భారత అత్యవసర స్థితి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇందిరా గాంధీ ఎదుగుదల: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
 
===''రాజ్ నారాయణ్'' తీర్పు===
[[1971]] పార్లమెంటరీ ఎన్నికల్లో ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన [[రాజ్ నారాయణ్]] అలహాబాద్ హైకోర్టులో ఇందిరా గాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వినియోగించుకున్నారని కేసు దాఖలుచేశారు. నారాయణ్ తరఫున రాజకీయ నాయకుడు, న్యాయవాది [[శాంతి భూషణ్]] వాదించారు. ఇందిరా గాంధీ ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సివచ్చింది. ఓ ప్రధాని కేసు విచారణలో ప్రశ్నించబడడం అదే తొలిసారి. [[1975]] [[జూన్ 12]]న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ''జగ్మోహన్ లాల్ సిన్''హా ప్రధాని మీదిమీద ఆరోపణలు వాస్తవమని తేలిందంటూ కేసు తీర్పునిచ్చారు. ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పునివ్వడమే కాక, ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని రద్దుచేశారు. ఓటర్లకు లంచాలివ్వడం, ఎన్నికల అక్రమాలు వంటి ఆరోపణలు వీగిపోయాయి, కానీ ఆమె ప్రభుత్వ యంత్రాగాన్ని తప్పుగా వినియోగించుకున్న అంశంలో నేరస్తురాలని తేలింది. ఈ నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సభలకు వేదికలు నిర్మించడం, వాటికి రాష్ట్ర విద్యుత్తు విభాగం నుంచ విద్యుత్తు వినియోగించుకోవడం, అప్పటికి రాజీనామా చేయని ప్రభుత్వాధికారి యశ్ పాల్ పూర్తయ్యేలా చూడమని దర్శకుడు అన్నారు.<br />
ఇందిరపై మరింత తీవ్రమైన ఆరోపణలు ఉన్నా అవి తొలగి వాటితో పోలిస్తే అల్పమైన ఆరోపణల వల్ల ఆమెను పదవి నుంచి తొలగించడంతో, ''ద టైమ్స్'' ఈ పరిణామాన్ని ''ట్రాఫిక్ టికెట్ మీద ప్రధానమంత్రిని పదవిలోంచి తలొగించడంగా'' అభివర్ణించింది. ఐతే వ్యాపార, విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగ యూనియన్లు చేసిన ఆందోళనలతో దేశంలోని పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. జెపి, రాజ్ నారాయణ్, [[సత్యేంద్ర నారాయణ్ సిన్హా]], [[మొరార్జీ దేశాయి]]ల నాయకత్వంలో [[ఢిల్లీ]]లో చేసిన ఆందోళనలో పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసాలకు దగ్గర్లోని రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. ప్రధానికి వ్యతిరేకంగా జస్టిస్ సిన్హా తీర్పునివ్వడానికి దాదాపు నాలుగేళ్ళు పట్టడంతో నారాయణ్ నిరంతర ప్రయత్నాలు, పట్టుదల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.<br />
ఇందిరా గాంధీ హైకోర్టు నిర్ణయాన్ని [[సుప్రీం కోర్టు|దేశ అత్యున్నత న్యాయస్థానంలో]] సవాలుచేశారు. జస్టిస్ [[వి. ఆర్. కృష్ణ అయ్యర్]] [[1975]] [[జూన్ 24]]న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, ఎంపీగా ఇందిర పొందుతున్న అన్ని సౌకర్యాలను ఆపివేయాలని, ఓటింగు నుంచి నిరోధించాలని ఆదేశించారు. ఐతే ఆమె ప్రధానిగా కొనసాగడానికి అనుమతించారు.