హైకూ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
తెలుగులో హైకూలను పరిచయం చేసింది [[ఇస్మాయిల్ (కవి)]] గారు<ref>తెలుగు సాహిత్య చరిత్ర, రచన:డాక్టర్ ద్వా.నా.శాస్త్రి, విశాలంధ్ర ప్రచురణలు, 2001, పుట-315</ref>. [[1991]]లో [[పెన్నా శివరామకృష్ణ]] ' రహస్యద్వారం ' పేరుతో తొలి తెలుగు హైకూ కవిత్వ సంపుటిని తీసుకవచ్చాడు. "చినుకుల చిత్రాలు" (2000),2003 లో ర్యాలి ప్రసాద్ "రాలిన పూలు"ప్రచురించాడు. పెన్నా శివరామకృష్ణ 2006 లో రెండు హైకూ సంకలనాలను కూడా ప్రచురించాడు. ప్రపంచంలోని, భారతదేశంలోని వివిధ భాషలలో వచ్చిన కొన్ని హైకూలను తెలుగులోనికి అనువదించి "దేశదేశాల హైకూ" (పాలపిట్ట బుక్స్ ప్రచురణ, 2009) అనే మరో అనువాద రచనను కూడా పెన్నా శివరామకృష్ణ వెలువరించాడు. "ప్రపంచ వ్యాప్త కవితా ప్రక్రియ హైకూ", "హైకూ - స్వరూప స్వభావాలు" అనే శీర్షికలతో పెన్నా శివరామకృష్ణ రాసిన రెండు వ్యాసాలు కూడా "దేశదేశాల హైకూ" పుస్తకంలో ప్రచురింపబడినాయి. [[1994]]లో [[గాలి నాసరరెడ్డి]] జపాన్ హైకూలను తెలుగులోకి అనువదించారు. ప్రస్తుతం [[తలతోటి పృథ్విరాజ్]] ' ఇండియన్ హైకూ క్లబ్ ' ని స్థాపించి ఈ ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించి, విరివిగా రాస్తున్నారు. హైకూ సంకలనాలు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. బి.వి.వి. ప్రసాద్, ర్యాలి ప్రసాద్,లలితానంద ప్రసాద్, వెంకటరావు, హైకూ వరలక్ష్మి మొదలగు తెలుగు కవులు హైకూలు రాస్తున్నారు.
 
తెలుగు హైకూ గురించిన మొట్టమొదటి విమర్శ గ్రంథం 'తెలుగులో హైకు కవిత్వం, అనుశీలన - ఒక పరామర్శ' 1992లో వచ్చింది. రచయిత మాకినీడి సూర్య భాస్కర్. దీనికి పీఠికను డాక్టర్ అద్దేపల్లి రామమోహన రావు రాశారు. హైకూ పరిశోధకులకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉందని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఆచార్యులు మేడపల్లి రవికుమార్ పేర్కొన్నారు. ఈ విమర్శ గ్రంథం కాక మాకినీడి ఐదు హైకూ కవితాసంపుటాలు ప్రచురించారు - హైకూ చిత్రాలు, ప్రకృతి (ఫోటో హైకూ), హైకూ-హైగా, రాలిన పుప్పొడి, ఋతురాగాలు అనేవి. 1990లో హైకూ ప్రక్రియ ప్రాధాన్యత పొందడంలో, హైకూ రహస్యాలను వివరించడం విశ్లేషణ చేయడంలో అద్దేపల్లిది ప్రధాన పాత్ర. హైకూ పై వీరి వ్యాసాలు హైకూ ఆ కవితా ప్రక్రియ రూపం ను విశ్లేషణ కు ఉపయోగపడింది. అలాగే శిఖామణి గారు రాసిన వ్యాస సంకలనం వివిధ (1998)లో 9-వ్యాసాలు ఉన్నాయి. దీనిలో ఒకటి హైకూ లపై ఉంది. ఈ వ్యాసం హైకూల పరిపుష్టిని వివరించింది. రెంటాల శ్రీ వేంకటేశ్వర రావు గారు రాసిన వ్యాస సంపుటి అవగాహన. దీనిలో సాహిత్య ప్రక్రియల స్వరూప స్వభావాలను వివరించారు. దీనిలో హైకూ ప్రస్తావన కూడా ఉంది. రెంటాల గారే రాసిన లోపలికి అనే మరో వ్యాస సంపుటిలో 17 వ్యాసాలు ఉన్నాయి.దీనిలో సైతం హైకూ వస్తువు ఉపన్యాసం అనే వ్యాసంలో హైకూ ప్రక్రియ పై విలువైన విషయాలు తెలిపారు. డా.తలతోటి పృధ్వీరాజ్ గారు తెలుగు హైకూల వ్యాప్తి కై ఇండియన్ హైకూ క్లబ్ ను అనకాపల్లిలో(2002) స్థాపించారు. ఇదే సంస్థ హైకూ సాహిత్య మాస పత్రిక (2003) ను స్థాపితం చేసి అక్షరకుటీరం పేరిట ఒక హైకూల సంకలనాన్ని (2004) వెలువరించింది.
 
== కొన్ని హైకూలు ==
"https://te.wikipedia.org/wiki/హైకూ" నుండి వెలికితీశారు