"గుండమ్మ కథ" కూర్పుల మధ్య తేడాలు

చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
కథలో చిన్న చిన్న మార్పులు చేసి [[డి.వి.నరసరాజు]]తో ట్రీట్మెంట్, మాటలు రాయించేశాడు నాగిరెడ్డి. సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]]ని అనుకున్నాడు. అయితే బి.ఎన్.రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడమూ, ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బి.ఎన్.రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డే వేరే దర్శకునితో చేద్దామని నిర్ణయించుకున్నాడు. [[పి.పుల్లయ్య]] దర్శకత్వం వహిస్తే బావుంటుందని, ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపాడు. అది చదివిన పుల్లయ్య ఈ కథ, ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది.<br />
ఈ స్క్రిప్ట్ తన సన్నిహితుడు, సహ నిర్మాత, రచయిత అయిన [[చక్రపాణి]]కి ఇచ్చాడు నాగిరెడ్డి. చక్రపాణికి వికలాంగులు, పిచ్చివాళ్ళతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు. దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు, ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాడు. దాంతో చక్రపాణి మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డాడు. [[విలియం షేక్‌స్పియర్]] రాసిన ''ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ'' నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశాడు.<br />
సినిమాకు దర్శకునిగా చివరకు [[కమలాకర కామేశ్వరరావు]]<nowiki/>ని ఎంచుకున్నాడు నాగిరెడ్డి. తర్వాత చక్రపాణి తిరగరాసిన కథకు ట్రీట్మెంట్, సీనిక్ ఆర్డర్ కోసం కథాచర్చలకు చక్రపాణితో, కమలాకర కామేశ్వరరావు, డి.వి.నరసరాజు కూర్చున్నారు. ఆ చర్చల్లో భాగంగా అప్పటివరకూ ఉన్న గుండమ్మ భర్త పాత్రను తీసేసి గుండమ్మను వైధవ్యం అనుభవిస్తున్నదానిగా చూపిద్దామని నిర్ణయించాడు చక్రపాణి. అయితే కళకళలాడుతూ, నగలతో పసుపుకుంకుమలతో గుండమ్మను చూపిద్దామనుకున్న దర్శకుడు కామేశ్వరరావు ఆశాభంగం చెందినా, కథకు ఉపయోగపడని, కథలో మలుపులకు కారణం కాని పాత్ర వ్యర్థమన్న దృష్టితో "పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పాత్ర మన కథకు అనవసరం" అంటూ తేల్చి, పాత్రను తొలగించేశాడు చక్రపాణి. మిగతా గుండమ్మ కుటుంబాన్నంతా యధాతథంగా తీసుకున్నారు.<ref name="ఈనాడు ఆదివారం.. 50 వసంతాల">{{cite journal|last1=వట్టికూటి|first1=చక్రవర్తి|title=యాభై వసంతాల గుండమ్మకథ|journal=ఈనాడు ఆదివారం|url=http://www.nandamurifans.com/main/gundamma-katha-50-years/|accessdate=19 August 2015|archive-url=https://web.archive.org/web/20150826010539/http://www.nandamurifans.com/main/gundamma-katha-50-years/|archive-date=26 ఆగస్టు 2015|url-status=dead}}</ref>
 
=== నటీనటుల ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2984906" నుండి వెలికితీశారు