సింధూ నది: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇండస్, ఇండియా: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
సింధు నదికి [[జీలం నది|జీలం]], [[చీనాబ్ నది|చీనాబ్]], [[రావి నది|రావీ]], [[బియాస్ నది|బియాస్]], [[సట్లెజ్ నది|సట్లెజ్]] ఉపనదులుగా ఉన్నాయి. ప్రవహించే ప్రాంతం అంతా భూమిని అత్యంత సారవంతంగా మారింది. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా ఆనకట్ట, సుక్కూలారు వంతెన, భారతదేశంలోని పంజాబులో [[సట్లెజు నది]] మీద [[భాక్రా డామ్|భాక్రానంగల్]] ఆనకట్ట వంటి భారీ ఆనకట్టలు కట్టి వ్యవసాయక్షేత్రాలకు నీటిని అందించి [[గోధుమ]], [[వరి]], [[చెరకు]] విరివిగా పండించడమేకాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తుంది. సింధు నది పొడవు 2880 కి.మీ. సింధునది ప్రవాహిత ప్రాంతంలో [[హరప్పా]], [[మొహంజో-దారో|మొహంజోదారో]] నాగరికత వర్ధిల్లింది. [[సింధు]] నదీ లోయలో సుమారు 5,000 సంవత్సరాల ఉజ్జ్వలమైన [[సింధు నాగరికత]] వెలసి వర్థిల్లింది.
 
సింధూ నది టిబెట్టులోని [[మానస సరోవరం]], కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీరులోని లడాఖు మీదుగా- గిల్గిట్‌ఉ, బాల్టిస్థాను నుండి పాకిస్థానులోని [[పంజాబ్, పాకిస్తాన్|పంజాబు]] రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారతులోని [[జమ్ము కశ్మీర్‌]], [[హిమాచల్‌ ప్రదేశ్‌]], [[పంజాబ్‌]], [[హరియాణా]], [[రాజస్థాన్‌]]ల మీదుగా ప్రవహించి [[పాకిస్తాన్‌]]లో ప్రవేశిస్తాయి. 3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. వార్షిక ప్రవాహ లెక్కల ప్రకారం సింధు నది ప్రపంచంలో కెల్లా 21వ అతిపెద్ద నదిగా రికార్డు నమోదు చేసింది.<ref>{{cite news|url=http://www.wapda.gov.pk/index.php/river-flow-in-pakistan|title=Indus water flow data in to reservoirs of Pakistan|accessdate=15 August 2017}}</ref> భారత పాకిస్తానులు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక [[సింధునదీ జలాల ఒప్పందం|అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడిక]]<nowiki/>ను కుదుర్చుకున్నాయి.
 
సింధూ నది ఒకరకంగా పాకిస్థానుకు జీవనాడి! [[పాకిస్తాన్]]లోని [[పంజాబ్‌]] రాష్ట్రంతో సహా ఆ దేశంలోని మొత్తం 65% భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలువల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. పాక్‌లోని 90% ఆయకట్టు ఈ కాలువల ద్వారానే సస్య శ్యామలమవుతోంది. పాకిస్థానులోని మూడు అతి పెద్ద ఆనకట్టలు, అనేక చిన్న ఆనకట్టలు సింధూ పరీవాహక ప్రాంతంలోనివే. సింధూ నది పాక్‌ విద్యుత్తు అవసరాలను, తాగు, సాగునీరు అవసరాలను తీర్చే కామధేనువు. ఈ ఆనకట్టలలో '''[[తర్బేల ఆనకట్ట]]''' ఒకటి.
"https://te.wikipedia.org/wiki/సింధూ_నది" నుండి వెలికితీశారు