కోలంక వెంకటరాజు: కూర్పుల మధ్య తేడాలు

231 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ఇతడు మృదంగ విద్వాంసుల కుటుంబంలో 1910లో జన్మించాడు. ఇతడు మొదట తన పినతండ్రి చినరామస్వామి వద్ద మృదంగం అభ్యసించాడు. తర్వాత [[కాకినాడ]]లో మురమళ్ళ గోపాలస్వామి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. తన 8వ యేట నుండే ఇతడు అనేక మంది విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందించాడు. [[తుమరాడ సంగమేశ్వరశాస్త్రి]], [[ద్వారం వెంకటస్వామి నాయుడు]],అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], పల్లడం సంజీవరావు, [[ఈమని శంకరశాస్త్రి]], స్వామినాథ పిళ్ళె,[[హరి నాగభూషణం]], [[పారుపల్లి రామక్రిష్ణయ్య]], మునుగంటి వెంకట్రావు, ఈమని అచ్యుతరామశాస్త్రి, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, హరికేశనల్లూరు ముత్తయ్య భాగవతార్, టి.ఆర్.మహాలింగం, [[శ్రీపాద పినాకపాణి]], [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], టి.కె.జయరామ అయ్యర్, మహరాజపురం విశ్వనాథ అయ్యర్, మధురమణి అయ్యర్, ముదికొండాన్ వెంకట్రామ అయ్యర్, టి.కె.రంగాచారి, [[ఓలేటి వెంకటేశ్వర్లు]], [[నేదునూరి కృష్ణమూర్తి]] వంటి విద్వాంసుల కచేరీలలో మృదంగం వాయించాడు.
 
ఇతడు [[తుని]]లో ఇంటివద్దనే గురుకుల పద్ధతిలో ఎంతో మంది శిష్య ప్రశిష్యులను తయారు చేయడంతో బాటు [[విజయనగరం]] [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]], [[హైదరాబాదు]] [[శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.
 
ఇతడిని అనేక సంస్థలు సన్మానించాయి. 1930లో విజయనగరం ఆంధ్రభారతీ తీర్థ, 1942లో కాకినాడ సంగీత విద్వత్సభ, 1971లో విజయవాడ విజయదుర్గా సంగీత విద్వత్సభ మొదలైన సంస్థలు ఇతడిని సత్కరించాయి. తన స్వగ్రామం తునిలో పౌరులు ఇతనికి 1957లో "మృదంగ ఆదిత్య" అనే బిరుదుతో గౌరవించారు. ఇంకా ఇతనికి పలు సంస్థల నుండి "మార్దంగికాగ్రేసర", "మార్దంగిక శిరోమణి", "మృదంగలహరి" వంటి బిరుదులు లభించాయి. [[ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ]]కి ప్రారంభం నుంచి సభ్యునిగా ఉన్నాడు<ref name="గానకళ">{{cite journal |last1=మధునాపంతుల వెంకట సూర్యనారాయణ శర్మ |title=మార్దంగిక శిరోమణి శ్రీ కోలంక వెంకట్రాజు |journal=గానకళ |date=1 December 1962 |volume=1 |issue=7 |pages=17-21 |url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=13022 |accessdate=6 February 2021}}</ref>. 1979లో ఇతనికి కర్ణాటక సంగీత వాద్యం విభాగంలో [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] నుండి [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]] లభించింది<ref>[https://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=554&at=2 సంగీత నాటక అకాడమీ సైటేషన్]</ref>.
74,695

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3124312" నుండి వెలికితీశారు