పి.సుశీల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి ఆంగ్ల పాఠ్యం అనువాదంతో విస్తరణ
పంక్తి 49:
1960 ల ప్రారంభంలో సుశీల అన్ని దక్షిణ భారత భాషా చిత్రాలలో తిరుగులేని ప్రధాన మహిళా గాయకురాలిగా ఎదిగింది.పాత అనుభవజ్ఞులైన గాయకులందరినీ సంగీత నేపథ్యంలోకి తీసుకువచ్చారు.1960 వ సంవత్సరంలో సుశీల సీత చిత్రానికి [[వెంకటేశ్వరన్ దక్షిణామూర్తి]] స్వరకల్పనతో మలయాళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి [[జి. దేవరాజన్]], [[ఎం. కె. అర్జునన్]] వంటి మలయాళ స్వరకర్తలతో ఆమె అనేక విజయవంతమైన పాటలను రికార్డ్ చేసింది. [[కె. జె. ఏసుదాసు|కె. జె. యేసుదాస్‌తో]] కలిసి ఆమె అనేక మలయాళ యుగళగీతాలను రికార్డ్ చేసింది. 1965 లో [[ఎం.ఎస్.వి. రామమూర్తి|ఎం.ఎస్.వి. రామమూర్తితో]] ఆమె అనుబంధం విడిపొయిన తరువాత కూడా, [[ఎం. ఎస్. విశ్వనాథన్|ఎం.ఎస్. విశ్వనాధన్]] ఆమెతో అనుబంధం కొనసాగించాడు.ఎం.ఎస్.వి. రామమూర్తితో విడిపోయిన తరువాత ఎం.ఎస్. విశ్వనాధన్  కింద ఆమె యుగళగీతాలు టి.ఎం. సౌందర్రాజన్, ఇతర సంగీత స్వరకర్తలతో గాత్రం చేసిన సోలో సాంగ్స్ ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందాయి.1960 నుండి 1985 వరకు ప్రతి ఇతర సంగీత స్వరకర్త, చిత్ర నిర్మాతకు ఆమె మొదటి గాయనిగా ఎంపికలో నిలిచింది.
 
1968 నవంబర్ 29 న విడుదలైన ఉయర్ధ మణితన్ తమిళ చిత్రం రంగస్థలనాటకంలాగా 125 రోజులకు పైగా వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ చిత్రంలోఎం.ఎస్. విశ్వనాధన్ స్వరకల్పన చేసిన "పాల్ పోలేవ్" (naalai intha velai paarthu) పాటగాత్రం చేసిన సుశీలకు 16 వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా మొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని 1069 లో గెలుచుకుని, ఆ వర్గానికి ఆమె ప్రారంభగ్రహీతగా నిలిచింది.<ref>https://variety.com/2013/film/global/tamil-songwriter-vaali-dies-at-83-1200565558/</ref>అదే పాటకు ఆమె తమిళనాడు రాష్ట్ర అవార్డును కూడా పొందింది.<ref>{{cite web|url=http://psusheela.org/awards.html|title=Melody Queen P. Susheela|publisher=}}</ref> దీని ద్వారా భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన జాతీయ అవార్డులను అందుకున్న వారిలో సుశీల ఒకరుగా గుర్తింపు పొందింది.ఆ సంవత్సరాల్లోనే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా భావించే లతా మంగేష్కర్ తో సుశీల బలమైన స్నేహాన్ని పెంచుకుంది.సుశీల చేసిన అన్ని పనులను తరచుగా లతా మంగేష్కర్ ప్రశంసించింది.సుశీల చండిప్రియా చిత్రంలో జయప్రద చేసిన నృత్యం కోసం "శ్రీ భాగ్య రేఖ - జననీ జననీ" అనే గానం చేసిన పాట ప్రేక్షకులలో అత్యంత గుర్తింపు పొందింది.సుశీల ఎం.ఎస్.విశ్వనాధన్ ను తన గురువుగా భావిస్తుంది.అతని సంగీత దర్శకత్వంలో 1955-1995 వరకు సుశీల పాడిన పాటలలో గరిష్ట ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి.
 
1970 వ దశకంలో సుశీల దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు అన్ని ప్రధాన జాతీయ అవార్డులను గెలుచుకుంది. [[కె.వి.మహదేవన్]], [[లక్షీకాంత్ ప్యారేలాల్]], [[ఎల్. వైద్యనాథన్]], [[లక్ష్మీ కిరణ్]], [[ఎస్.ఎల్.మనోహర్]], [[అజిత్ మర్చంట్]], [[జి.దేవరాజన్]], [[ఎస్. ఎన్. త్రిపాఠి]] వంటి సంగీత దర్శకులతో ఈ కాలంలో ఆమె హిందీ పాటలను కూడా రికార్డ్ చేసింది. మనోహర్, అజిత్, జి. దేవరాజన్, ఎస్.ఎన్. త్రిపాఠి, మరొక గొప్ప సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] కోసం కొన్ని ముఖ్యమైన పాటలు పాడింది.1980 నుండి యం.యస్.విశ్వనాధన్ ఇళయరాజాతో తన బలమైన అనుబంధంతో [[ఎస్. జానకి|జానకి]] వారితో మంచి స్థానం సంపాదించినప్పటికీ, సుశీల 1985 వరకు అగ్రస్థానంలో కొనసాగింది.1985 తరువాత కూడా అనేక మంది సంగీత దర్శకులు సుశీలను పురాణ గాత్రానికి ఎంపికచేసుకున్నారు.1986 తరువాత కూడా ఆమె చలనచిత్ర హిట్ పాటల ఎంపిక చేసుకుని 2005 వరకు అలాగే పాటలను కొనసాగించింది.
 
==పురస్కారాలు==
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఆరు దశాబ్దాలుగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్]], ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండింటినీ వివిధ భారతీయ భాషలలో ఒక మహిళా గాయనిగా పాడినందుకు ఆమె గుర్తింపు పొందింది. ఆమె ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక రాష్ట్ర అవార్డులను కూడా అందుకుంది.<ref>{{Cite web|url=https://thesouthernnightingale.net/about/|title=About|date=2015-06-28|website=The Southern Nightingale|language=en|access-date=2020-04-09}}</ref>దక్షిణ భారత సినిమాలో స్త్రీవాదాన్ని నిర్వచించిన గాయకురాలిగా సుశీలా విస్తృతంగా ప్రశంసలు అందుకుంది.‘’ప్రతిష్టాత్మక గౌరవం’’ అనే జాతీయ అవార్డును ప్లేబాక్ సింగర్సులో ఉయర్ధా మణిధన్ అనే తమిళ చిత్రానికి సుశీల మొదటి గ్రహీతగా గెలుచుకుంది.ఆమెను "గాన కోకిల" "గాన సరస్వతి" అని పిలుస్తారు. ఆమె పాడిన ఏ భాషలోనైనా అక్షరాల ఉచ్చారణ చాలా స్పష్టంగా, కచ్చితంగా ఉండే గొప్ప గాత్ర గాయకులలో ఒకరిగా ఆమె పరిగణించబడుతుంది.<ref name=":0">{{Cite web|url=http://psusheela.org/interviews/aug042000screen.html|title=Melody Queen P. Susheela - Interviews|website=psusheela.org|access-date=2020-04-09}}</ref>
"https://te.wikipedia.org/wiki/పి.సుశీల" నుండి వెలికితీశారు