పీలా కాశీ మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 47:
 
[[వంశీ]] మొదటిచిత్రం 'మంచు పల్లకీ'లో చిన్న పాత్ర పోషించారు. '[[అన్వేషణ]]'లో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే [[అనకాపల్లి]] వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. 'లేడీస్‌ టైలర్‌'లో బట్టల సత్యం పాత్ర తరవాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. '[[తమ్ముడు]]' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ [[నంది అవార్డు]]ను పొందారు. [[ఏప్రిల్‌ ఒకటి విడుదల]], [[కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు]], [[హలో బ్రదర్]]‌, [[అలీబాబా అరడజను దొంగలు]], [[ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు]], [[బద్రి]], [[ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు]], [[ఎవడిగోల వాడిది]]... లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం 'మహా నగరంలో'.
==పురస్కారాలు==
*[[తమ్ముడు]]' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వ [[నంది అవార్డు]].<ref name=hinduonnet>ఈనాడు దినపత్రిక వెబ్సైట్ నుండి [http://www.hinduonnet.com/thehindu/mp/2006/01/21/stories/2006012100830100.htm Comedy is his forte ] వివరాలు[[జూన్ 25]],[[2008]]న సేకరించబడినది. </ref>
*రఘుపతి వెంకయ్య బంగారు పతకం (ప్రముఖ నటుడు [[గుమ్మడి]] స్థాపించారు)<ref name=hinduonnet>
==పదవులు==
*[[తెలుగుదేశం పార్టీ]]తో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.