి వెలికితీశారు