మగ్దూం మొహియుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Author_of_the_Urdu_Poet_Makhdoom_Mohiuddin.jpgను బొమ్మ:Autograph_of_Urdu_Poet_Makhdoom_Mohiuddin.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (file renamed, redirect linked from other project).
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 26:
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
మగ్దూం మొహియుద్దీన్ [[తెలంగాణ]] లోని [[మెదక్]] జిల్లా [[ఆందోల్]]లో [[1908]], [[ఫిబ్రవరి 4]] న జన్మించాడు. ఆయన పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియొద్దీన్ ఖాద్రి (మహ్మద్‌ మగ్దూం మొహియుద్దీన్‌ హుజ్రీ). వీరి పూర్వీకులు [[ఉత్తర ప్రదేశ్]] లోని [[ఆజంగఢ్‌]]<nowiki/>లో ఉండేవాడు. ఆయన తాత (తల్లితండ్రి) రషీదుద్దీన్ [[ఔరంగజేబు]] సైన్యాలతో పాటు దక్కన్ పీఠభూమికి వచ్చాడు. అలాగే, మరో తాత (తంవూడికి తండ్రి) సయ్యద్ జాఫర్ అలీ కూడా ఉత్తరవూపదేశ్ షాజహానాబాద్ నుండి 1857లోనే దక్షిణానికి వచ్చాడు. ఆ రకంగా ఆ కుంటుంబమంతా [[హైద్రాబాద్]] దక్కన్ పరిసరాలకు చేరింది. ఆయన తండ్రి గౌస్ మొహియొద్దీన్ [[నిజాము]] ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మగ్దూం చిన్నతనంలోనే నాలుగేళ్ళయినా రాకముందే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. [[ప్రాథమిక విద్య]] [[హైదరాబాదు]] లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషను [[సంగారెడ్డి]]లోను చదివాడు. మఖ్దూం తండ్రి పరమ భక్తుడు- మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్. తల్లి- ఉమ్దా బేగం. భర్త మరణానంతరం ఆమె వేరే వివాహం చేసుకుంది. పినతండ్రి బషీరుద్దీన్ పెంచాడు. 1929లో [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో చేరాడు. పిన తండ్రి కొడుకు నిజాముద్దీన్ మఖ్దూమ్‌ను వెన్నంటి ఉన్నాడు. పినతండ్రి బషీరుద్దీన్ పెంపకంలో మఖ్దూమ్ సూఫీ మత సాంప్రదాయంలో క్రమశిక్షణతో పెరిగాడు.
 
== తొలి జీవితం - రచనా ప్రస్థానం ==
బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖలు’ ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. (ఆ పత్రిక సంపాదకుడు అబ్దుల్ ఖాదరీ సర్వరీ తర్వాతి కాలంలో కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ ఉర్దూ ప్రొఫెసర్‌గా పనిచేశాడు).
 
[[ఉస్మానియా యూనివర్సిటీ]]లో మఖ్దూమ్ (1934-37) హాస్టల్‌లో ఉండేవాడు. అక్కడ తన తొలి కవిత ‘టూర్’ 1934లో రచించాడు. మఖ్దూమ్, [[కవి]] గా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో [[రవీంద్రనాథ్ ఠాగూర్]] సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయిపోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన [[శాంతినికేతన్‌]]<nowiki/>కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. మఖ్దూమ్ ‘మర్షదే కామిల్’ అనే మరో నాటకం రాశాడు. 1937లో మఖ్దూమ్ తన 29వ యేట ఎం.ఎ. డిగ్రీ తీసుకున్నాడు. ‘ఉర్దూ నాటకం’పై ఒక పరిశోధన పత్రం కూడా రాశాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. [[కమ్యూనిస్టు]] రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు.
 
నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930-40లలో హైద్రాబాద్‌లో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. [[చండ్ర రాజేశ్వరరావు]], గులాం హైదర్, రాజ బహుదూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు.‘‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు.
పంక్తి 40:
*తన జూనియర్, హాస్టల్ మేట్ ఒకతను ఎప్పుడూ పచ్చ శాలువా కప్పుకుని తిరుగుతూ ఉండేవాడు. ఓ రోజు అతని శాలువాను ఎవరో దొంగిలించాడు. అది తెలిసి అతణ్ణి ఆట పట్టించడానికి మఖ్దూమ్ ‘పిలా దుశాల’ అనే పాట రాశాడు. హాస్యోక్తులు చిందిస్తూ, లయబద్దంగా సాగే ఆ పాట హైద్రాబాద్ విద్యార్థిలోకంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా, మంచి స్నేహితుడిలా ఉండే మఖ్దూమ్ విద్యార్థులందరికీ ఆత్మీయుడిగా ఉండేవాడు.
*హైద్రాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో [[బూర్గుల రామకృష్ణారావు]] ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫూల్‌చంద్ గాంధీ ఆరోగ్యశాఖ మంత్రి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన మఖ్దూమ్ ఆ శాఖలోని అవకతవకలు ఎత్తి చూపుతూ ‘‘ఫూల్ చన్ద్ - కాంటే బహుత్’’ (పువ్వులు కొంచెం - ముళ్ళేమో ఎక్కువ) అని చలోక్తి విసిరాడు.ఎంతటి గాఢమైన విషయాన్నైనా సున్నితమైన హాస్యాన్ని జోడించి, టూకీగా చెప్పేవాడు.
*ఆయన జైల్లో ఉన్నప్పుడు అన్నంలో ఒకసారి ఉడికిన [[తేలు]] బయటపడింది. ‘‘శాఖాహారులకు ఇలా బలవంతంగా మాంసాహారం వడ్డించడం తగదు’’ అన్నాడు. నాసిరకం కూరలని నిరసిస్తూ [[ఆకుకూరలు|ఆకుకూర]]<nowiki/>లతో తాళ్ళు పేని జైలర్‌కు బహూకరించాడు.
 
==విశేషాలు==
*మఖ్దూం బాల్యమంతా మతవిశ్వాసాలకు అనుగుణంగానూ, కష్టాల కడలిగానూ సాగింది. మజీద్‌ను శుభ్రంచేయడం, నీళ్ళు పట్టడం, క్రమం తప్పకుండా ఐదుసార్లు నమాజు చేయడం
*మఖ్ధూం ప్రతీ ఉదయం ఒక్కపైసాతో తాందూరీ రొట్టె తిని సాయంత్రంవరకు గడిపేవాడు.
*ఈయన చదివే ఉర్దూకవితలను [[దాశరథి|దాశరధి]] [[తెలుగు]]<nowiki/>లో అనువదిస్తూ గానం చేసేవాడు.
* బెర్నార్డ్ షా నాటకానికి ఉర్దూ అనువాదాన్ని టాగోర్ సమక్షం‌లో ప్రదర్శించగా రవీంద్రుడు వేదికపైకివచ్చి మఖ్దూం‌ను అభినందించాడు.
* సొంత ఇల్లులేని మఖ్దూం మజీదులోనే జీవించాడు
పంక్తి 80:
 
== మరణం ==
[[1969]], [[ఆగష్టు 25]] తేదీన [[గుండెపోటు]]<nowiki/>తో [[ఢిల్లీ]]<nowiki/>లో చనిపోయాడు. ఆయన పేరిట హైద్రాబాద్, [[హిమాయత్‌నగర్|హిమాయత్‌నగర్‌]]<nowiki/>లో సి.పి.ఐ. రాష్ట్ర కార్యాలయం మఖ్దూమ్ భవన్ నిర్మించారు.
 
==ఇవీ చూడండి==