నర్తనశాల: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మిక్కిలినేని నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 27:
imdb_id = 0263778 }}
 
'''నర్తనశాల''' (ఆంగ్లం: NarthanaSala) [[మహాభారతం]]లోని [[విరాట పర్వం]] కథాంశం ఇతివృత్తంగా నిర్మితమై 1963 సంవత్సరములో విడుదలైన [[తెలుగు సినిమా]]. <ref name="నర్తనశాల చిత్ర సమీక్ష">{{cite journal|last1=ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=నర్తనశాల చిత్ర సమీక్ష|journal=విశాలాంధ్ర|date=13 October 1963|page=6|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=39948|accessdate=4 October 2017}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> పౌరాణిక ఇతివృత్తాలను తెరకెక్కించడంలో దర్శకులకున్న ప్రతిభను ఈ [[సినిమా]] మరొక్కసారి ఋజువు చేసింది. నటులు, దర్శకుడు, రచయిత, గీత రచయిత, సంగీత కళాదర్శకులు - ఇలా అందరి ప్రతిభనూ కూడగట్టుకొని ఈ సినిమా [[తెలుగు సినిమా చరిత్ర|తెలుగు చలన చిత్ర చరిత్రలో]] ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమా [[రాష్ట్రపతి]] బహుమానాన్ని, నంది అవార్డును గెలుచుకొంది. 1964లో [[ఇండొనీషియా]] రాజధాని, [[జకార్తా]]లో జరిగిన మూడవ ఆఫ్రో ఆసియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడు (ఎస్. వి. రంగారావు), ఉత్తమ కళాదర్శకుడు బహుమతులు గెలుచుకొంది.
 
==కథ==
[[బొమ్మ:Telugucinema Narthanasala SVR savitri.jpg|left|250px|thumb|కీచకునిగా ఎస్. వి. రంగారావు, ద్రౌపదిగా సావిత్రి]]
[[మహాభారతం]]లోని '[[విరాట పర్వం]]'లో జరిగిన [[పంచపాండవులు|పాండవుల]] అజ్ఞాతవాస గాథ ఈ చిత్రానికి ఇతివృత్తం. జూదంలోని షరతుల ప్రకారం రాజ్యభ్రష్టులైన పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం ముగించుకొన్న తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసిన సమయం ఆసన్నమైంది. అజ్ఞాతవాసం మధ్యలో భంగపడితే వనవాసం పునరావృతమౌతుంది.
 
[[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] సలహా ప్రకారం పాండవులు తమ ఆయుధాలను ఒక జమ్మిచెట్టుపై ఉంచి, గొప్ప గోసంపద గల విరాటరాజు కొలువులో తలదాచుకొంటారు. [[ధర్మరాజు]] ''కంకుభట్టు''గాను, [[భీముడు]] వంటలవాడు ''వలలుని'' గాను చేరుతారు. 'పేడివి కమ్ము' అని [[ఊర్వశి]] ఇచ్చిన శాపాన్ని అజ్ఞాతవాసములో వరంగా వినియోగించుకొని [[అర్జునుడు]] ''బృహన్నల''గా విరాటరాజు కుమార్తె [[ఉత్తర]]కు 'నర్తనశాల'లో నాట్యాచార్యుడౌతాడు. [[నకులుడు]] ''ధామగ్రంథి'' అనే పేరుతో అశ్వపాలకుడిగాను, [[సహదేవుడు]] ''తంత్రిపాలుడు'' అనే పేరుతో [[ఆవు|గో]]సంరక్షకుడిగానూ చేరుతారు. [[ద్రౌపది]] ''సైరంధ్రి''గా విరాటరాజు భార్య [[సుధేష్ణ]] పరిచారిక అవుతుంది.
 
పాండవుల అజ్ఞాతవాసాన్ని ఎలాగైనా భంగం చేయాలని [[కౌరవులు]] చారులను పంపి ప్రయత్నాలు సాగిస్తారు. [[పాండవులు]] ఈ విధంగా అజ్ఞాత వాసం వెలుబుచ్చుండగా ఒకరోజు విరాటరాజు బావ, ఆ రాజ్యానికి రక్షకుడు, మహా బలవంతుడు అయిన [[కీచకుడు|కీచకుని]] కన్ను [[ద్రౌపది]]పై పడుతుంది. ఉపాయంగా కీచకుని రాత్రివేళ నర్తనశాలకు పిలిపించి [[భీముడు]], అతడిని హతం చేస్తాడు.
 
కీచకుని మరణం సంగతి విని, అక్కడ పాండవు లుండవచ్చునని అనుమానించిన [[కౌరవులు]], వారి ఉనికిని బయట పెట్టేందుకు సుశర్మ సాయంతో దక్షిణ గోగణాలను బలవంతంగా తీసుకుపోతారు. వారిని ఎదుర్కోవడానికి విరాటుడు సకల సైన్యాలతో యుద్ధానికి వెళతాడు. ఇక కలుగులో ఎలుకలను లాగడానికి [[కౌరవులు]], భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులతో ఉత్తరగోగణాలను తోలుకుపోవడానికి వస్తారు.
 
"అంతఃపుర పరివారం తప్ప అంతా యుద్ధానికి వెళ్ళారే! అయినా ఫరవాలేదు. నేను కౌరవ సేనను వీరోచితంగా జయిస్తాన"ని పలికి విరాటుని కొడుకు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు. అతనికి సారథిగా బృహన్నల వెళతాడు. కాని కౌరవసేనను చూచి ఉత్తరునికి వణుకు మొదలై పారిపోజూస్తాడు. బృహన్నల అతనికి నచ్చచెప్పి, తన నిజ రూపం తెలిపి అర్జునుడుగా యుద్ధానికి వెళ్ళి, కౌరవసేనను సమ్మోహనాస్త్రంతో జయించి, గోవులను మళ్ళించుకు వస్తాడు. శుభప్రదంగా పాండవుల అజ్ఞాతవాసం ముగుస్తుంది. ఇదీ కథ.
 
==పాత్రలు==
పంక్తి 113:
*నిర్మాతలు: సి.శ్రీధరరావు, [[లక్ష్మీరాజ్యం]]
*దర్శకుడు: [[కమలాకర కామేశ్వరరావు]]
*
 
== నిర్మాణం ==
పంక్తి 135:
* అర్జునుడు ప్రయోగించిన [[సమ్మోహనాస్త్రం]] పనిచేసిన విధం అద్భుతంగా చూపించారు. అస్త్రం పైన ఒక స్త్రీ ప్రత్యక్షమై కూర్చుండి, మత్తుమందు (పిచికారీలాంటి సాధనంతో) సైన్యంపై చల్లుతుంది. అంతా వివశులైనాక విజయవంతంగా అందరివంకా కలయజూస్తుంది.
* ఈ సినిమాలో అర్జునుడు యుద్ధానికి వెళుతూ శంఖం పూరిస్తున్న చిత్రాన్ని [[తెలుగుదేశం పార్టీ]] పెట్టిన క్రొత్తలో ప్రచారానికి వాల్‌పోస్టరుగా వాడారు.
*వంటవాడైన భీముడు కీచకవధ చేశాడని భారతంలో ఉంది. ఆ కథని స్వీకరించి ఉత్తర నాట్యశాలలో కీచకవధ జరిగినట్లు, కొన్ని మార్పులతో విశ్వనాథ సత్యనారాయణ [[నర్తనశాల (నాటకం)|నర్తనశాల]] పేరుతో రాశారు. ఈ నర్తనశాల నాటకం, నర్తనశాల సినిమాకు స్ఫూర్తి అంటారు.
 
==ఇతర సాంకేతిక నిపుణులు==
పంక్తి 312:
* [https://web.archive.org/web/20070312145321/http://www.nbkfans.com/omegateluguslides/ns.html ఒక దినపత్రికలో వినాయకరావు వ్యాసం]
* [https://web.archive.org/web/20070704171452/http://www.ghantasala.info/tfs/cdataf78b.html ఘంటసాల. ఇన్ఫోలో నర్తనశాల సమాచారం]
* డి. వి. వి. ఎస్. నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి. సుశీల మధుర గీతాలు, జె. పి. పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 
==బయటి లింకులు==
* [https://www.youtube.com/watch?v=c68L_IONQvU యూ ట్యూబ్ లో నర్తనశాల పూర్తి సినిమా.]
 
<!-- ఇతర భాషల వికీలలో -->
 
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:శోభన్ బాబు నటించిన సినిమాలు]]
Line 329 ⟶ 330:
[[వర్గం:ధూళిపాళ నటించిన చిత్రాలు]]
[[వర్గం:మిక్కిలినేని నటించిన సినిమాలు]]
[[వర్గం:అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/నర్తనశాల" నుండి వెలికితీశారు