ఫీనిక్స్ నగరం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 100:
=== ఫీనిక్స్ నగరస్థాపన ===
ఫీనిక్స్ నగర చరిత్ర అమెరికా అంతర్యుద్ధం‌లో పనిచేసిన ''జాక్‌స్విల్లింగ్''చే ఆరంభమైంది. ఆయన [[1850]] సంపదను వెతుక్కుంటూ వెళ్ళి మొదట ''వికెన్‌బర్గ్''లో పనిచేసాడు. [[1867]]లో అక్కడి నుంచి బయటబడి ''వైట్ టాంక్ మౌంటెన్'' క్రింది భాగంలో విశ్రాంతి కోసం ఆగినప్పుడు స్విల్లింగ్ అక్కడి ప్రదేశాన్ని పరిశీలించి అది అభివృద్ధి చేయటానికి అనువైన ప్రదేశంగా భావించాడు. అప్పటికే మెక్‌డ్వెల్ రేవు నిర్మాణంతో కొంత అభివృద్ధి చెంది ఉంది. ప్రదేశం,వాతావరణం అనుకూలంగా ఉందని నిరంతర నీటి సరఫరా ఉంటే అభివృద్ధి సాద్యమని అభిప్రాయపడ్డాడు. హోహోకామ్ ప్రజలు వదిలి వెళ్ళిన శిథిలాలు కాలువల రూపురేఖలను రేఖలను పరిశీలించి వాటిని పునరుద్దరిస్తే చక్కటి నీటి పారుదల సాధ్యమని స్విల్లింగ్ ఊహించాడు.
[[File:FAPRadio radioprogram showput on by children of Junior Artists Club Federal Art Project WPA Phoenix AZ 1935.gif|thumb|Radio program written and performed in Phoenix, Arizona, by children of Junior Artists Club (Federal Arts Program, 1935).]]
స్థానిక అమెరికన్‌ల పద్ధతిలో పలు కాలువలు నిర్మించాడు. క్రమంగా నదీతీరంలో నాలుగు మైళ్ళ విస్తీర్ణంలో చిన్న సమూహంతో కూడిన స్థిరనివాసాలూ ఏర్పడ్డాయి. ఇక్కడి కాలువల ప్రక్కన విస్తారంగా అతిపెద్ద ఆకారంలో పండిన గుమ్మడికాయల కారణంగా ఈ ప్రదేశానికి మొదటిగా ''పంప్‌కిన్ సిటీ'' (గుమ్మడికాయల నగరం)అని పిలవడం ఆరంభం అయింది. ఆతరువాత నిర్మించబడిన స్విల్లింగ్ మిల్లు కారణంగా హెల్లింగ్ మిల్ల్, మిల్‌ సిటీగా పిలువబడింది.
చివరికి ఈస్ట్ ఫీనిక్స్‌గా పిలువబడింది. కాన్ఫిడరేట్‌కి చెందిన పూర్వ సైనికుడు ''జనరల్ స్టోన్‌వాల్ జాక్‌సన్''గౌరవార్ధం స్విల్లింగ్ ఈ ప్రదేశానికి స్టోన్‌వాల్ సిటీ అని నామకరణం చేయాలని భావించాడు. ఇతరులు ''సలైనా '' అని పేరు సూచించారు. కానీ ఈపేర్లేవీ సమూహంచే అంగీకారం పొందలేదు. ఆఖరిగా ''లార్డ్ దారెల్ డుప్పా'' అక్కడి స్థానికులు వదిలి వెల్లిన శిథిలాల నుండి ఈ ప్రదేశం పునరుద్ధరింపబడిన దానికి గుర్తుగా ఫీనిక్స్ అని పేరు సూచించాడు. ఆ పేరు అందరి ఆమోదం పొంది స్థిరపడింది. ఆ ప్రదేశానికి చుట్టూ విస్తరించి ఉన్న ''యవాకోపీ కౌంటీ''కి చెందిన పర్యవేక్షకులు ఈ ప్రదేశాన్ని [[1868]], [[మే 4]]వ తారీఖున ఎన్నికల నియోజకవర్గంగా గుర్తించబడింది. జాన్ స్విల్లింగ్ పోస్ట్ మాస్టర్‌గా ఇక్కడ [[1868]], [[జూన్ 15]]న తపాలా కార్యాలయం ఆరంభించబడింది. నివాసితులు సంఖ్య అభివృద్ధి చెందుతున్న కారణంగా (అమెరికా జనాభా గణాంకాలు నిర్ధారించి జనసంఖ్య 240)పట్టణ నిర్మాణానికి ప్రదేశం అవసరమని భావించారు. [[1870]]సెప్టెంబర్ 20న ప్రజలంతా కూడి నగర నిర్మాణం ఎక్కడ నిర్మించాలో నిర్ణయించారు. 320 ఎకరాల ప్రాంతాన్ని నగర నిర్మాణం కొరకు కొనుగోలు చేయబడింది. అదే నగర వ్యాపారకూడలిగా అభివృద్ధి చెందిన ప్రస్తుత డౌన్ టౌన్.
"https://te.wikipedia.org/wiki/ఫీనిక్స్_నగరం" నుండి వెలికితీశారు