రామ్ రాబర్ట్ రహీమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''రామ్ రాబర్ట్ రహీమ్''' [[విజయనిర్మల]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. 1980లో విడుదలైన ఈ సినిమా 1977లో విడుదలైన హిందీ హిట్ చిత్రం "అమర్ అక్బర్ ఆంథొనీ" యొక్క పునర్ణిర్మాణం (రీమేక్).<ref>http://economictimes.indiatimes.com/Features/Business_of_Bollywood/Transcending_language_barrier/articleshow/3504534.cms</ref> హిందీ మూలంలో [[అమితాబ్ బచ్చన్]], వినోద్ ఖన్నా, రిషీ కపూర్ నటించారు. ఈ తెలుగు చిత్రంలో సూపర్ స్టార్ [[కృష్ణ]] రాబర్ట్ గానూ, [[రజనీకాంత్]] రామ్ గానూ, [[చంద్రమోహన్]] రహీం గానూ నటించారు. [[అంజలీదేవి]] రామ్ రాబర్ట్ రహీంల తల్లి పాత్రను పోషించింది. [[శ్రీదేవి]] రాబర్ట్ ప్రియురాలిగా నటించింది.
==కథ==
జగదీష్ ఒక డ్రైవరు. అతను, అతని భార్య, ముగ్గురుపిల్లలతో సంతోషమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తన యజమాని కన్నింగ్స్ దగ్గర విశ్వాసపాత్రమైన వ్యక్తిగా పనిచేస్తుంటాడు. ఒకసారి కన్నింగ్స్ యాక్సిడెంట్ చేసి, జగదీష్‌ని ఆ నేరం తనమీద వేసుకోమని ప్రాధేయపడతాడు. తాను జగదీష్ సంసారానికి నెలనెలా ఖర్చులు భరిస్తానని మాట ఇస్తాడు. విశ్వాసపాత్రుడైన జగదీష్ జైలుకెళ్తాడు. జైలు నుండి విడుదలై వచ్చిన జగదీష్ తన కుటుంబం చీకటితో నిండిపోయి ఉండడం గమనిస్తాడు. ఒకవైపు తన భార్య టీబీతో మంచాన పడివుంది. మరోవైపు దరిద్రం తాండవిస్తోంది. సహాయం కోసం తన యజమాని కన్నింగ్స్ వద్దకు వెళ్తాడు. కన్నింగ్స్ సహాయం చేయకపోగా, జగదీష్‌ని అవమానిస్తాడు. ఆవేశంతో జగదీష్ కన్నింగ్స్‌ని పిస్టల్‌తో కాల్చి అతని కారులోనే పారిపోతాడు.
 
జగదీష్ భార్య ఒక చీటీ తన పిల్లల చేతిలో ఉంచి, ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరుతుంది. కాని విధివశాన ఆమెకు చూపు పోతుంది. జగదీష తన ముగ్గురు పిల్లలను తీసుకుని బయలు దేరుతాడు. వాళ్ళను ఒక పార్కులో కూర్చోబెట్టి తాను ముందుకు సాగుతాడు. కారు ఒక దుర్ఘటనలో చిక్కుకుంటుంది. పెద్ద కొడుకు ఒక జీపుక్రింద పడగా పోలీస్ ఆఫీసర్ అతనిని తీసుకుపోతాడు. రెండవవాడు ఒక చర్చిలో ఫాదర్ దగ్గర దత్తపుత్రుడిగా పెరుగుతాడు. చిన్నవాడు ఒక ముస్లిం కుటుంబంలో పెరుగుతాడు. ఇలా జగదీష్ కుటుంబం విచ్చిన్నమౌతుంది. సంవత్సరాలు గడుస్తాయి.
 
==తారాగణం==
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]]
"https://te.wikipedia.org/wiki/రామ్_రాబర్ట్_రహీమ్" నుండి వెలికితీశారు