నిడమర్తి ఉమా రాజేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
1967 నుండి 1977 మే దాకా విశాలాంధ్ర సాహిత్యానుబంధ సంపాదకునిగా పనిచేసి, అభ్యుదయ రచయితలకు దాన్నొక వేదికగా తీర్చిదిద్దాడు. కృష్ణాజిల్లా అరసం ప్రధాన కార్యదర్శిగా నాటక విభాగం, చిత్రకళావిభాగం ప్రారంభించి [[ధవళ సత్యం]] దర్శకత్వంలో, వీరాసారధ్యంలో ఎం.జి.రామారావు రచించిన ''ఎర్రమట్టి'' నాటక ప్రదర్శనకూ, గని వంటి గాయకులు, మోహన్‌ వంటి అభ్యుదయ చిత్రకారుల తయారీకి, ఉదయతార, ఎర్రపూలు, సమైక్యతావాణి, సుడి వగైరాలతో అరసం ప్రచురణకి నాంది పలికాడు. 1977 నుండి 1992 వరకు మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకుడిగా పనిచేశాడు.
 
ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి-కోశాధికారిగా అరసం పునరుద్దరణ కృషిలో ముఖ్యపాత్ర వహించాడు. ఇతని సంపాదకత్వంలో పందకొండేళ్ళ కృషి ఫలితంగా ''స్వెత్లానా ద్జేనిత్‌'' కూర్చిన రష్యన్‌-తెలుగు నిఘంటువు వెలుగు చూసింది. భార్య శ్యామలాదేవితో కలిసి హిందీ నుండి కిషన్‌ చందర్‌ ''ఐదుగురు లోఫర్లు'', ''జంగ్లీ'' లను తెలుగులోని అనువదించాడు. ఇతడు 1992లో పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారం అందుకున్నాడు<ref name="విశాలాంధ్ర 2010">{{cite news |last1=విలేకరి |title=అభ్యుదయ రచయిత ఉమారాజేశ్వరరావు కన్నుమూత |url=http://54.243.62.7/headlines/article-19112 |accessdate=6 April 2020 |work=విశాలాంధ్ర దినపత్రిక |date=26 July 2010}}</ref>.
 
మాస్కోలో ఉద్యోగ విరమణానంతరం బెంగళూరులో స్థిరపడి అక్కడ అరసం శాఖను ప్రారంభించాడు. 1997 నుండి 2008 వరకు బెంగళూరులో అరసం తరఫున 103 కార్యక్రమాలను నిర్వహించాడు. బెంగళూరు శాఖ తరఫున కథాతరంగాలు, కవితాతరంగాలు సంకలనాలను తన సంపాదకత్వంలో వెలువరించాడు.
 
==రచనలు==
==మరణం==