వరాహగిరి వెంకట జోగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
'''వరాహగిరి వెంకట జోగయ్య''' ([[1870]] - [[1939]]) ప్రముఖ న్యాయవాది. [[స్వాతంత్ర్య సమరయోధుడు]], భారత రాష్ట్రపతి [[వి.వి.గిరి]] యొక్క తండ్రి.
 
వీరు గోదావరి జిల్లా [[చింతలపల్లి]] గ్రామంలో జన్మించారు. వీరి పెంపుడు తండ్రి నరసయ్య పంతులు [[మందస]] సంస్థానంలో కొంతకాలం దివానుగా పనిచేశారు. వీరు 1888 సంవత్సరంలో [[బరంపురం]] నేటివ్ కాలేజీలో ఎఫ్.ఏ. పరీక్ష పాసై, 1894లో ఫస్టు గ్రేడు [[ప్లీడరు]] పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. [[చెన్నై|మద్రాసు]] లా కాలేజీలో చదివే రోజుల్లో ఈయన [[టంగుటూరి ప్రకాశం పంతులు]] యొక్క సహాధ్యాయి. 1896లో బి.ఏ. పట్టా పుచ్చుకున్నారు. చిరకాలంలోనే వకీలు వృత్తిలో మంచి అభివృద్ధి సాధించారు. బరంపురం [[న్యాయస్థానం]]<nowiki/>లో ప్రముఖ న్యాయవాదిగా పేరుపొంది, బార్ అసోషియేషన్ ప్రెసిడెంటుగాను, పబ్లిక్ ప్రాసిక్యూటరుగాను కొంతకాలం ఉన్నారు. ప్రజాసేవ కార్యాలలో పాల్గొనడానికి వీరు పదవి అడ్డురావడంతో దానిని త్యజించారు. ఈయన [[బెంగాల్]] - [[నాగపూర్]] రైల్వే కార్మికుల సంఘపు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు.
 
వీరు చాలాకాలం మునిసిపాలిటీ, తాలూకా బోర్డులలోను సభ్యునిగా ఉన్నారు. 1907 నుండి 1917 వరకు అఖిల భారత [[కాంగ్రెసు]] కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. 1920లలో [[చిత్తరంజన్ దాస్]], [[మోతీలాల్ నెహ్రూ]] స్థాపించిన [[స్వరాజ్య పార్టీ]]లో చేరి, 1927 నుండి 1930 వరకు కేంద్రప్రభుత్వ శాసనసభలో ప్రజా ప్రతినిధిగా ఉన్నారు.