కొత్త సత్యనారాయణ చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

.
పంక్తి 81:
==తెలుగు పలుకు - ౨౦౦౭ , ౧౬వ [[తానా]] సమావేశాల జ్ణాపకసంచిక నుండి==
---------------
"కళాప్రపూర్ణులు"
(రచన: '''కొమ్మనేని వెంకట రామయ్య)'''
ఉభయ భాషా పండితులుగా, ఉపాధ్యాయులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తలుగా, సరస హృదయులుగా, కళాప్రపూర్ణులుగా,
Line 144 ⟶ 145:
పరిశోధన మొనర్చు వారికి ప్రోత్సాహకములు , ప్రకృష్ట ప్రభోదకములు కాగలవు. భావ విప్లవాలతో
వర్ధిల్లు లోకము యదార్ధానికై కృషి సల్పి భవ్య భారతమును నవ్యమొనర్చుకొందురు గాక?
----------------------------------------
 
'''పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి'''
 
(రచన : ఆచార్య యార్లగడ్డ బాల గంగాధర రావు )
 
తెలుగు చదువుల మాగాణం లో ఎందరో మహానుభావులు . ఆధునికాంధ్ర సరస్వతిని తమ అమూల్య రచనలతో కైనేసిన విద్వద్విమర్శక మండలిలో ముఖ్యులు పండిత శ్రీ కొత్త సత్యనారాయణ దేశికులు. సాహితి సమారాధకులుగా , సాహితీరంగంలో వారు మెట్టని చోటు , పట్టని ప్రక్రియ లేదు . కవిగా ,పండితుడుగా,నాటక కర్తలుగా ,కధకులుగా , సరస విమర్శకులుగా , సాహిత్యాభిలాషులందరకూ చిరపరిచితులు .అన్నింటికంటె మిన్న దేశికులుగా వారెందరికో విద్యాదానం చేసిన మహానుభావులు .ఉపాధ్యాయ పండిత పండిత పరిషత్తుకు కార్యదర్శిగా ,ఉపాద్యక్షులుగా , స్వసంఘానికి వారు చేసిన సేవ ఎంతో అమూల్యమైనది.
అటు జాతీయోద్యమానికి ఇటు సాహిత్యోద్యమానికి ఆటపట్టయిన గుంటూరు మండలం వీరిది. 1907 డిసెంబరు 31న వీరు తెనాలి తాలూక అమృతలూరులో,శ్రిమతి రాజరత్నమ్మ , బుచ్చయ్య చౌదరి గార్ల నోముల పంట గా జన్మించారు . ప్రాధమిక విద్యాభ్యాసానంతరం , స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు . ఆపిమ్మట చిట్టిగూదూరు నారసింహ సంస్కృత కళాశాలలో నాలుగేండ్లు గురుకుల వాసం గావించి , 1929 లో ఉభయ భాషాప్రవీణ పూర్తి చేసి అటు జన్మ వంశానికి , ఇటు విద్యావంశానికి వన్నెచిన్నెలు చేకూర్చి ఉభయ వంశ దీపకులుగా ప్రశస్తి గాంచారు.పండిత పట్టం పొందినది మొదలు , పి.బి.ఎన్. కళాశాలలో తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసే వరకూ , దాదాపు నాలుగు దశాబ్దాలు అధ్యాపక వృత్తి నెరపి , ఎందరందరో శిష్యులకు తమ విద్యావిజ్ఞానాలను పంచిపెట్టిన మహామనీషి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి.
ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో తెలుగునేల నాలుగు చెరగులా పునర్వికాసనోద్యమానికి దోహదకారిగా జాతీయవాదం వెల్లివిరిసింది .అదేసమయంలో సూత్రాశ్రమ స్థాపకులు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి హేతువాదతత్వం వేళ్ళూనుకొంటున్నది. ఇందులో రెండవ దానికి కార్యరంగం తెనాలి సీమయే కావడంతో , నాటి భావకులెందరిపైననో పై రెండింటి ప్రభావం విశేషంగా ప్రసరించింది , ప్రభావితంచేసింది. అట్టి ప్రభావితుల కోవలోని కోవిద్రగ్రామణులలో అగ్రేసరులు శ్రి కొత్త సత్యనారాయన చౌదరి గారు హేతువాద తత్వ ప్రభావంతో నిరంతర సత్యాన్వేషి అయ్యారు. ఈఅన్వేషణ ,అనంతర కాలంలో వీరు సంతరించిన రచనలలో స్పష్టంగా కానవస్తుంది . కలిపురాణం , రామాయణ రహస్యాలు , కల్పవృక్ష ఖండనం మొదలైన గ్రంధాలు వీరి సత్యాన్వేషణకు , తత్వాన్వేషణకు మారు రూపాలు.
యుగాలు నాలుగనీ, ధర్మ దేవత మొదట నాలుగు పాదాలా నడచి , నడచి ఆయాసం వచ్చి , కలియుగం లో ఒక కాలిమీదనే గెంతుతూ నడుస్తోందనీ ప్రబుధ్ధులు కొందరు చెప్తారు . వీరు తమ కలిపురాణం లో , యుగాలు నాలుగింటిలోనూ ,ఎన్నో అంశాలలో కలియుగమే మేలని సహేతుకంగా సిద్ధాంతీకరించారు. అంతేగాక , ఇందులో వీరు ఆర్య ద్రావిడ వర్గ విభేదం , వర్ణాశ్రమ వ్యవస్థ , అస్పృశ్యత ,రామాయణ భారత కాలాలనాటి సాంఘికాచారాలు, పురాణ పురుషుల జన్మ రహస్యాలు మొదలైన వాటిని గూర్చి ఎన్నో వివరాలను చక్కటి సాక్ష్యాలతో సహా బహిర్గతం చేసారు. నిజంగా ఇది వీరి పరిశీలనా పటిమకు పటిష్టమయిన సాక్ష్యం .
(ఇంకా ఉంది )....–
 
==మూలాలు==