హొ చి మిన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంతకము: +{{Authority control}}
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''[[హొ చి మిన్]] ''' (Ho Chi Minh) (జననం: మే 19, [[1890]]-మరణం: సెప్టెంబరు 3, [[1969]]) [[వియత్నాం]] [[సామ్యవాదం|సామ్యవాద]] నాయకుడు మరియు, ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన [[వియత్నాం]] పోరాటంలో ముఖ్య సూత్రధారి. ఇతని అసలు పేరు '''గుయెన్ టాట్ థన్'''.
[[దస్త్రం:Giap-Ho.jpg|thumb|హొచిమిన్ (కుడి ప్రక్క) మరియు, [[:en:Vo Nguyen Giap|వో నిగుయెన్ గియాప్]] (ఎడమ ప్రక్క) ]]
[[దస్త్రం:Ho Chi Minh Mausoleum 2006.jpg|thumb|హానోయ్ నగరంలో హొ చి మిన్ మౌసోలియమ్]]
[[దస్త్రం:Ho Chi minh estatua.jpg|thumb|హొ చి మిన్ విగ్రహం]]
హొ చి మిన్ 1890 మే 19న మధ్య వియత్నాం లోని కింలీన్ అనే [[గ్రామం]]లో జన్మించాడు. ఆ కాలంలో [[ఫ్రెంచి]] వారి వలస పాలనలో ఉన్న [[ఇండోచైనా]] ప్రాంతంలో వియత్నాం ఒక భాగంగా ఉండేది. సెకండరీ స్కూల్ విద్య పూర్తయిన తరువాత [[1911]]లో ఒక ఫ్రెంచి స్టీమర్లో వంట పని సహాయకునిగా చేరి ఆ తరువాత [[లండన్]] మరియు, [[పారిస్‌]] లలో పనిచేశాడు.
మొదటి ప్రపంచయుద్దం ముగిసిన తరువాత [[ఫ్రెంచి కమ్యూనిష్టు పార్టీ]] స్థాపనలో పాలు పంచుకున్నాడు. ఆ తదుపరి శిక్షణ కొరకు [[మాస్కో]] వెళ్ళాడు. ఆ తరువాత [[1924]]లో [[చైనా]] వెళ్ళి అక్కడ తన దేశ ప్రవాసులతో విప్లవోద్యమాన్ని నిర్మించాడు. [[1930]]లో [[ఇండో చైనా కమ్యూనిష్టు పార్టీ]]ను చైనాలో స్థాపించాడు. [[హాంకాంగ్]]లో [[కమ్యూనిష్టు ఇంటర్నేషనల్]] ప్రతినిథిగా ఉన్న సమయంలో [[1931]] జూన్ నెలలో [[బ్రిటిషు|బ్రిటిష్]] [[పోలీసులు]] హొను అరెష్టు చేసి [[1933]] వరకు జైలులో ఉంచారు. విడుదలైన తరువాత మరలా [[సోవియట్ యూనియన్]] వెళ్ళి తనకు సోకిన క్షయ వ్యాధి నయమయేంతవరకూ అక్కడే ఉన్నాడు. [[1938]]లో మరలా చైనా వెళ్ళాడు.
పంక్తి 12:
ఫ్రెంచ్ వారికి వారి వలసలను వదలుకోవటం ఇష్టంలేక పోవటంతో [[1946]] చివరలో ఇరుసేనల మధ్యన [[యుద్ధం]] ప్రారంభమైనది. 8సం.లు వియెత్ మిన్ [[గెరిల్లా]]లు ఫ్రెంచ్ దళాలతో పోరాడి చివరకు వారిని ''[[దీన్ బీన్ ఫు]]'' యుద్ధంలో [[1954]]లో ఓడించాయి. తరువాత [[జెనీవా]]లో జరిగిన చర్చలలో దేశం విభజింపబడి ఉత్తర ప్రాంతం మాత్రమే [[వియత్ మిన్]] ఉద్యమకారులకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఏర్పడిన [[ఉత్తర వియత్నాం]]లో హొ చి మిన్ [[సామ్యవాదం|సామ్యవాద]] సమాజాన్ని నిర్మించటానికి పూనుకున్నాడు.
 
[[1960]] వ దశకం ప్రారంభంలో [[సైగాన్]] రాజధానిగా [[అమెరికా]] సహాయంతో [[దక్షిణ వియత్నాం]]ను పరిపాలిస్తున్న కమ్యూనిష్టేతర ప్రభుత్వం మీద కమ్యూనిష్టు [[గెరిల్లా]]లు యుద్దాన్ని ప్రారభించారు. ఈ యుద్దమే చరిత్రలో [[వియత్నాం యుద్దం]]గా పిలువ బడింది. ఉభయ వియత్నాంలను ఏకీకృతం చేయ తలపేట్టిన హొ ప్రభుత్వం దక్షిణ వియత్నాంలో అచటి ప్రభుత్వ సైన్యాలమీద మరియు, [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] సైన్యాలమీద పోరాడుతున్న గెరిల్లాలకు సహాయంగా సైన్యాన్ని పంపినది.
 
హొచిమిన్ ఆరోగ్యం క్షీణించి సెప్టెంబరు 3, [[1969]]లో మరణించాడు. ఇతని మరణానంతరం ఇతని అనుచరులు దక్షిణ వియత్నాం లోని కమ్యూనిష్టు గెరిల్లాలకు సహాయాన్ని కొనసాగించారు. హొచిమిన్ చనిపోయిన తరువాత ఆరేళ్ళకు [[1975]]లో దక్షిణ వియత్నాంలో కమ్యూనిష్టులు అధికారంలోకి రావడంతో ఉభయ వియత్నాంలు కలిపివేయబడి [[సైగాన్]] పట్టణానికి [[హొచిమిన్ సిటీ]]గా నామకరణం జరిగింది.
"https://te.wikipedia.org/wiki/హొ_చి_మిన్" నుండి వెలికితీశారు