మహమ్మద్ ఖదీర్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 43:
''అవార్డు :'' 2013 మే 18...ప్రసిద్ధ కథకుడు [[మధురాంతకం రాజారామ్]] స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు, 2012 కి, ‘కథాకోకిల’ అవార్డు మహమ్మద్ ఖదీర్ బాబుకి [[హోసూరు]]లో కథకుల సదస్సులో ప్రదానం చేశారు.
 
''బ్రిటీష్ కౌన్సిల్ ఫెలోషిప్ : '' జూన్ 2013..[[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ప్రతిష్ఠాత్మక 'చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్ ' కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి.ఈ ఫెలోషిప్ [[హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ]] గెస్ట్ ప్యాకల్టీగా పనిచేస్తున్న నాగా మనోహర్ రెడ్డి ఈ కథలను [[అనువాదం]] చేయడానికి పొందారు. తెలుగు కథలకు ఈ ఫెలోషిప్ దొరకడం ఇదే తొలిసారి. ఖదీర్ బాబు తాజా పుస్తకం `మెట్రో కథలు`.
 
==రచనలు:==
పంక్తి 133:
===[[బాలీవుడ్ క్లాసిక్స్]]===
 
1970-80 మధ్యకాలంలో [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లో వచ్చిన సినిమాల కథనాలు, వాటి తెరవెనుక కథలు, నిర్మాణంలో ఎదురైన సాధక బాధకాలు, ఉత్తమ చిత్రాలుగా ప్రజల గుండెల్లో నిలవడానికి గల కారణాల విశ్లేషణలతో... 50 బాలీవుడ్ ఉత్తమ చిత్రాలను పరిచయం చేస్తూ సాక్షి ఫ్యామిలీలో మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన వ్యాసాల సంకలనం ‘బాలీవుడ్ క్లాసిక్స్’.
 
60వ దశకం నుండి 80 వ దశకం వరకూ హిందీ చిత్రసీమ నుండి వచ్చిన కొన్ని కళాత్మక చిత్రాలకు సంబంధించి రచయిత శ్రీ ఖదీర్‌బాబు, వారం వారం ఒక ప్రముఖ దినపత్రికలో రాసిన 50వ్యాసాలను `బాలీవుడ్ క్లాసిక్స్` పేరుతో సంకలనంగా ప్రచురించటం జరిగింది.
పంక్తి 161:
 
*'''ఒక సాయంత్రపు అదృష్టం:'''
ఈ కథను చెప్పటం కష్టం; ఎందుకంటే ఇందులో కథ కంటే అనుభూతి ఎక్కువ. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే కథానాయకుడు తన ఊహల్లో క్రియ కంటే ఎప్పుడూ ముందుండి, ప్రకృతి సహజమైన అనుభూతులకు దూరమవుతూ, వేదనకు లోనవుతుటాడు. అయితే ఒక [[వర్షం]] కురిసిన సాయంకాలం, పూలమ్మి అమ్మే పూలబుట్టలలోంచి వచ్చే పూల పరిమళాళలకు పరవశుడై, తన [[భార్య]]<nowiki/>కు అనూహ్యంగా సంతోషాన్ని కలిగించే, చిన్న చిన్న ఆశ్చర్యాలు కలిగించి ఆమెను సంతోషపెడ్తాడు. రేపు లేదన్నట్లుగా, ఆ సాయంత్రం వారిరువురిదే అన్నట్లుగా, ఆ రాత్రి అనుభవిస్తారు. మరుసటి రోజు ఎప్పటిలా తెల్లవారింది. కథానాయకుడిలో ఆశావాదం పెల్లుబికింది. అయినా రేపు మిధ్య, ఈ రోజే నిజం అన్నట్లుగా తన కర్తవ్యానికుపక్రమిస్తాడు.
 
*'''గెట్‌ పబ్లిష్‌డ్‌ :'''
పంక్తి 168:
“గెట్‌ పబ్లిష్‌డ్‌’లో (షకీల్‌ కాకుండా) మూడు పాత్రలు. ఒకటి ఏడేళ్ల ముష్టాక్‌. వాడు మసీదు దగ్గరికొచ్చేవారి చెప్పుల్ని భద్రపరిచి తిరిగి ఇచ్చేసే “”పని’’లో వున్నవాడు. “ముష్టాక్‌ నల్ల బంగారం. నల్ల ముత్యం. వాస్తవానికి వాణ్ణొక నల్లటి ముతకరబ్బరు బంతి అనాలి. చూడటానికి ముద్దుగా వుంటాడు. పట్టుకోవడానికి కండగా వుంటాడు’. “వాడి కళ్లల్లో కరెంటు ఉంటుంది. వొంట్లో తూనీగ ఎగురుతూ ఉంటుంది...’ వాడికి అమ్మా నాన్నా ప్రాణం. వారికి వీడు ఇంటిదీపం, కంటి వెలుగు. రెగ్యులర్‌గా మసీదుకు వచ్చీపోయే షకీల్‌కి -వీడొక ప్లెజంట్‌ స్మార్ట్‌ బాయ్‌. ముష్టాక్‌ తల్లి -ఫాతిమా -రెండోపాత్ర. “నేరేడు చెట్టు నీడలో, చుట్టూ చెప్పులు పెట్టుకుని, నల్లటి గువ్వలాగా...’ “ఆమె గొంతే ఆమె ఆకారం. ఆమె మాటే ఆమె వునికి...’ ఫాతిమా ఒక విలక్షణమైన ముస్లిం స్త్రీ. “మసీదులోని తెల్లటి గోడల మధ్య నల్లటి చారికలా కనిపిస్తూ ఉంటుందామె’ అంటాడు కథకుడు. ఇదీ వర్ణనాశిల్పం అంటే. పులుముడుకాదు. ఏకపదవాక్యంతో గుండె మీద ఆర్తినీ, అంత: కరణనీ గీరగలగాలి కథకుడు! ఆ తర్వాత ఆమె చుడీబజార్‌లో యాచిస్తూనూ కనిపిస్తూ ఉంటుందిట! ఇక, ఈమె భర్త- నయాబ్‌-మూడోపాత్ర. అతను అత్తర్‌ నయాబ్‌-పేరుకు. ఇతని కథ కొంచెం పెద్దదే. ఆటో డ్రైవర్‌గా, సెవెన్‌సీటర్‌ డ్రైవర్‌గా చేశాడు. ఏదీ అచ్చిరాలేదు. సంపాదనలేదు.
 
ప్రపంచంలో అక్కడక్కడా, అక్కడా ఇక్కడా -ఉగ్రవాదదాడులు, ఎవరు ఎవర్ని “టార్గెట్‌’ చేస్తారో, ఎందుకు చేస్తారో తెలీదు. విసిరిన పంజాదెబ్బకు ఎందరో మృతులు, ఎందరో క్షతగాత్రులు. అయితే పంజావిసిరిందెవరు? తెలీదు. అదో పెద్ద యక్షప్రశ్న. [[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లోనూ దుర్ఘటనలు. ఒక దురదృష్టకరరాత్రి.. బాగా పొద్దుపోయిన తర్వాత అన్నం ముందు కూర్చున్న నయాబ్‌ని లాగి, కొట్టి, ఫాతిమానీ నెట్టేసి గాయపరచి, ముష్టాక్‌కీ నాలుగు తగలనిచ్చి -నయాబ్‌ని “వాళ్లు’ లాక్కుపోయారు. ఆ తర్వాత జరగాల్సినదంతా జరిగింది. అదొక “ట్రీట్‌మెంట్‌ కథ’. ఇక్కడ ఫాతిమాని ఎవరు ఊరడించగలరు? ముష్టాక్‌ వొళ్లు తెలీని జ్వరంలో కాలిపోతున్నాడు. షకీల్‌ లాంటివాళ్లు అదీ ఇదీ చేద్దామని ముందుకొస్తే ఆమె తరస్కరిస్తుంది. ఉన్న వాళ్లిద్దరూ జీవచ్ఛవాలైనారు. దిగులు బండలయ్యారు. ఆ “ట్రామా’ అక్షరాలకి ఒదుగుతుందా!? చివరికి పదహారు రోజుల తర్వాత నయాబ్‌ని ఎవరో ఇంటి ముందు పడేసి పోయారు. కావడమే “మూలుగు’ వచ్చింది. బతికి వుండీ ఎందుకూ పనికిరాని ఒక మూటవచ్చింది. మీకూ నాకూ -నయాబ్‌ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి -చాలా “బతుకు’ చిత్రాలు దోహదం చేస్తాయి. కళ్లకు కడతాయి. “మళ్లీ నవంబర్‌ 26 వచ్చింది’! ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారో తెలీదు! అవును. ఇదే కథ! [[ముగ్గురు]] అమాయకుల ఛిద్రజీవన విషాదకావ్యం!
 
నయాబ్‌ [[కుటుంబము|కుటుంబం]] పడిన హింస. అనుభవించిన బాధ. జరిగిన హాని. ఎవరు బాధ్యుల? ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఇవీ షకీల్‌ అడగయే అడుగుతున్న ప్రశ్నలు. సభ్యసమాజం జవాబీయవలసిన ప్రశ్నలు. “ఈ దేశంలో కొందరు ఐడెంటీ చూపలేరు. అలాగని ఐడెంటిటీలేని వారుగా కూడా బతకలేరు. అందుకనే ఒక్కోసారి వాళ్ల ఐడెంటీయే వాళ్లకు ప్రమాదం తెచ్చిపెడుతూ వుంటుంది’! ఇదీ “గెట్‌ పబ్లిష్‌డ్‌’ కథానికకు ఇతివృత్త కేంద్రకం.
"https://te.wikipedia.org/wiki/మహమ్మద్_ఖదీర్_బాబు" నుండి వెలికితీశారు