ఉత్తరార్ధగోళం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[దస్త్రం:Global_hemispheres.svg|thumb|నీలం రంగులో ఉన్నది ఉత్తరార్ధగోళం. ఈ బొమ్మలో అంటార్కిటికా కబడడంలేదు కాబట్టి, ఇది దక్షిణార్ధగోళం కంటే పెద్దదిగా కనిపిస్తోంది గానీ, రెండు అర్ధగోళాలూ సమానంగానే ఉంటాయి.]]
[[దస్త్రం:Northern_Hemisphere_Azimuthal_projections.svg|thumb|ఉత్తర ధ్రువం నుండి ఉత్తరార్ధగోళం]]
[[భూమధ్య రేఖ]]<nowiki/>కు ఉత్తరాన ఉన్న భూభాగమే '''[[ఉత్తరార్థగోళం]]'''. [[సౌరమండలము|సౌరకుటుంబం]]<nowiki/>లోని ఇతర గ్రహాల ఉత్తర దిశ, [[భూమి]] యొక్క ఉత్తర ధృవం సౌరకుటుంబపు తలానికి ఎటువైపున ఉంటుందో, అటువైపే ఉంటుంది.<ref name="report">[http://www2.keck.hawaii.edu/inst/people/conrad/research/pub/WGCCRE2009-preprint.pdf Report of the IAU Working Group on cartographic coordinates and rotational elements: 2009]</ref>
 
భూపరిభ్రమణతలం నుండి భూమి అక్షం కొంత కోణంలో వంగి ఉన్న కారణంగా ఉత్తరార్థగోళంలో [[చలికాలం|శీతాకాలం]] డిసెంబరు ఆయనం (డిసెంబరు 21) నుండి మార్చి [[విషువత్తు]] (మార్చి 20) వరకూ ఉంటుంది. వేసవి కాలం జూన్ ఆయనం (జూన్ 21) నుండి సెప్టెంబరు విషువత్తు (సెప్టెంబరు 23) వరకూ ఉంటుంది. కాలెండరు సంవత్సరానికి, [[ఖగోళ శాస్త్రము|ఖగోళ]] సంవత్సరానికీ మధ్య ఉన్నతేడా వలన ఈ తేదీలు ప్రతీ ఏడాదీ ఒకేలా ఉండక కొద్దిగా మారుతూ ఉంటాయి.
పంక్తి 12:
ఆర్కిటిక్ వలయానికి, [[కర్కట రేఖ|కర్కట రేఖకూ]] మధ్య ఉత్తర సమశీతోష్ణ ప్రాంతముంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో వేసవి, శీతాకాలాల మధ్య తేడా స్వల్పంగా ఉంటుంది. అయితే, ఈ శీతోష్ణస్థితి అనూహ్యంగా మారుతూ ఉంటుంది. 
 
[[భూమధ్య రేఖ]]<nowiki/>కు, [[కర్కట రేఖ]]<nowiki/>కూ మధ్య ఉన్నవి ఉష్ణ ప్రాంతాలు. ఇక్కడ సాధారణంగా ఏడాది పొడుగునా వేడిగా ఉంటుంది. వేసవిలో వర్షాకాలం వస్తుంది. శీతాకాలంలో పొడిగా ఉంటుంది.
 
ఉత్తరార్థగోళంలో, భూతలంపైన కదులుతున్న వస్తువులు కుడివైపు తిరిగే ప్రయత్నం చేస్తూంటాయి. దీనికి కారణం కొరియోలిస్ ఎఫెక్ట్. ఈ కారణంగా, భూతలంపై ప్రయాణించే గాలి, నీటి ప్రవాహాలు కుడివైపు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఒక బకెట్టులో కొంత ఎత్తునుండి నీళ్ళు పోసినపుడు ఆ నీళ్ళు కుడివైపు సుడి తిరగడం గమనించవచ్చు. 
 
ఇదే కారణం చేత, ఎత్తులనుండి ఉత్తరార్థగోళపు భూతలంవైపు కిందికి వచ్చే గాలి ప్రవాహాలు సవ్యదిశలో తిరుగుతూ నేలపై పరుచుకుంటాయి. అంచేత, అధికపీడన [[వాతావరణం]]<nowiki/>లో సవ్యదిశలో గాలి సుళ్ళు తిరగడం ఇక్కడి లక్షణం. ఇందుకు విరుద్ధంగా, భూతలం నుండి పైకిలేచే గాలి సృష్టించే అల్పపీడన ప్రాంతంలోకి చుట్టుపక్కల నుండి లాక్కునే గాలి అపసవ్య దిశలో సుడి తిరుగుతుంది. ఉత్తరార్థగోళంలో హరికేన్లు, [[తుఫాను|తుపాను]]<nowiki/>లూ అపసవ్యదిశలో సుడి తిరుగుతాయి. 
 
[[పలభా యంత్రము|నీడగడియారపు]] నీడ, ఉత్తరార్థగోళంలో సవ్యదిశలో తిరుగుతుంది. పగటివేళ, [[సూర్యుడు]] నడినెత్తికి చేరేక్రమంలో కొద్దిగా [[దక్షిణం]] వైపుకు ఉంటాడు. అయితే కర్కట రేఖకు, భూమధ్యరేఖకూ మధ్య మాత్రం, ఏడాదిలోని సమయాన్ని బట్టి ఉత్తరానికిగాని, నడినెత్తినగాని, దక్షిణానికి గాని ఉంటాడు.
"https://te.wikipedia.org/wiki/ఉత్తరార్ధగోళం" నుండి వెలికితీశారు