పెళ్ళి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 2:
[[File:Wedding rings.jpg|thumb|right|వివాహ ఉంగరాల జత]]
{{హిందూ మతము}}
'''పెళ్ళి''' లేదా [[వివాహం (పెళ్లి)|వివాహం]] అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత మరియు, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.
 
==ఆంగ్ల శబ్ద వ్యుత్పత్తి==
'''పెళ్ళి''' అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తపది అనే పలు విధములుగా అర్ధములు ఉన్నాయి. [[ఆంగ్లం|ఆంగ్లభాషలో]]'''మ్యారేజి''' (Marriage) అని అంటారు. ఈ పదం [[:en:Middle English|మధ్య ఆంగ్ల]] పదమైన ''mariage'' నుండి వ్యుత్పత్తి అయినది. ఈ పదం మొదటగా క్రీ.పూ 1250-1300 లలో కనిపించినట్లు తెలుస్తుంది. ఈ పదం తర్వాత కాలంలో పాత ఫ్రెంచ్ భాషలో పదం ''marier'' (పెళ్ళి చేసుకొనిట) నుండి తుదకు [[లాటిన్]] పదమైన ''marītāre'' (భర్త లేదా భార్యను సమకూర్చుట) మరియు, ''marītāri'' అనగా వివాహం చేసుకొనుట. విశేషణ పదమైన ''marīt-us -a, -um'' అనగా పెళ్ళి సంబంధము లేదా పెళ్ళిలో పురుష రూపంలో '''[[భర్త]]''' అనే పదం లేదా [[స్త్రీ]] రూపంలో "భార్య" అనే పదానికి నామవాచక రూపంగా కూడా వాడుతారు."<ref name="OED_marriage">Oxford English Dictionary 11th Edition, "marriage"</ref> పెళ్ళీకి సంబందించిన పదం "matrimony" పాత ఫ్రెంచ్ పదం అయిన ''matremoine'' పదం నుండి ఉద్భవించింది. ఈ పదం క్రీ.పూ 1300 కాలంలోనిది. ఆ తర్వాత ఈ పదం ''mātrimōnium''అనే లాటిన్ పదం నుండి జనించింది.<ref name="Etymology">{{cite web|url=http://www.etymonline.com/index.php?term=matrimony |title=Online Etymology Dictionary |publisher=Etymonline.com }}</ref>
 
==హిందూ వివాహం==
పంక్తి 21:
కేవలం సబ్‌రిజిష్టర్ కార్యాలయంలో ఒక దస్తావేజు రాసి నమోదు చేయించినంత మాత్రాన హిందూ వివాహం చెల్లుబాటు కాదు. వివాహానికి సంబంధించిన ఆచార క్రతువులు నిర్వర్తించనిదే ఆ వివాహం సక్రమమైనదిగా గుర్తించలేము. అదే విధంగా హిందూ వివాహాల రిజిష్టర్ లో అసలు వివాహం కార్యక్రమమే జరుపకుండా నమోదు చేసిన వివరాలు ఆ వివాహాన్ని చలామణి చేయవు. అయితే వివాహ కార్యక్రమం పూర్తి అయినాక హిందూ వివాహ రిజిష్టర్ లో వధూవరులు తమ వివాహ వివరాలను నమోదు చెయవచ్చు. ఈ రిజిష్టర్ లోని నమోదు చేయబడిన అంశాలు వివాహం వాస్తవంగా జరిగినట్లు సాక్ష్యంగా ఉపయోగపడతాయి. అందువల్ల ఇలా నమోదు చేయడం దంపతులిద్దరికీ ఉపయోగకరం.
 
ఆంధ్రప్రదేశ్ లో అన్ని వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 35, మహిళా అభివృద్ధి, బాలలు మరియు, వికలాంగుల సంక్షేమ విభాగం తేది.24.09.2003 ద్వారా నిర్దేశించింది. హిందువులు 1955 నాటి హిందూ వివాహ చట్టంలో పేర్కొనబడిన విధానాల ద్వారా మాత్రమే కాక 1954 నాటి ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం వివాహం చేసుకోవచ్చు. అంతేకాక హిందూ మతాచార వివాహాన్ని కూడా ప్రత్యేక వివాహాల చట్టం పరిధిలో నమోదు చేసుకోవచ్చు. ఒక హిందూ మరొక హైందవేతర స్త్రీ పురుషుల మధ్య వివాహం ప్రత్యేక వివాహం చట్ట పరిధిలోకి వస్తుంది. స్త్రీ పురుషులిద్దరు తప్పనిసరిగా హిందువులు అయినపుడు మాత్రమే వారి వివాహం హిందూ వివాహ చట్టంలోని అంశాల ద్వారా నియంత్రించబదుతుంది.
===హిందూ వివాహ సంప్రదాయం===
* ధర్మార్ధ కామమోక్షాల నాలుగు పురుషార్ధాలలో ఒకటైన [[కామం|కామాన్ని]] ధర్మ బద్ధం చేటానికి పెద్దలు, [[ఋషులు]] ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్యం నిర్వహణా మార్గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. ఉదాహరణగా బాలసారె నుండి వివాహం వరకు ఉన్నా అనేక '''సుసంస్కారములు''' జరిపించటానికి హిందూ ధర్మశాస్తం ప్రకారము వివాహం జరగని వారుకాని, వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ, పురుషులయిననూ ఈ సంప్రదాయక కార్యక్రమములు నిర్వహించటకు అనర్హులు. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు. కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కళ్యాణము, సత్యనారాయణ వ్రతం, హోమం, [[యజ్ఞం]], యాగం లాంటివి నిర్వహించటానికి గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉంది.వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్ది తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి.
* తల్లిదండ్రుల అనుమతి లేకుండా 21 ఏళ్ళ లోపు వయసున్న యువతిని పెళ్లాడడం శిక్షార్హమైన నేరమని కర్ణాటక హైకోర్టు ప్రకటించింది.
===హిందూ మత వివాహ విధానము===
#హిందూ ధర్మ శాస్త్రముల ప్రకారము పూర్వకాలములో వివాహము కావలసిన వధూవరుల ఇరువురు తరపున తల్లిదండ్రులు, పెద్దవారు, దగ్గరివారు, స్నేహితులు, హితులు లేదా బంధువులు ముందుగా వధూవరుల [[జాతక సమ్మేళనము]] లోని ముఖ్యమైన 17 జాతక వివరణ విభాగములు మరియు, 20 వింశతి (కూట) వర్గములు అనే [[వివాహ పొంతనములు]] చూసిన పిదప సంబంధము నిశ్చయించుకునేవారు.
# ప్రస్తుత కాలములో వారి వారి అభిరుచుల, అవసరాల, అలవాట్ల, అందుబాటు, అవసరార్ధం, అవకాశం, ఆర్థిక స్థితిగతుల, ఆకాంక్ష అయినదనిపించుకునేందుకు, తదితరాల మేరకు సంబంధము కలుపుకొని నిశ్చయించు కుంటున్నారు. ప్రస్తుతము వివాహ సంబంధములు ఈ రోజుల్లో ఏక కుటుంబాలలో ఎక్కువగా ఆ కుటుంబములోని వారే నిశ్చయ నిర్ణయములు తీసుకోవడము అలవాటుగా మారుతూ ఆనవాయితీగా మారిపోయింది.
# జీవితంలో మరపురానిది పెళ్ళి. ఇది స్త్రీ పురుషులకు జీవన మైత్రి నిచ్చునది. శారీరక మానసిక స్థితి గతులలో విడదీయరానిది. వివాహము సర్వమతాల వారికి, వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఆమోదయోగ్యమైనది. హంగులతో ఆర్భాటాలతో వివాహము చేసుకొని ఆనందము పొందుట మన సామాజిక లక్షణము. వివాహం వల్ల ఆడ మగా ఇద్దరూ శారీరకంగాను, మానసికంగాను సుఖాన్నిపొందుతారు. పిల్లల కోసం, ఆస్తిపాస్తుల రక్షణ కోసం, వంశాభి వృద్ది కోసం పెళ్ళి అవసరం అవుతంది. "క్రమ బద్ధమైన జీవితాన్ని ఆశచూపి పురుషుడినీ, భధ్రతను భరోసాగా ఇచ్చి స్త్రీని, పెళ్ళి అనే తాడుతో గట్టిగా కట్టి పడేశాక ఇక వారివైపు చూడదు సమాజం. పెళ్ళికున్న పాత ధర్మాలు పాతబడ్డాయి, కొత్తవి రాలేదు" అన్నారు [[చలం]].
పంక్తి 234:
::ప్రధానముగా హిందూవులలో నాలుగు విధానలైన వివాహ పద్ధతులున్నాయి. అవి. 1. బ్రహ్మీ వివాహం, 2. గాంధర్వ వివాహం, 3. క్షాత్ర వివాహం. 4. రాక్షస వివాహం. [మూలం.ప్రాచీన తాళ పత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం. అచార, ధర్మములు - ఆలోచనలు.రచన: బ్రహ్మశ్రీ గుత్తికొండ వేంకటేశ్వర్లు.]
===బ్రహ్మీ వివాహం===
::ఋషి సాంప్రదాయ బద్దమైన బ్రాహ్మీ వివాహం ఆర్య సమ్మతమైన వివాహము. వధూ వరుల కుల పెద్దలు, తల్లి దండ్రులు అనుమతించి అంగీకరించి, ఆశీర్వదించి వైధిక విధితో ఆచార యుక్తముగా జరిపించిన వివాహము అని అంటారు. ఇది సనాతనమైనది సర్వ జన సమ్మతమైనది మరియు, సత్సంప్రదాయము. [మూలం.ప్రాచీన తాళ పత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం. అచార, ధర్మములు - ఆలోచనలు.రచన: బ్రహ్మశ్రీ గుత్తికొండ వేంకటేశ్వర్లు. పుట 30]
===గాంధర్వ వివాహం===
::గాంధర్వ వివాహం:- యువతీ యువకులు ఇద్దరూ యుక్త వయస్సు గలవారైయుండి, మంచి చెడుల విచక్షణ కలిగి ఉండి, ఒకరినొకరు ఇష్టపడి, పెద్దల అంగీకారం గానీ ప్రమేయము లేకపోయినా, తమంత తాముగా రహస్యముగా వివాహం చేసుకొనడాన్ని గాంధర్వ వివాహము అని అంటాము. ఇతః పూర్వము శకుంతల దుష్యంతుల వివాహము ఈ విధముగానే జరిగినట్టు జెప్పబడుతుంది. పూర్వము గంధర్వులు, రాజులు, చక్రవర్తుల ఈ విధమైన వివాహము చేసుకునేవారు.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి" నుండి వెలికితీశారు