మహర్షుల చరిత్రలు (ఆరవ సంపుటము): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 20:
'''మహర్షుల చరిత్రలు''' [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురించిన విశిష్టమైన ప్రామాణిక గ్రంథములు.
 
పవిత్ర [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఎందరో మహర్షులు అవతరించి బ్రహ్మనిష్ఠా గరిష్టులై లోకోపకారకములైన ఎన్నెన్నో ఘనకార్యాలు నిర్వర్తించారు. ప్రపంచ ప్రజలు వీరి ఋణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేదు. యుగయుగాల భారతీయ [[సంస్కృతి]]<nowiki/>నీ, [[విజ్ఞానము]]<nowiki/>ను విశ్వానికి చాటిన ధర్మస్వరూపులు వారు. తపస్స్వాధ్యాయ నిరతులై, నిగ్రహానుగ్రహ సమర్థులై, త్రికాలజ్ఞులైన మన మహర్షులు గురించిన విషయములెన్నో మన పురాణేతిహాసాలలో కనిపిస్తాయి. వారు స్వయంగా ధర్మములు ఆచరించి లోకానికి ఆదర్శప్రాయులైనారు. అనేక ధర్మశాస్త్రాలు రచించి ప్రపంచానికి ఉపకరించారు.
 
మహర్షుల చరిత్రలు 1989 వరకు ఏడు సంపుటములు వెలువడ్డాయి. ఇందు ఆరవ సంపుటమును 1988లో విద్వాన్ [[బులుసు వెంకటేశ్వర్లు|బులుసు వేంకటేశ్వర్లు]] రచించింది. వీరు అనేకములైన [[ఇతిహాసములు|ఇతిహాస]] పురాణాలను చక్కగా అవలోకనము చేసి సర్వజనావబోధకమైన సరళ సుందర శైలిలో రచించిరి.