పువ్వాడ శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత సంగ్రహం: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 37:
 
==జీవిత సంగ్రహం==
వీరు 12 జూలై, 1906 తేదీన [[దివి]] తాలూకా [[మొవ్వ]] గ్రామంలో సుందరరామయ్య మరియు, అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. వీరు ఉభయ భాషా ప్రవీణ పరీక్షలో ఉత్తీర్ణులై అధ్యాపక వృత్తిలో విశేషంగా రాణించారు.
 
వీరు విజయవాడ హిందూ కళాశాలలోను, [[విజయనగరం]] మహారాజా కళాశాలలోను, బందరు హిందూ కళాశాలలోను, నేషనల్ కాలేజీ (ఆంధ్రజాతీయ కళాశాల) లలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసారు. వీరు చాలా పద్య, గద్య కావ్యాలు, మరియు నాటకాలను రచించారు. వీరి రచనలు కొన్ని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]], [[నాగార్జున విశ్వవిద్యాలయం]], [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]], ఉత్కళ విశ్వవిద్యాలయాలలో [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]], డిగ్రీ, భాషా ప్రవీణ విద్యార్థులకు పాఠ్యగ్రంథాలుగా నిర్ణయం చేసారు.
 
వీరి పెద తాతగారు [[పువ్వాడ రామదాసు]] మొవ్వ వేణుగోపాలస్వామి పై కీర్తనలు రచించి గానం చేశారు. వీరి రెండవ కుమారుడు [[పువ్వాడ తిక్కన సోమయాజి]] దుందుభి, జిగీష, సువర్ణ సౌరభం మొదలైన రచనలతో ప్రముఖుల ప్రశంసలందుకున్నారు.