నందమూరి తారక రామారావు: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్యం: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 37:
}}
 
[[తెలుగు]]వారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే '''నందమూరి తారక రామారావు''' ([[మే 28]], [[1923]] - [[జనవరి 18]], [[1996]]) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన [[ఎన్.టి.ఆర్]], [[ఎన్.టి.రామారావు]]గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, [[తెలుగు]], [[తమిళం]] మరియు, [[హిందీ]] భాషలలో కలిపి దాదాపు 400 [[సినిమా|చిత్రాలలో]] నటించారు. తన [[ప్రతిభ]]<nowiki/>ను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. '''విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు'''గా బిరుదాంకితుడైన ఆయన, అనేక [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]], [[జానపద చిత్రాలు|జానపద]], [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, [[రాముడు]], [[కృష్ణుడు]] వంటి [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] పాత్రలతో [[తెలుగు]] వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో [[ఎన్.టి.ఆర్]] 13 [[చరిత్ర ఆధారిత చిత్రాలు|చారిత్రకాలు]], 55 [[జానపద చిత్రాలు|జానపద]], 186 [[సాంఘిక చిత్రాలు|సాంఘిక]] మరియు, 44 [[పౌరాణిక చిత్రాలు|పౌరాణిక]] చిత్రాలు చేసారు. రామారావు [[1982]] [[మార్చి 29]]న [[తెలుగుదేశం]] పేరుతో ఒక [[రాజకీయ పార్టీ|రాజకీయ]] పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే [[ఆంధ్ర ప్రదేశ్]]లో [[భారత జాతీయ కాంగ్రెసు|కాంగ్రెస్ పార్టీ]] ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు [[ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు|ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా]] పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.<ref name=ntr.telugudesam />
 
==బాల్యం==
పంక్తి 54:
<nowiki/><!--ఆ సమయంలో రామారావు డబ్బుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి బస్సు చార్జీలకు కూడా డబ్బుండేది కాదు.-->
 
[[1951]]లో కె.వి.రెడ్డి [[పాతాళభైరవి]], దాని తరువాత అదే సంవత్సరం [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్‌.రెడ్డి]] [[మల్లీశ్వరి]], [[1952]]లో ఎల్వీ ప్రసాదు [[పెళ్ళిచేసి చూడు]], ఆ తరువాత వచ్చిన [[కమలాకర కామేశ్వరరావు]] చిత్రం [[చంద్రహారం]] ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయావారివే. ప్రతీ సినిమాకు నెలకు 500 రూపాయిలు జీతం మరియు, 5000 రూపాయిల పారితోషికమూ ఇచ్చారు. [[పాతాళభైరవి]] 10 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.
 
[[1956]]లో విడుదలైన [[మాయాబజార్‌]]లో ఆయన తీసుకున్న 7500 రూపాయల పారితోషికం అపట్లో అత్యధికం అని భావిస్తారు. [[1959]]లో [[ఏ.వి.యం.ప్రొడక్షన్స్]] వారు నిర్మించి, విడుదల చేసిన [[భూకైలాస్]] చిత్రంలో [[రావణబ్రహ్మ]] పాత్రకు <!--నటించేందుకు ఆయన రావణుడి గూర్చి అధ్యయనం చేసి,--> రామారావు ప్రాణప్రతిష్ఠ చేసాడు. <!--మరెవ్వరూ ఆ పాత్రకు రామారావుగారిలా న్యాయం చేయలేరు. -->[[1960]]లో విడుదలయిన [[శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం]] భారీ విజయం సాధించింది. <!--ఆ సినిమా చూసి వెంకటేశ్వర స్వామి భక్తులు ఎన్.టీ.ఆర్. దర్శనం కోసం ఆయన ఇంటి ముందు వరుసలు కట్టారు.--> [[శ్రీమద్విరాటపర్వము]]లో ఆయన ఐదు పాత్రలు పోషించాడు. ఆ విధంగా 1950లలో ఎన్టీఆర్ ఎంతో ప్రజాదరణ పొందిన నటుడిగా ఎదిగాడు. సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవాడు. [[1963]]లో విడుదలైన [[లవకుశ]] అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరముల వరకు ఆయన పారితోషికం 4 లేదా 5 అంకెల్లోనే ఉండేది. [[1972]]నుంచి ఆయన పారితోషికం లక్షల్లోకి చేరింది.