ఎ.కోదండరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 16:
 
== విశేషాలు ==
కోదండరామిరెడ్డి [[నెల్లూరు జిల్లా]] [[మైపాడు]]లో మధ్య తరగతి [[వ్యవసాయం|వ్యవసాయ]] కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి వెంకూరెడ్డి, తల్లి రమణమ్మ. [[ఇందుకూరుపేట]], [[నరసాపురం]]<nowiki/>లలో చదువు కొనసాగించి, ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదువుకున్నాడు. విద్యార్థిదశనుండే నాటకాలంటే కోదండరామిరెడ్డికి పిచ్చి. పీయూసీ చదువుతూ మధ్యలోనే చదువు మానేసి సినిమాల్లో హీరో అవ్వాలనే కోరికతో రైలెక్కి [[చెన్నై|మద్రాసు]] వచ్చాడు. అక్కడ తన బంధువు ప్రభాకరరెడ్డి ద్వారా [[పి.చంద్రశేఖరరెడ్డి (దర్శకుడు)|పి.చంద్రశేఖరరెడ్డి]] పరిచయమయ్యాడు. అతని సలహా మేరకు హీరో వేషాలకై ప్రయత్నాలు మానివేసి [[మనుషులు మారాలి]] సినిమాకు [[వి.మధుసూధనరావు]] వద్ద సహాయ దర్శకుడిగా చేరాడు. వి.మధుసూధనరావు వద్ద సుమారు ఏడు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేసి అనుభవం సంపాదించుకున్నాడు. ఇతడు దర్శకునిగా తొలి అవకాశం [[రామ్ రాబర్ట్ రహీమ్]] సినిమాతో రావలసి ఉండగా నిర్మాత కొత్త దర్శకునితో రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడక పోవడంతో ఆ అవకాశం తప్పిపోయింది<ref>[https://web.archive.org/web/20070104182833/http://www.telugucinema.com/tc/stars/interview_akr_2006.php ఎ.కోదండరామిరెడ్డితో ఇంటర్వ్యూ]</ref>. తరువాత ఇతడు సూర్యనారాయణబాబు నిర్మాతగా [[సుజాత (నటి)|సుజాత]]ను కథానాయికగా నిర్మించబడిన [[సంధ్య (1980 సినిమా)|సంధ్య]] అనే సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించాడు.<ref name=ఈనాడు>{{cite news|last1=సంపాదకుడు|title=38 మెట్లు నేను ఎక్కా - ఎ.కోదండరామిరెడ్డితో ఇంటర్వ్యూ|url=http://telugucinemacharitra.com/దర్శకుడు-ఎ-కోదండరామిరెడ్/|accessdate=23 March 2018|work=ఈనాడు ఆదివారం|date=30 December 2007}}</ref><ref name=సాక్షి>{{cite news|last1=కె.క్రాంతికుమార్ రెడ్డి|title=తొలి సంధ్య వేళలో|url=http://telugucinemacharitra.com/దర్శకుడు-ఎ-కోదండరామిరెడ్/1-st-film-ak-reddy-1/|accessdate=23 March 2018|work=సాక్షి ఫన్‌డే|date=14 April 2013}}</ref>
 
సంధ్య సినిమా తరువాత ఇతనితో [[క్రాంతి కుమార్]] [[చిరంజీవి]] హీరోగా [[న్యాయం కావాలి]] సినిమా తీశాడు. ఆ సినిమా విజయవంతం కావడంతో ఇతని దర్శకత్వంలో చిరంజీవి హీరోగా అభిలాష, రక్తసింధూరం, మరణమృదంగం, ఛాలెంజ్, పసివాడి ప్రాణం, త్రినేత్రుడు, వేట, కిరాతకుడు, దొంగమొగుడు, కొండవీటి దొంగ మొదలైన సినిమాలు సుమారు 25 వరకు వెలువడ్డాయి. చిరంజీవిని ఎక్కువ సినిమాలకు డైరెక్ట్ చేసిన ఘనత ఇతనికే దక్కింది.<ref name=ఈనాడు />
"https://te.wikipedia.org/wiki/ఎ.కోదండరామిరెడ్డి" నుండి వెలికితీశారు