ఆనంద్ బక్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
'''ఆనంద్ బక్షి''' సుప్రసిద్ద హిందీ సినీ కవి. ఈయన అనేక జనరంజకమైన పాటలను రచించాడు.
==జీవిత విశేషాలు==
ఆనంద్ బక్షి (బక్షి ఆనంద్ ప్రకాష్ వైద్) ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న రావల్పిండిలో [[1930]], [[జూలై 21]]న జన్మించాడు.<ref>{{cite web|url=https://www.youtube.com/watch?v=PfaDScuTDTA|title=Anand Bakshi on TOTAL RECALL Part 1 (@Times Now)|accessdate=2012-01-29}}</ref> ఇతని పూర్వీకులు రావల్పిండి సమీపంలో ఉన్న కుర్రీ గ్రామానికి చెందిన మోహ్యాల్ బ్రాహ్మణులు. వీరి మూలాలు కాశ్మీర్‌లో ఉన్నాయి. ఇతడు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇతని తల్లి సుమిత్ర మరణించింది. విభజన సమయంలో ఇతని కుటుంబం పూనే, మీరట్‌ల గుండా ప్రయాణించి ఢిల్లీకి వలస వచ్చింది అక్కడ స్థిరపడింది.
 
ఇతని ప్రాథమిక విద్య అనంతరం ఇతడు భారతీయ సైన్యంలో చేరాడు. ఇతనికి చిన్నతనం నుండే కవిత్వం వ్రాయాలని ఉబలాటం ఉండేది. అయితే సైన్యంలో ఇతనికి సమయం దొరకక ఎక్కువగా వ్రాయడానికి కుదరలేదు. సమయం చిక్కినప్పుడల్లా ఇతడు కవిత్వం వ్రాసేవాడు<ref name="dd">{{cite web|last1=Tabassum|title=Interview with Anand Bakshi – Phool khile hain gulshan gulshan|url=https://www.youtube.com/watch?v=MFFwOfs1IWw&index=64&list=PL2SVX7hu8cbYppOhJk0K2XBZAec8zK2XZ|website=You Tube|publisher=Doordarshan|accessdate=5 July 2016}}</ref>. తన పాటలను సైన్యంలో స్థానిక కార్యక్రమాలలో ఉపయోగించేవాడు. సైన్యంలో ఇతడు ఎక్కువ కాలం పనిచేశాడు.
 
ఇతని ప్రాథమిక విద్య అనంతరం ఇతడు భారతీయ సైన్యంలో చేరాడు. ఇతనికి చిన్నతనం నుండే కవిత్వం వ్రాయాలని ఉబలాటం ఉండేది. అయితే సైన్యంలో ఇతనికి సమయం దొరకక ఎక్కువగా వ్రాయడానికి కుదరలేదు. సమయం చిక్కినప్పుడల్లా ఇతడు కవిత్వం వ్రాసేవాడు. తన పాటలను సైన్యంలో స్థానిక కార్యక్రమాలలో ఉపయోగించేవాడు. సైన్యంలో ఇతడు ఎక్కువ కాలం పనిచేశాడు.
==సినిమా రంగం==
ఇతడు హిందీ సినిమాలలో రచయితగా, గాయకుడిగా పేరు తెచ్చుకోవాలని ప్రవేశించాడు. కానీ చివరకు గేయ రచయితగా రాణించాడు. బ్రిజ్‌మోహన్ సినిమా ''భలా ఆద్మీ'' (1958) చిత్రంతో ఇతనికి గీతరచయితగా గుర్తింపు వచ్చింది. 1956 నుండి 1962 వరకు కొన్ని చిత్రాలకు పనిచేసినా 1962లో ''మెహెందీ లగీ మేరీ హాత్''తో ఇతని విజయ పరంపర ప్రారంభమయ్యింది. ఇతడు మొత్తం 638 హిందీ సినిమాలకు 3500లకు పైగా పాటలను వ్రాశాడు. ఇతని పాటలకు [[లక్ష్మీకాంత్-ప్యారేలాల్]], [[ఆర్.డి.బర్మన్]], కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, [[ఎస్.డి.బర్మన్]], అను మాలిక్, రాజేష్ రోషన్, ఆనంద్-మిలింద్ మొదలైన సంగీత దర్శకులు బాణీలు కూర్చగా, షంషాద్ బేగం, ఇలా అరుణ్, ఖుర్షీద్ బావ్రా, అమీర్‌బాయి కర్ణాటకి, సుధా మల్హోత్రా, [[కిశోర్ కుమార్]], శైలేంద్ర సింగ్, [[కుమార్ సానూ]], కవితా కృష్ణమూర్తి వంటి అనేక మంది గాయనీ గాయకులు ఇతని పాటలను ఆలపించారు.
"https://te.wikipedia.org/wiki/ఆనంద్_బక్షి" నుండి వెలికితీశారు