కేదార్నాథ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
→కేదార్నాథ్ ఆలయం: Corrected some spelling mistakes ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 69:
==కేదార్నాథ్ ఆలయం==
[[బొమ్మ:Uttarakhand locator map.svg|thumb|కేదార్నాథ్|280x280px]]
కేదార్నాథ్ ఆలయం పవిత్రమైన శైవక్షేత్రం.
ఆలయం ముందరి భాగంలో [[కుంతీదేవి]], [[పంచ పాండవులు]], [[శ్రీ కృష్ణుడు|శ్రీకృష్ణు]]ని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి [[శివుడు]] భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కథనం. తలభాగం [[నేపాల్]] లోని పసుపతినాధుని [[ఆలయం]]లో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.
|